28
June, 2026

A News 365Times Venture

28
Sunday
June, 2026

A News 365Times Venture

Anchor Ravi: నేను క్షమాపణ చెప్పను.. టీవీ షో వివాదంపై యాంకర్ రవి! ఆడియో వైరల్

Date:

బుల్లితెర సెలెబ్రిటీలు సుడిగాలి సుధీర్, యాంకర్ రవిలు ఇటీవల ఓ టీవీ షోలో స్కిట్ చేయగా.. అది కాస్త వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘బావగారు బాగున్నారా’ సినిమాలోని ఓ సీన్‌ను రీ-క్రియేట్ చేయగా.. అది కాస్త విమర్శలకు దారితీసింది. హిందువుల మనోభావాలను కించపరిచేలా, హిందూ దేవుళ్లను అనుమానించేలా.. సుధీర్, రవి ప్రవర్తించారంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సుధీర్, రవి ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదంపై తాజాగా రాష్ట్రీయ వానరసేన అనే హిందూ ఆర్గనైజేషన్ నుంచి కేశవ రెడ్డి అనే వ్యక్తి రవికి ఫోన్ చేయగా.. తాను ఇండియన్ అని, ఏ తప్పుచేయలేదని, క్షమాపణ చెప్పను అని సమాధానం ఇచ్చారు.

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా టీవీ షోలో ఎందుకు ప్రవర్తించారు అని యాంకర్ రవిని కేశవ రెడ్డి ప్రశ్నించారు. నందీశ్వరుడి నుంచి శివుడిని చూస్తే.. అమ్మాయి కనిపిస్తోందని ఎలా అంటార? అని నిలదీగయా.. అది చిరంజీవి గారు బావగారు బాగున్నారా సినిమాలో చేశారని, చిరంజీవి గారే చేశారని తామూ చేశామని రవి సమాధానం ఇచ్చారు. చిరంజీవి గారు అంటే మాకు ఎంతో ఇష్టమని, ఆయన ఏం చేసినా తాము చేస్తామన్నారు. అప్పుడే మీరు చిరంజీవి గారికి తప్పని చెబితే.. ఇప్పుడు మాకు తెలిసేది కదా? అని వంకరగా బదులిచ్చారు. సమాజాన్ని కించపరిచేలా తాము ఏదీ చేయలేదన్నారు. తాము చేసిన స్కిట్‌కు సంబందించిన వీడియోను తీసేశామని రవి చెప్పుకొచ్చారు. వీడియో తీశారు ఓకే, హిందువులకు క్షమాపణ చెప్పండి అని కేశవ రెడ్డి అనగా.. తాను ఏ తప్పు చేయలేదని, క్షమాపణ చెప్పని బదులిచ్చారు. ఇందుకు సంబందించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: CSK Captains: ధోనీ టు రుతురాజ్‌.. సీఎస్‌కే కెప్టెన్స్ లిస్ట్ ఇదే! మూడుసార్లు మహీనే

ఓ టీవీ షో కార్యక్రమానికి సీనియర్ హీరోయిన్ రంభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాంతో సుధీర్, రవి ఇద్దరూ కలిసి బావగారు బాగున్నారా సినిమాలోని సన్నివేశాన్ని రీ-క్రియేట్ (స్పూఫ్) చేశారు. సినిమాలో చిరు నందీశ్వరుడి తలపై నుంచి శివుణ్ణి చూసే క్రమంలో రంభ ఎంట్రీ ఇస్తారు. స్వామివారి దర్శనం అయిందా అని అడిగితే.. నాకు అమ్మవారి దర్శనం అయిందని మెగాస్టార్ చెబుతారు. అదే సీన్‌ను సుధీర్, రవి రీ క్రియేట్ చేశారు. సుధీర్ నందీశ్వరుడి తలపై నుంచి రంభని చూస్తాడు. ఇప్పుడే ఇదే వివాదంగా మారింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి

Amaravati Tension: అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్...

35,196 ಹುದ್ದೆಗಳು ಖಾಲಿ, ಸಿಬ್ಬಂದಿಗೆ ವೇತನವಿಲ್ಲ: ಐಸಿಯುನಲ್ಲಿ ಆರೋಗ್ಯ ಇಲಾಖೆ- ಆರ್.ಅಶೋಕ್ ಟೀಕೆ

ಬೆಂಗಳೂರು,ಜೂನ್,27,2026 (www.justkannada.in): ಗ್ಯಾರಂಟಿಗಳ ಹೆಸರಲ್ಲಿ ಖಜಾನೆ ಖಾಲಿ ಮಾಡಿ, ಈಗ...

വിദ്യാര്‍ത്ഥി പ്രതിസന്ധിക്കും ചോദ്യപേപ്പര്‍ ചോര്‍ച്ചയ്ക്കുമെതിരെ കോണ്‍ഗ്രസിന്റെ ഘൊരാവോ; പാര്‍ലമെന്റ് വളയും

ന്യൂദല്‍ഹി: രാജ്യത്തെ വിദ്യാര്‍ത്ഥികളും യുവാക്കളും നേരിടുന്ന വിവിധ പ്രശ്‌നങ്ങള്‍ ഉയര്‍ത്തിക്കാട്ടുന്നതിനായി ‘ഛാത്രോം...

`தவெக அரசு அமைய உழைத்தவர்கள் பொறுப்புகளில் இருப்பதில் என்ன தவறு?' – அமைச்சர் நிர்மல்குமார்

மதுரை மாவட்ட ஆட்சியர் அலுவலகத்தில் அனைத்து துறை சார்பில் ஆய்வுக் கூட்டம்...