18
March, 2026

A News 365Times Venture

18
Wednesday
March, 2026

A News 365Times Venture

Sajjala Ramakrishna Reddy: జూన్ 4న ఏపీవ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’కార్యక్రమం.. సజ్జల కీలక ఆదేశాలు..

Date:

Sajjala Ramakrishna Reddy: వైసీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ముఖ్యనేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. ఇక, ప్రజల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జూన్‌ 4వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే, జిల్లా కలెక్టర్లకు, నియోజకవర్గ స్ధాయి అధికారులకు మెమోరాండం సమర్పించాలని సూచించారు.

Read Also: Vijay Mallya Tweet On RCB: ఆర్‌సీబీని ప్రశంసిస్తూ విజయ్‌ మాల్యా ట్వీట్‌.. నెటిజన్స్ ట్రోలింగ్

అయితే, రాష్ట్రంలో ప్రజలను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు అని సజ్జల తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్యాడర్‌తో పాటు ప్రజలను కూడా భాగస్వామ్యం అయ్యేలా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಭೇಟಿಯಾಗಬೇಕಿತ್ತು, ಆದ್ರೆ ಆಗಲಿಲ್ಲ- ಮಾಜಿ ಸಚಿವ ಕೆ.ಎನ್ ರಾಜಣ್ಣ

ನವದೆಹಲಿ,ಮಾರ್ಚ್,18,2026 (www.justkannada.in):  ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರನ್ನ ಭೇಟಿಯಾಗಬೇಕಿತ್ತು...

ഇറാന്‍ ഇന്റലിജന്‍സ് മന്ത്രി എസ്മായില്‍ ഖത്തീബിനെ കൊലപ്പെടുത്തിയെന്ന് ഇസ്രഈല്‍

ടെല്‍ അവീവ്: ഇറാന്റെ ഇന്റലിജന്‍സ് മന്ത്രി എസ്മായില്‍ ഖത്തീബിനെ വധിച്ചതായി ഇസ്രഈല്‍...

“ராகுல் காந்தியைப் பார்க்கும்போது அசௌகரியமாக இருக்கிறது" – கங்கனா ரனாவத்

நாடாளுமன்றத்தின் பட்ஜெட் கூட்டத்தொடர் நடந்து வருகிறது. எரிவாயு தட்டுப்பாடு முதல் ஈரான்...

Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు

Pinnelli Ramakrishna Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ...