11
April, 2026

A News 365Times Venture

11
Saturday
April, 2026

A News 365Times Venture

Madhubala biopic: సంజయ్ లీలా భన్సాలీ బిగ్ ప్లాన్.. మధుబాలగా మలయాళ భామ !

Date:

భారతీయ సినిమా చరిత్రలో తిరుగులేని అందగత్తెగా, దిగ్గజ నటిగా గుర్తింపు పొందిన మధుబాల జీవిత కథ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌ను విజువల్ వండర్స్ సృష్టించే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తన హోమ్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా, జస్మీత్ కె. రీన్ దర్శకత్వం వహిస్తున్నారు. మధుబాల పాత్ర అంటే కేవలం అందమే కాదు, ఎన్నో భావోద్వేగాల మేళవింపు. అలాంటి ఐకానిక్ పాత్రను పోషించే నటి కోసం మేకర్స్ చాలా కాలంగా అన్వేషణ సాగించారు. మొదట సారా అర్జున్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ, చివరికి మలయాళ ముద్దుగుమ్మ..

Also Read : Dacoit :డెకాయిట్ ఫస్ట్ డే కలెక్షన్స్.. అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్!

కళ్యాణి ప్రియదర్శన్ ఈ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ‘లోకా: చాప్టర్ 1’ (Loka: Chapter 1) సినిమాతో పాన్-ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణి ప్రియదర్శన్, ఇప్పుడు మేకర్స్ దృష్టిని బలంగా ఆకర్షించింది. మధుబాల పాత్రకు కావాల్సిన సహజమైన అమాయకత్వం, క్లాసిక్ లుక్ కళ్యాణిలో పుష్కలంగా ఉన్నాయని సంజయ్ లీలా భన్సాలీ బృందం భావిస్తోందట. అంతేకాకుండా ప్రస్తుతం ఆమెకు పెరుగుతున్న క్రేజ్ కూడా ఈ భారీ ప్రాజెక్టుకు ప్లస్ అవుతుందని నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. భారతీయ సినిమాకు ఒక గొప్ప నివాళిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణి తన నటనతో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಅಲೆಮಾರಿ ಸಮುದಾಯದ ಪ್ರಥಮ ಮಹಿಳಾ ವಕೀಲೆಯಾಗಿ ಸಾಧನೆ ಮಾಡಿದ ಯುವತಿ

ಮೈಸೂರು,ಏಪ್ರಿಲ್,11,2026 (www.justkannada.in): ಅಲೆಮಾರಿ ಸಮುದಾಯದ ಯುವತಿ ಅರುಣ ವಕೀಲೆಯಾಗುವ ಮೂಲಕ...

2028ലെ പ്രസിഡന്റ് തെരഞ്ഞെടുപ്പില്‍ മത്സരിക്കാന്‍ കമല ഹാരിസ്; ട്രംപിന് കീഴില്‍ അമേരിക്കയുടെ പ്രതിച്ഛായ മങ്ങിയെന്നും വിമര്‍ശനം

വാഷിങ്ടണ്‍: 2024ലെ തെരഞ്ഞെടുപ്പ് പരാജയത്തിന് ശേഷം അമേരിക്കന്‍ രാഷ്ട്രീയത്തില്‍ വീണ്ടും സജീവമാകാനൊരുങ്ങി...

ಎರಡೂ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಬಿಜೆಪಿ ಗೆದ್ರೆ  2 ವರ್ಷ ನಮ್ಮನ್ನು ಮಲಗಲು ಬಿಡಲ್ಲ-ಸಚಿವ ಸತೀಶ್ ಜಾರಕಿಹೊಳಿ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,10,2026 (www.justkannada.in):  ದಾವಣಗೆರೆ ದಕ್ಷಿಣ ಮತ್ತು ಬಾಗಲಕೋಟೆ ವಿಧಾನಸಭಾ ಉಪಚುನಾವಣೆಯಲ್ಲಿ...