28
September, 2026

A News 365Times Venture

28
Monday
September, 2026

A News 365Times Venture

Nilave: మ్యూజిక‌ల్ మ్యూజిక‌ల్ డ్రామా ‘నిల‌వే’ టీజ‌ర్ విడుద‌ల‌

Date:

సినీ ఇండ‌స్ట్రీలో ఎవ‌రి ప‌రిచ‌యం లేదు.. వారెవ‌రో ఎవ‌రికీ తెలియ‌దు. అయితే సినిమా అంటే చెప్ప‌లేనంత ప్రేమ‌, అభిరుచి, ఉత్సాహం అదే వారిని ముంద‌డుగు వేసేలా చేసింది. తెలుగు సినిమాలో అతి పెద్ద మ్యూజిక‌ల్ డ్రామా రూపొందించేలా చేసింది. ఆ చిత్ర‌మే ‘నిల‌వే’. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి సౌమిత్ రావు మరియు సాయి వెన్నం దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ వ్యూ
ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై తాహెర్ సినీ టెక్‌తో సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

▶https://youtu.be/_QjT_yc6fAI

సోమవారం ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అర్జున్ (సౌమిత్ రావు) అనే వ్యక్తి, తన ఒంటరి జీవితాన్ని కష్టంగా గడుపుతూ ప్రేమ కోసం తాపత్రయ పడుతూ ఉంటాడు. అలాంటి అతని జీవితంలోకి.. శ్రేయాసి సేన్.. ప్రవేశించి అతని జీవితంలో కొత్త కాంతిని తీసుకొస్తుంది. ఇక టీజర్ మొత్తం.. ఆ అమ్మాయి కోసం అతను ఎంత దూరమైనా వెళ్తారు అనేదాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు

“నిలవే” టీజర్ నిడివి కేవలం 155 సెకండ్లు మాత్రమే.. అయినప్పటికీ.. ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు. అద్భుతమైన విజువల్స్.. మనసును తాకే సంగీతంతో, ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. ఈ చిత్రంపై అంచనాలను కూడా పెంచేసింది. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ కెమిస్ట్రీ ఈ సినిమాకి హైలైట్ గా నిలబడింది అని టీషర్ట్ చూస్తేనే అర్థమవుతుంది. వీరితో పాటు హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గోల్లపూడి, అనాల సుశ్మిత మరియు ఇతరులు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి కళ్లాన్ నాయక్ అందించిన సంగీతం మరింత హైలైట్ గా నిలవనుంది. వెంకట్ కొణకండ్ల, సంజనా కృష్ణ ఈ చిత్రానికి సహ నిర్మాతలు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സര്‍ക്കാര്‍ കമ്പനികള്‍ക്കൊപ്പമാണ് ഞങ്ങളുടെ കൂടെയല്ല; ഗുജറാത്തില്‍ 9,000 കര്‍ഷകരുടെ പ്രതിഷേധം

ഗാന്ധിനഗര്‍: കൃഷിയിടങ്ങളിലൂടെ ഉയര്‍ന്ന വോള്‍ട്ടേജ് വൈദ്യുതി ട്രാന്‍സ്മിഷന്‍ ലൈനുകളും ടവറുകളും സ്ഥാപിക്കുന്നതിനെതിരെ...

"நவம்பருக்கு பின் ஈரான் மீது கடும் தாக்குதல்" – 'மீண்டும்' அந்தர்பல்டி அடிக்கும்‌ ட்ரம்ப்!

கடந்த வார இறுதியில் ஈரான் போர் குறித்து ‘ஈரானுடன் பேச்சுவார்த்தை நல்லபடியாகப்...

US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకోనున్నాయా? మళ్లీ బాంబు దాడులతో దద్దరిల్లనుందా?...