28
November, 2026

A News 365Times Venture

28
Saturday
November, 2026

A News 365Times Venture

AP High Court: షెడ్యూల్‌ కులానికి చెందిన వ్యక్తి మతం మారితే కులం వర్తించదు.. అట్రాసిటీ కేసు చెల్లదు..!

Date:

AP High Court: ఒక షెడ్యూల్‌ కులానికి చెందిన వ్యక్తి మతం మారితే కులం వర్తించదు.. అంతేకాదు.. అతని ఫిర్యాదుపై అట్రాసిటీ కేసు చెల్లదు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చర్చి నిర్వహించడంపై అక్కల రామిరెడ్డి మరియు ఇతరులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో కక్షపూనిన చింతాడ ఆనంద్, SC, ST అట్రాసిటీ నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదు చేశారు.. దీంతో, సదరు కేసును కొట్టివేయమని కోరుతూ అక్కల రామిరెడ్డి మరియు ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది జేవీ ఫణిదత్ వాదనలు వినిపిస్తూ, చింతాడ ఆనంద్ అనే వ్యక్తి పాస్టర్‌గా జీవనం సాగిస్తున్నందున వల్ల అతను క్రైస్తవుడవుతాడని, షెడ్యూలు కులాల రాజ్యాంగ ఆదేశం, 1950లోని 3వ నిబంధన ప్రకారం హిందువు కాని ఏ వ్యక్తి అయినా షెడ్యూల్‌ కులస్తుడు కాజాలడనీ, పుట్టుకతో హిందువు అయినప్పటికీ మతం మారడం వలన ఆనంద్ షెడ్యూల్ కులానాకి చెందడని.. అందువలన అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు అతనికి వర్తించవని, అందువల్ల సదరు కేసుకు విచారణ అర్హత లేదని వాదనలు వినిపించాడు..

Read Also: India Pakistan: పాక్ యాక్టర్లు, సెలబ్రిటీలకు ఇండియా బిగ్ షాక్..

అంతేగాక, హిందూ మతంలోని కుల ప్రస్తావన ప్రపంచవ్యాప్తంగా మహమ్మదీయ, క్రైస్తవ మతాలలో లేదని, అందుచేత ఆనంద్ యొక్క ఫిర్యాదు చట్ట వ్యతిరేకమని, ఫిర్యాదు కొనసాగించడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అవుతుందని వాదించారు. మరోవైపు.. ఆనంద్ తరఫు న్యాయవాది సతీష్ కుమార్ వాదిస్తూ, ఆనంద్‌కి ప్రభుత్వం యొక్క గుర్తింపు SC-హిందూ సర్టిఫికేట్ ఉన్నదని, అందువల్ల అట్రాసిటీ చట్టం ఆనంద్‌కి వర్తిస్తుందని తెలిపారు. దీనిపై అభ్యంతర తెలిపిన న్యాయవాది ఫణిదత్, ఒకవ్యక్తి ప్రభుత్వ అధికారులకి తప్పుడు సమాచారం ఇచ్చి పొందిన సర్టిఫికెట్‌ చెల్లదని మరియు చెల్లని సర్టిఫికెట్‌తో ఇతరులపై తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టడం.. చట్ట దుర్వినియోగం అవుతుందని తెలిపారు. ఇరువాదనలు విన్న హైకోర్టు మతం మారిన SC వ్యక్తి హిందువు కాజాలడనీ, అతనికి SC, ST అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదనీ తీర్పునిచ్చింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇന്ത്യയും സനാതന ധര്‍മ്മവും വേര്‍തിരിക്കാനാവാത്തത്: യോഗി ആദിത്യനാഥ്

  ലഖ്നൗ: ഇന്ത്യയും സനാതന ധര്‍മവും പരസ്പര പൂരകങ്ങളാണെന്നും അവയെ ഒരിക്കലും...

திருப்பரங்குன்றம்: "இப்படி ஒரு அசிங்கம் மாநிலத்திற்கு தேவையா?"- நீதிமன்ற உத்தரவு குறித்து இபிஎஸ்

திருப்பரங்குன்றம் மலையில் உள்ள தூணில் தீபம் ஏற்ற வேண்டும் என்ற உச்ச...

Rohit Sharma: “సవాళ్లను స్వీకరించడానికి నేను రెడీ”.. ముంబై కెప్టెన్‌గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్…

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌లో మళ్లీ హిట్‌మ్యాన్ శకం మొదలుకానుంది. దాదాపు...

കുവൈറ്റില്‍ ആക്രമണം നടത്തിയ ഡ്രോണ്‍ ഇറാനില്‍ നിര്‍മിച്ചതെന്ന് ഇറ്റലി

റോം: കുവൈറ്റില്‍ രണ്ട് ഇറ്റാലിക്കാര്‍ കൊല്ലപ്പെടാന്‍ കാരണമായ ആക്രമണത്തിനുപയോഗിച്ച ഡ്രോണ്‍ ഇറാനില്‍...