21
September, 2026

A News 365Times Venture

21
Monday
September, 2026

A News 365Times Venture

Seediri Appalaraju: మందు మీద అధనంగా జీఎస్టీ ఏంటి? మాజీ మంత్రి అప్పలరాజు ప్రశ్న..

Date:

కూటమి నాయకులు మట్టి, గ్రావెల్ మీద దోచుకుని లోకల్ జీఎస్టీ వేస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మందు మీద అధనంగా జీఎస్టీ ఏంటి? అని ప్రశ్నించారు. ప్రతి మద్యం బాటిల్ మీద రూ.10 అదనంగా తీసుకోవడం వాస్తవం కాదా? అని నిలదీశారు. ఎమ్మెల్యే ప్రమేయం లేకపోతే అధనపు వసూళ్లు ఆపాలని డిమాండ్ చేశారు. గాడిదలు కాయడానికే ఎమ్మెల్యే అయిపోతారని సెటైర్ వేశారు. సారాతో రాజీకీయాలేంటి ? అని మండిపడ్డారు. అధనపు వసూళ్లలో ఎమ్మెల్యే ప్రమేయం ఉందని ఆరోపించారు. గతంలో పలాస నియోజకవర్గంలో శివాజీ , ఆయన అల్లుడు అధనంగా లోకల్ అల్లుడు ట్యాక్స్ వసూలు చేశారని ఆరోపణలు చేశారు.

READ MORE: AP Education Department: జూలై నుంచి ప్రతి పాఠశాలను తనిఖీ చేయనున్న అధికారులు.. ఎందుకంటే?

అందుకే ‌పవన్ కళ్యాణ్ పెట్టిన పేరు అల్లుడు టాక్స్ అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు‌.. పలాస నియోజకవర్గంలో 22 మద్యం షాపులు ఉన్నాయని తెలిపారు. రోజుకు సగటున 550 మద్యం , 350 బీర్ కేస్ లు విక్రయిస్తారన్నారు. రోజుకు 30 వేల బాటిళ్లు అమ్మకాలు జరుగుతాయని.. బాటిల్ పై అధనంగా రూ . 10 లోకల్ జీఎస్టీ పేరిట అక్రమ వసూళ్లు చేసి.. నెలకు రూ. 90 లక్షలు ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత లోకల్ జీఎస్టీ అధనంగా యాడ్ అయ్యిందని ఎద్దేవా చేశారు.

READ MORE: Upcoming EV Cars: ఎంజీ నుంచి టాటా వరకు.. విడుదలకు సిద్ధమవుతున్న EV కార్లు ఇవే!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ബ്രാഹ്‌മണ്യത്തെ ഹൃദയത്തില്‍ കൊണ്ടുനടക്കുന്നവരാണ് ഈഴവര്‍: ജി.സുധാകരന്‍

ആലപ്പുഴ: ബ്രാഹ്‌മണ്യത്തെ ഹൃദയത്തില്‍ കൊണ്ടുനടക്കുന്ന ബ്രാഹ്‌മണരല്ലാത്ത വിഭാഗമാണ് കേരളത്തിന്റെ 33 ശതമാനം...

“தொழிலதிபர் வீரமணி தப்பியது எப்படி? ஸ்டாலின் பதில்சொல்ல வேண்டும்" – அமைச்சர் நிர்மல் குமார்

திமுக ஆட்சிக் காலத்தில் சிறுமிகள் மீதான பாலியல் குற்றச்சாட்டில் சிக்கிய ஜெம்...

Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…

విజయనగరంలో జరిగిన వైఎస్సార్‌సీపీ సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స...

ಒಬ್ಬ ನಿರಪರಾಧಿಯ ರಾಜೀನಾಮೆ ಪಡೆದಿದ್ದೇನೆ- ಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್‌

ಬೆಂಗಳೂರು,ಸೆಪ್ಟಂಬರ್‌,21,2026 (www.justkannada.in) ರಾಜ್ಯದಲ್ಲಿ ಇಂದಿನಿಂದ ಮೂರು ದಿನಗಳ ಕಾಲ ವಿಧಾನಮಂಡಲ...