21
September, 2026

A News 365Times Venture

21
Monday
September, 2026

A News 365Times Venture

CM Chandrababu: విజయవాడ సిటీకి గుడ్‌న్యూస్‌.. బైపాస్‌కు గ్రీన్ సిగ్నల్..

Date:

CM Chandrababu: రాజధాని అమరావతి ప్రాంతంలో ముమ్మరంగా కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్లే బైపాస్‌ తక్షణమే అందుబాటులోకి వచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్స్ ఇచ్చారు. దీంతో రాజధాని ప్రాంతానికి కీలక జాతీయ రహదారి అందుబాటులోకి రావడమే కాకుండా, అక్కడి నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్‌ను సులువుగా తరలించేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. కాజా నుంచి గొల్లపూడి మీదుగా చిన్నఅవుటపల్లి వరకు ఉన్న విజయవాడ బైపాస్‌ (చెన్నై-కోల్‌కతా హైవే బైపాస్‌) ఉంది. అందులోని కాజా – గొల్లపూడి ప్యాకేజీ 17.88 కిలోమీటర్లు. ఇది రాజధాని ప్రాంతంలోని 9 గ్రిడ్‌ రోడ్ల మీదుగా వెళ్తుంది. వీటిలో ఇ-3, ఇ-8, ఇ-10, ఇ-13, ఇ-15 గ్రిడ్‌ రోడ్లు క్రాస్‌ అయ్యేచోట్ల ఎన్‌హెచ్‌ఏఐ అండర్‌ పాస్‌లను నిర్మించింది. దీనివల్ల ఆయా గ్రిడ్‌ రోడ్లలో రాకపోకలు సాగించే వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

Read Also: Waqf amendment bill: వక్ఫ్ బిల్లుపై టీడీపీ ఎంపీలకు చంద్రబాబు కీలక ఆదేశాలు..

అయితే ఇ-9, ఇ-11, ఇ-12, ఇ-14 గ్రిడ్‌ రోడ్ల వద్ద మాత్రం అండర్‌పాస్‌లు లేకుండానే, బైపాస్‌ నిర్మాణ పనులు పూర్తియయ్యిపోయాయి. దీంతో బైపాస్‌ క్రాస్‌ అయ్యేప్రాంతాల్లో ఆ నాలుగు గ్రిడ్‌ రోడ్లు శాశ్వతంగా మూసుకుపోతాయి. ఈ గ్రిడ్‌ రోడ్లపై రాకపోకలు సాగించేవారు.. బైపాస్‌ దాటి వెళ్లాలంటే మరో ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలిసినా గత ప్రభుత్వ హయాంలో ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పనులు చేసేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు గ్రిడ్‌ రోడ్ల వద్ద అండర్‌పాస్‌లు లేని విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి రావడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడ అండర్‌పాస్‌లు ఉండాల్సిందేనని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ నాలుగు చోట్ల బైపాస్‌ను కట్‌చేసి, అండర్‌పాస్‌ల నిర్మాణానికి అంచనాలు రూపొందించే ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరుగుతుంది.

Read Also: Top Headlines @9AM : టాప్ న్యూస్

తాజాగా సీఎం చంద్రబాబు, కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి గడ్కరీతో సమావేశం అయ్యి ఇదే అంశంపై చేర్చించారు. రాజధాని పనులు వేగంగా జరుగుతున్న వేళ మొదట బైపాస్‌ నిర్మాణం పూర్తిచేయాలని, ఆ తర్వాత నాలుగు గ్రిడ్‌ రోడ్ల వద్ద అండర్‌పాస్‌లు నిర్మించేలా ఇద్దరూ మాట్లాడుకుని, నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ప్రస్తుతం బైపాస్‌ ఆపేసి, నాలుగు చోట్ల అండర్‌పాస్‌ల నిర్మాణం పూర్తిచేయాలంటే మరో 15 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, తొలుత బైపాస్‌ పూర్తిచేయడానికే పచ్చ జెండా ఊపారు.. దీంతో ఈ పనులు మరింత వేగంగా సాగనున్నాయి. వర్షాలు మొదలయ్యే లోపు జూన్‌ ఆఖరుకు బైపాస్‌ పెండింగ్ పనులు అని పూర్తయ్యి అందుబాటులోకి రానుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

യു.പിയില്‍ ബി.ജെ.പി ഭരണത്തില്‍ തകര്‍ത്തത് 151 അബേദ്ക്കര്‍ പ്രതിമകള്‍: അഖിലേഷ് യാദവ്

ലഖ്‌നൗ: ബി.ജെ.പി ഭരണകാലത്ത് ഉത്തര്‍പ്രദേശില്‍ ഡോ. ബി.ആര്‍ അംബേദ്‌റുടെ 151 പ്രതിമകള്‍...

"தமிழ்நாடு, சர்க்கஸ் கும்பலிடம் மாட்டிக்கொண்டிருக்கிறது.!"- உதயநிதி ஸ்டாலின்

சென்னையில் நடைபெற்ற திருமண நிகழ்ச்சியில் எதிர்க்கட்சி தலைவர் உதயநிதி ஸ்டாலின் கலந்துகொண்டிருக்கிறார்....

No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వ్యాపారులు కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా వినూత్న నిరసనకు దిగారు....

ഹിന്ദു സംസ്‌കാരത്തെ അപമാനിക്കുന്നതും പാരമ്പര്യത്തെ തകര്‍ക്കുന്നതും; ഹിന്ദു വര്‍ഗീയതയ്‌ക്കെതിരായ ഹാമിദ് അന്‍സാരിയുടെ പരാമര്‍ശത്തിനെതിരെ യോഗി

ന്യൂഡല്‍ഹി: മുന്‍ ഉപരാഷ്ട്രപതി ഹമീദ് അന്‍സാരിയുടെ ‘ഹിന്ദു വര്‍ഗീയത’യുമായി ബന്ധപ്പെട്ട പരാമര്‍ശങ്ങള്‍ക്കെതിരെ...