6
May, 2026

A News 365Times Venture

6
Wednesday
May, 2026

A News 365Times Venture

Coronavirus: విశాఖపట్నంలో కరోనా పాజిటివ్ కేసు.. చుట్టుపక్కల వారందరికీ టెస్టులు!

Date:

విశాఖపట్నంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముగ్గురికీ నెగెటివ్‌గా రిజల్ట్స్ వచ్చింది. మహిళను వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. మహిళ ఇంటి చుట్టుపక్కల వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Also Read: Coronavirus: కరోనా వైరస్ పట్ల తక్షణ అప్రమత్తం.. ఆరోగ్యశాఖ సూచనలు జారీ!

పిఠాపురం కాలనీకి చెందిన వివాహితకు కొన్నిరోజులుగా ఆరోగ్యం బాలేదు. ముందుగా మలేరియా, డెంగ్యూ అని భావించిన వైద్యులు పరీక్షలు చేశారు. చివరకు కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విజయ డయాగ్నోస్టిక్స్ విశాఖపట్నంలో జరిపిన పరీక్షలో పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. అయితే బాధితురాలు కోలుకుంది. ఈ సాయంత్రానికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి.. వారం రోజులు పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారు. కోవిడ్ 19 పాజిటివ్ కేస్ వచ్చిన పరిసర ప్రాంతాల్లో మూడు టీంలతో ఇంటింటికి సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ബംഗാളിൽ ജനാധിപത്യം കൊലചെയ്യപ്പെട്ടു, ബി.ജെ.പിയുടെ ജൈത്ര യാത്ര പഞ്ചാബിൽ അവസാനിക്കും; കെജ്‌രിവാൾ

ന്യൂദൽഹി: പശ്ചിമ ബംഗാൾ തെരഞ്ഞെടുപ്പ് ബി.ജെ.പി അട്ടിമറിച്ചെന്ന് ആം ആദ്മി പാർട്ടി...

MK Stalin: "கொளத்தூர் மக்களுக்காக என்றும் நான் உண்மையாக உழைப்பேன்!" – மு.க.ஸ்டாலின் உருக்கம்

Tகொளத்தூரில் அவரை போட்டியிட்ட தவெக வேட்பாளர் வி.எஸ். பாபு 8000 வாக்கு...

Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

Story Board : బెంగాల్లో మమత అప్రతిహత రాజకీయ విజయాలకు బ్రేక్...

‘ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸ್ಥಾನಕ್ಕೆ ನಾನು ರಾಜೀನಾಮೆ ನೀಡಲ್ಲ’ ಎಂದ ಮಮತಾ ಬ್ಯಾನರ್ಜಿ

ಕೋಲ್ಕತ್ತಾ,ಮೇ,5,2026 (www.justkannada.in):  ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಬಿಜೆಪಿ 207...