17
March, 2026

A News 365Times Venture

17
Tuesday
March, 2026

A News 365Times Venture

Ranya Rao: రన్యారావు శరీరంపై గాయాలు.. థర్డ్‌డిగ్రీ ప్రయోగించారా? అసలేమైంది?

Date:

బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావుకు చెందిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆమె డీఆర్‌ఐ కస్టడీలో ఉంది. డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఆమె దగ్గర నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమెపై అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? లేదంటే ఇంకేమైనా చేశారా? తెలియదు గానీ.. ఆమె ఒంటిపై గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. రన్యారావు కంటి కింద గాయాలైనట్లు ఒక ఫొటో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆమెను అధికారులు ఏం చేశారంటూ నిలదీస్తున్నారు. ఆమెకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కర్ణాటక మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి చౌదరి హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: IND vs NZ Final: రేపే భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు.. జోరుగా ఇరుజట్లు ప్రాక్టీస్‌!

మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావును డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేయగా.. రూ.12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దుబాయ్ నుంచి ఇలా పలుమార్లు బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఆమె ఇంటిని సోదా చేయగా.. అక్కడ కూడా కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించినట్లుగా సమాచారం. జనవరి నుంచి మార్చి 3 వరకు దాదాపు 27 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. తన తండ్రి హోదాను అడ్డంపెట్టుకుని.. ఒక కానిస్టేబుల్ సాయంతో ఎలాంటి తనిఖీలు లేకుండా ఎయిర్‌పోర్టులో ఆమె కథ నడిపించినట్లుగా తెలుస్తోంది. బంగారం బిస్కెట్లు.. తొడలకు స్టిక్కర్లతో అంటించుకుని బయటకు వచ్చేసేదని సమాచారం. అయితే ఆమె వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తు్న్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad: లక్ష మంది మహిళలతో భారీ సభ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

ఆమె దుబాయ్‌కు మాత్రమే కాకుండా యూరప్‌, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాల నుంచి కూడా బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ విషయాలు ఆమెనే చెప్పినట్లుగా అధికారులు తెలిపారు. అయితే ఈ విషయాలను రహస్యంగా ఉంచాలని ఆమె అధికారులను కోరినట్లు తెలుస్తోంది. తనకు కొంత విశ్రాంతి ఇవ్వాలని.. ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు వస్తానని చెప్పినట్లుగా సమాచారం.

అయితే ఆమె ఒంటిపై గాయాలు కావడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఏం జరిగి ఉంటుందనేది ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆమెపై ఎవరైనా భౌతికదాడి చేశారా?, లేదంటే అధికారులే నిజం కక్కించేందుకు కొట్టారా? అనేది తేలాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Falcon Scam: ఫాల్కన్ స్కామ్ కేసు.. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్ సీజ్

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

Chairmans Desk : ఇరాన్‌-అమెరికా యుద్ధాన్ని…ప్రపంచంలో యుద్ధ రంగ నిపుణులు, అంతర్జాతీయ...

ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ವಿತರಣೆಯಲ್ಲಿ ಸಮಸ್ಯೆಯಾದ್ರೆ ಆಹಾರ ನಿರೀಕ್ಷಕರನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ: ಜಿಲ್ಲಾಧಿಕಾರಿ

ಬೆಂಗಳೂರು ಗ್ರಾಮಾಂತರ, ಮಾರ್ಚ್,16,2026 (www.justkannada.in): ಜಿಲ್ಲೆಯಾದ್ಯಂತ ಎಲ್ ಪಿಜಿ ಸಿಲಿಂಡರ್...

Bihar Rajya Sabha Election; എ.ഐ.എം.ഐ.എമ്മും ബി.എസ്.പിയും വോട്ട് ചെയ്തു; കോണ്‍ഗ്രസ്-ആര്‍.ജെ.ഡി എം.എല്‍.എമാര്‍ വിട്ടുനിന്നു, എന്‍.ഡി.എയ്ക്ക് വിജയം

പാട്‌ന: ബീഹാറിലെ രാജ്യസഭാ സീറ്റുകളിലേക്കുള്ള തെരഞ്ഞെടുപ്പില്‍ എന്‍.ഡി.എ സഖ്യത്തിന് വിജയം. സംസ്ഥാനത്തെ...

பேராவூரணி தொகுதியை கூட்டணிக்கு தரமாட்டார் எடப்பாடி! – அதிமுக வேட்பாளர் ரேஸில் முந்துவது யார்?

தஞ்சாவூர் மாவட்டத்தில் உள்ள எட்டு சட்டமன்றத் தொகுதிகளில் ஒன்று பேராவூரணி. கடமைடை...