టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ సమీరా రెడ్డి గురించి పరిచయం అక్కర్లేదు. వివాహం తర్వాత సినిమాలకు దూరమై, ప్రస్తుతం గోవాలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న సమీరా.. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కేవలం నటన తెలిస్తే సరిపోదని, బాహ్య ప్రపంచానికి మనం ఎంత విలాసవంతంగా కనిపిస్తున్నామనే దానిపైనే కూడా అవకాశాలు ఆధారపడి ఉండేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : RamCharan: మెగా పవర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ.. భన్సాలీ భారీ ప్రాజెక్ట్ లో చరణ్?
సమీరా మాట్లాడుతూ.. ‘అప్పట్లో ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చే హీరోయిన్లపైనే అందరి కళ్లూ ఉండేవి. అక్కడ మనం వేసుకున్న బట్టలు, పట్టుకున్న బ్యాగులను బట్టే మన స్థాయిని అంచనా వేసేవారు. అందుకే టాప్ స్టార్స్‌లా కనిపించాలని, ఒక ఎయిర్‌పోర్ట్ లుక్ కోసం లక్షలు పోసి లగ్జరీ బ్యాగులు, జాకెట్లు కొన్నాను. ఒక స్థాయికి చేరుకున్నానని ఇండస్ట్రీ జనాలు అనుకోవడం కోసం ₹2.5 లక్షల షానెల్ జాకెట్, ₹1.7 లక్షల లూయిస్ విట్టన్ బ్యాగ్ వంటివి కొనుగోలు చేశా, ఆ డబ్బుతో గోల్డ్ బిస్కెట్లు కొనుక్కుంటే ఇప్పుడు బాగుండేది’అని సమీరా వెల్లడించారు. కానీ ప్రస్తుతం వాస్తవం ఎంటో తెలిసోచ్చింది. అందుకే ఇప్పుడు ఆడంబరాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.. ‘ఇప్పుడు నేను ఆర్గానిక్ దుస్తులకే ప్రాధాన్యత ఇస్తున్నాను. ఫాస్ట్ ఫ్యాషన్‌ను పక్కనపెట్టి ప్రశాంతంగా ఉంటున్నాను’ అని చెప్పారు. కేవలం గ్లామర్ కోసమే లక్షలు ఖర్చు చేయడం కంటే, మానసిక ప్రశాంతత ముఖ్యమని ఆమె తన అనుభవాల ద్వారా వివరించారు. ప్రజంట్ సమీరా మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





