11
March, 2026

A News 365Times Venture

11
Wednesday
March, 2026

A News 365Times Venture

Amit Shah AP Tour : సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా..

Date:

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ అమిత్‌కు స్వాగతం పలికారు. సుమారు గంటకు పైగా సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షా ఉండనున్నారు. పలు కీక అంశాలపై వీరి మధ్య చర్చ జరగనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధుల కేటాయించినందుకు కేంద్ర మంత్రిని డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి సత్కరిస్తారు. మొదట కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర హోం శాఖ పరిధిలో ఉన్న విభజన సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. తర్వాత జాతీయ రాజకీయాలు ఏపీలో కూటమి పాలనపై చర్చ ఉండనున్నట్లు సమాచారం.

READ MORE: Vayve Eva Solar Car: సోలార్ పవర్‌తో నడిచే కారు వచ్చేసింది.. ధర రూ. 3 లక్షలు మాత్రమే!

ఇదిలా ఉండగా.. ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. ఉదయం 11:30 గంటలకు కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరుకు చేరుకుంటారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సౌత్ క్యాంపస్‌ను ప్రారంభిస్తారు. కాగా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కి రూ.11,400 కోట్లు ప్రకటించిన మరునాడే పర్యటనకు రావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

എന്തുകൊണ്ട് കേരളത്തിന് എയിംസ് അനുവദിക്കുന്നില്ല? കേന്ദ്രത്തിനെതിരെ ഹൈക്കോടതിയുടെ രൂക്ഷ വിമർശനം

കൊച്ചി : കേരളത്തിന് എയിംസ് അനുവദിക്കാത്തതിൽ കേന്ദ്രത്തിനെതിരെ രൂക്ഷ വിമർശനവുമായി ഹൈക്കോടതി...

இந்தியா வந்துகொண்டிருந்த சரக்குக் கப்பல் மீது தாக்குதல்: ஹார்முஸ் ஜலசந்தியில் ஈரான் போரால் பதற்றம்!

ஈரான் மீது இஸ்ரேலும், அமெரிக்காவும் இணைந்து போர் தொடுத்த நிலையில், மத்திய...

Afghanistan: ఇవేం బుద్ది తక్కువ పనుల్రా బాబు.. ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికల విద్యపై శాశ్వత నిషేధం!

ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో, దేశ విద్యాశాఖ మంత్రి ఇటీవల...

ಅಂತರಾಷ್ಟ್ರೀಯ ವಿಮಾನ ನಿಲ್ದಾಣ: ತಮಿಳುನಾಡಿಗೆ ಬೆಣ್ಣೆ, ನಮಗೆ ಸುಣ್ಣ- ಎಂ.ಬಿ ಪಾಟೀಲ್ ಅಸಮಾಧಾನ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,11,2026 (www.justkannada.in):  ತಮಿಳುನಾಡಿನ ಮಧುರೈ ವಿಮಾನ ನಿಲ್ದಾಣವನ್ನು ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ನಿಲ್ದಾಣವಾಗಿ...