13
March, 2026

A News 365Times Venture

13
Friday
March, 2026

A News 365Times Venture

Off The Record: ఆ జనసేన ఎంపీ పర్ఫార్మెన్స్‌లో తక్కువ..! ప్రమోషన్స్‌లో ఎక్కువ..?

Date:

Off The Record: తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్….. జనసేన కాకినాడ ఎంపీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరుపున పోటీ చేసి గెలిచిన ఎంపీ సాబ్‌…. ఇప్పుడు ఔటాఫ్‌ కాలింగ్‌ ఏరియా అట. ఎన్నికల ప్రచారంలో ప్రజాసేవ, ప్రజాసేవ అంటూ పలవరించిన ఉదయ్‌ శ్రీనివాస్‌…. తీరా గెలిచాక… స్వయం సేవకే పరిమితం అయ్యారన్నది కాకినాడ వాయిస్‌. ఆయనకు ఇప్పుడు వ్యాపార వ్యవహారాలు తప్ప మరేమీ కనిపించడం లేదని జనసేన వర్గాలే చెప్పుకుంటున్న పరిస్థితి. పైగా చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ అన్నట్టుగా ఉందట వ్యవహారం. మనోడు మామూలుగా పని చేసేది తక్కువ. ఒకవేళ చేసినా… పావలా పనికి రూపాయి పావలా ప్రచారం చేసుకుంటున్నారన్నది లోకల్‌ టాక్‌. పైగా… ఎప్పుడెప్పుడో వచ్చిన నిధుల్ని సైతం తన ఖాతాలో వేసుకుని బిల్డప్‌లు ఇస్తున్నారట. అందుకోసం సోషల్ మీడియాలో పోస్టింగ్స్‌ పెట్టి… తాను కాకినాడ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఎక్కడికో తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నానని రాతలు రాసేసుకుంటున్నట్టు చెబుతున్నారు. కానీ… వాస్తవాలు తెలిసిన జనం నవ్వుకుంటుండటంతో… సార్‌ పోస్టింగ్స్‌ రివర్స్‌ కొడుతున్నాయట. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రసాద్ స్కీం కింద గతంలోనే ఎంపిక అయింది అన్నవరం దేవస్థానం. గత ఎన్నికలకు ముందు స్వయంగా ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు.

Read Also: Janasena: కొందరు జనసేన నేతలతో పార్టీకి చెడ్డపేరు..! వినుత దంపతుల ఆరోపణలతో రాజకీయ కలకలం..

అయితే టెండర్ల ప్రక్రియ ఆలస్యమై ఇప్పుడు పనుల ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇంకేముంది…. ఇలాంటి ఛాన్స్‌ కోసమే ఎదురుచూస్తున్నానన్నట్టుగా… ఉదయ్ శ్రీనివాస్ యాక్టివ్‌ అయిపోయారు. నేను ఒత్తిడి చేయడం వల్లే.. సత్యదేవుని సన్నిధికి ఈ నిధులు వచ్చాయి. పనులు మొదలుపెట్టబోతున్నాం…. కేంద్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలంటూ సోషల్‌ మీడియాలో డప్పు వాయించడం మొదలుపెట్టేశారట. అలాగే ఫ్లెక్సీల హడావిడి కూడా మొదలైపోయింది. ఇది చూసి ప్రతిపక్షం వైసీపీనే కాదు… సొంత కూటమిలోని మిగతా పార్టీల నాయకులు కూడా అవాక్కవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. నాన్ లోకల్ వాళ్ళు ఎంపీలు అయి… ముందు వెనకా తెలుసుకోకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుందని మాట్లాడుకుంటున్నారట. ఎంపీ సొంత నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అది వేరే సంగతిగానీ….. తనను గెలిపించిన నియోజకవర్గంలో ముందు ఏం జరిగింది? అసలు ఆ స్కీం ఎప్పుడు ప్రారంభమైందన్న ప్రాధమిక విషయాలు తెలుసుకోకుండా…. చేతిలో ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది పోస్ట్‌ చేస్తే…. ట్రోలింగ్స్‌ మామూలుగా ఉండవని గుర్తు చేస్తున్నారు. వైసీపీ అయితే… ఓ అడుగు ముందుకేసి మీరు చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పుకోండి ఎంపీ గారు… అని సెటైర్లు వేస్తోందట. మరోవైపు రాష్ట్రంలో ఏ లోక్‌సభ నియోజకవర్గానికి లేనివిధంగా కాకినాడకు కోట్ల రూపాయల నిధులు తీసుకు వచ్చానని ఉదయ్ ప్రచారం చేసుకుంటున్నారు.

Read Also: Tragic : యాదాద్రిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య

కానీ… కేంద్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలకు ఇచ్చే నిధులు కాకుండా ఈయనగారు సొంతంగా తెచ్చింది ఏమీ లేదని కాస్త వెటకారంగానే అంటున్నారట కాకినాడ జనం. మరీ… అంత స్పెషల్ గా తెచ్చుకుంటే అవి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఎలా ఖర్చు పెడతున్నారో చెప్పండి సారూ.. అంటూ ఎకసెక్కాలాడుతున్నారట స్థానికులు. అదంతా ఒక ఎత్తయితే…. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎంపీని దూరం పెట్టారనే టాక్ నడుస్తోంది జనసేన వర్గాల్లో. మరీ… ఎక్కువ చేస్తున్నారన్న కారణంగా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకినాడ ఎంపీ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా 5చోట్ల టిడిపి శాసనసభ్యులున్నారు. ఉదయ్ శ్రీనివాస్ మొదటి నుంచి పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ కి ఎంపీ అని సెటైర్లు వేసేవారు అంతా. అయితే… పిఠాపురం జనసేన కోఆర్డినేటర్‌గా మారెడ్డి శ్రీనివాస్‌ని నియమించారు పవన్. నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను ఆయనే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఎంపీ ఉదయ్‌కు మారెడ్డి తో కూడా చెడిందనేది లోకల్‌ టాక్‌. పార్టీ కూడా మారెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయడంతో ఎంపీ సైలెంట్ అవ్వక తప్పలేదంటున్నారు. ఇక పెద్దగా పని లేదని ఫిక్స్ అయిపోయి తన వ్యాపార విస్తరణ మీద దృష్టి పెట్టి నియోజకవర్గంలో ఉండటానికి పెద్దగా ఇష్టపడడం లేదని చెప్పుకుంటున్నారు. దీంతో…. ఆయన పేరు చెప్పి అనుచరులు ఎంపీ గారి తాలూకా అంటూ బాగానే సైడ్ బిజినెస్‌లు చేసేసుకుంటున్నట్టు సమాచారం. మొత్తానికి కాకినాడ ఎంపీ…. సోషల్ మీడియాలో సంబంధం లేని పోస్టింగ్స్‌ పెట్టి హైలైట్‌ అయిపోదామనుకుంటే… ఉన్న లైట్స్‌కు కూడా ఫ్యూజ్‌లు పోతున్నాయంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే… సింగిల్ టైం ఎంపీగా మిగిలిపోతారని, ఇప్పటికైనా… సందర్భానికి తగ్గట్టు వ్యవహరించాలన్న వార్నింగ్స్‌ వస్తున్నాయట ఉదయ్‌శ్రీనివాస్‌కు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಇಂದು ರಾಜ್ಯ ಬಿಜೆಪಿ ಕೋರ್ ಕಮಿಟಿ ಸಭೆ: ಸಂಭಾವ್ಯ ಅಭ್ಯರ್ಥಿಗಳ ಕುರಿತು ಚರ್ಚೆ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,13,2026 (www.justkannada.in): ಇಂದು ರಾಜ್ಯ ಬಿಜೆಪಿ ಕೋರ್ ಕಮಿಟಿ ಸಭೆ...

ഇറാന്റെ വൈദ്യുതി സംവിധാനത്തെ തകര്‍ക്കുമെന്ന് ട്രംപ്; അരമണിക്കൂറിനുള്ളില്‍ മേഖലയെ മുഴുവന്‍ ഇരുട്ടിലാക്കുമെന്ന് ലാരിജാനി

ടെഹ്‌റാന്‍: ഇറാന്റെ വൈദ്യുതി സംവിധാനങ്ങളെ ആക്രമിച്ചാല്‍ അര മണിക്കൂറിനകം മേഖലയെ പൂര്‍ണമായും...

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా పరిస్థితి విషమం.. తాజా అప్‌డేట్ ఏంటంటే!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఎన్నికయ్యాడు. దాదాపు...