13
April, 2026

A News 365Times Venture

13
Monday
April, 2026

A News 365Times Venture

Pope Leo-Trump: ట్రంప్ అంటే భయం లేదు.. యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా.. పోప్ లియో ప్రకటన

Date:

వాషింగ్టన్-వాటికన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పశ్చిమాసియా యుద్ధాన్ని పోప్ లియో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పోప్ వ్యాఖ్యలపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్-వాటికన్ సిటీ మధ్య ప్రస్తుతం ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది.

తాజాగా ట్రంప్ బెదిరింపులపై పోప్ లియో స్పందించారు. తనకు ట్రంప్ భయం లేదని.. యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటానని తేల్చి చెప్పారు. 10 రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా అల్జీర్స్‌కు వెళ్తుండగా విమానంలో లియో మీడియాతో మాట్లాడారు. తాను ఎవరితోనూ నేరుగా ఘర్షణకు దిగబోనని.. అయితే మత బోధనలను దుర్వినయోగం చేయొద్దని కోరారు. ‘‘నేను యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉంటాను. శాంతినే కోరుకుంటున్నా. సమస్యలకు న్యాయమైన పరిష్కరాలు కనుగొనడానికి దేశాల మధ్య సంభాషణను ప్రోత్సహిస్తాను. ఈ రోజు ప్రపంచంలో చాలా మంది బాధపడుతున్నారు. ఎంతో మంది అమాయకులు చంపబడుతున్నారు. దీనికో మంచి మార్గం ఉందని.. ఎవరొకరు ముందుకు వచ్చి చెప్పాలి.’’ అని పేర్కొన్నారు. ప్రపంచ నాయకులు శాంతి దిశగా అడుగులు వేయాలని.. హింసకు తావు ఇవ్వకూడదని పోప్ సూచించారు.

పోప్ లియోను ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ ఘోరంగా విమర్శించారు. ‘‘పోప్ నేరాల విషయంలో బలహీనుడు. విదేశాంగ విధానంలో ఘోరమైనవాడు. అమెరికా అధ్యక్షుడిని విమర్శించే పోప్ నాకు వద్దు. ఎందుకంటే నేను ఏ పని కోసం ఎన్నికయ్యానో.. అదే పనిని భారీ మెజార్టీతో చేస్తున్నాను.’’ అని రాసుకొచ్చారు. అయినా ‘‘లియో కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే అందరికీ తెలిసినట్లుగా అది ఒక అనూహ్యమైన ఆశ్చర్యం.’’ ‘‘పోప్ పదవికి సంబంధించిన ఏ జాబితాలోనూ లియో పేరు లేదు. కేవలం ఒక అమెరికన్ అయినందున అధ్యక్షుడు ట్రంప్‌తో వ్యవహరించడానికి ఉత్తమ మార్గం అని భావించినందునే ఆ పదవిలో నియమించింది..’’ అని ట్రంప్ రాసుకొచ్చారు. మొత్తానికి వాదోపవాదాల నేపథ్యంలో వైట్‌హౌస్-వాటికన్ మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి.

ఇది కూడా చదవండి: Bihar: రేపే బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక.. ఎల్లుండి ప్రమాణస్వీకారం

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പോപ്പിന്റെ സമാധാന ശ്രമങ്ങളെ അഭിനന്ദിക്കുന്നു; ട്രംപിന്റെ വിമര്‍ശനത്തിന് പിന്നാലെ ലിയോ പതിനാലാമന് പിന്തുണയുമായി ഇറ്റലി

ജനീവ: സുഡാനിലെ സമാധനത്തിനായി ലിയോ പതിനാലാന്‍ മാര്‍പ്പാപ്പയുടെ ഇടപെടലുകളെ പ്രശംസിച്ച് ഇറ്റാലിയന്‍...

போப் 'இடதுசாரி' அரசியல் செய்கிறார்; கொரோனா காலத்தில் பாதிரியார்கள் கைது நடந்ததே? – ட்ரம்ப் ஆவேசம்

அமெரிக்க அதிபர் டொனால்ட் ட்ரம்ப், கத்தோலிக்க திருச்சபையின் தலைவரான போப் லியோ...

ಲೆಕ್ಕ ಕೇಳಿದ್ದಕ್ಕೆ ಷಡ್ಯಂತ್ರ ಮಾಡಿ ಉಚ್ಛಾಟಿಸಿದ್ದಾರೆ: ವಚನಾನಂದ ಸ್ವಾಮೀಜಿ

ದಾವಣಗೆರೆ,ಏಪ್ರಿಲ್,13,2026 (www.justkannada.in):  ಟ್ರಸ್ಟಿಗಳಿಗೆ ಲೆಕ್ಕ ಕೇಳಿದ್ದಕ್ಕೆ ವ್ಯವಸ್ಥಿತವಾಗಿ ಷಡ್ಯಂತ್ರ ನಡೆಸಿ...

വനിതാ സംവരണമല്ല കേന്ദ്രത്തിന്റെ ലക്ഷ്യം, മണ്ഡല പുനര്‍നിര്‍ണ്ണയം; പ്രത്യേക പാര്‍ലമെന്റ് സമ്മേളനത്തിനെതിരെ സോണിയയും ഖാര്‍ഗെയും

ന്യൂദല്‍ഹി: വനിതാ സംവരണം നടപ്പിലാക്കുന്നതിനായുള്ള ഭേദഗതികള്‍ ചര്‍ച്ച ചെയ്യാന്‍ കേന്ദ്ര സര്‍ക്കാര്‍...