10
April, 2026

A News 365Times Venture

10
Friday
April, 2026

A News 365Times Venture

Israel-Iran War: మరింత ప్రమాదకరంగా ఇరాన్.. ఇజ్రాయిల్-యూఎస్ కథ అడ్డం తిరిగింది..

Date:

Israel-Iran War: వారం పది రోజుల్లో ఇరాన్ దారికి వస్తుందని భావించిన అమెరికా, ఇజ్రాయిల్‌ల కల కలగానే మిగిలింది. 40 రోజుల పాటు సాగిన యుద్ధంలో ఇరాన్ కన్నా అమెరికానే ఎక్కువ నష్టపోయింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) నివేదిక ఒకటి సంచలనంగా మారింది. ఇరాన్ కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వం కన్నా ‘‘ప్రమాదకరం’’గా మారిందని ఇజ్రాయిల్ పార్లమెంట్‌ క్నెసెట్‌కు ఐడీఎఫ్ ఒక నివేదిక సమర్పించింది. యుద్ధం తొలిరోజే అప్పటి సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని హత్య చేసిన తర్వాత పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతాయని భావిస్తే కథ అడ్డం తిరిగింది.

Read Also: Bengal Elections: “ముస్లింలను మోసం చేయడం సులభం”.. సంచలనంగా హుమాయున్ కబీర్ వీడియో..

ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రకారం, ఐడీఎఫ్ ప్రతినిధులు క్నెసెట్ విదేశీ వ్యవహారాలు మరియు రక్షణ కమిటీకి ఒక రహస్య నిఘా సమావేశంలో కొత్త పాలన గురించి వివరించారు. ప్రస్తుత పాలన నాయకులు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)తో సంబంధం కలిగి ఉందని, వీరు గత రాజకీయ నాయకత్వం కంటే మరింత తీవ్రవాద భావజాలాన్ని కలిగి ఉన్నారని కమిటీకి ఇజ్రాయిల్ మిలిటరీ తెలియజేసింది.

ఒకవేళ ఈ అంచనా నిజమైతే ఇది ఇజ్రాయిల్, యూఎస్‌కు అతిపెద్ద సవాలుగా మారుతుందని చెప్పారు. 40 రోజుల యుద్ధంతో ఇరాన్ నిలబడి పోరాడింది. సైనిక శక్తులైన ఇజ్రాయిల్, యూఎస్‌ను ఎదురించి దాడులు చేసింది. హార్ముజ్ జలసంధిని మూసేసి ప్రపంచ చమురు భద్రతను సవాల్ చేసింది. ఈ మొత్తం దాడిలో ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్ లో 1000కి పైగా వైమానిక దాడులు చేసింది. మొత్తంగా 8500పైగా ఆపరేషన్ మిషన్లు పూర్తి చేసి, దాదాపుగా 400 లక్ష్యాలను కొట్టింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ದ್ವಿತೀಯ ಪಿಯು ಫಲಿತಾಂಶ: ಸರ್ಕಾರಿ ವಸತಿ ಶಾಲೆಗಳಲ್ಲಿ ಶೇ.97.22 ಮಕ್ಕಳು ತೇರ್ಗಡೆ: ಸಚಿವ ಮಹದೇವಪ್ಪ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,10,2026 (www.justkannada.in): ನಿನ್ನೆ ದ್ವಿತೀಯ ಪಿಯುಸಿ ಪರೀಕ್ಷೆ ಫಲಿತಾಂಶ ಪ್ರಕಟವಾಗಿದ್ದು,...

പി.സി. ജോര്‍ജിനെ പോലുള്ള രാഷ്ട്രീയ കോമരങ്ങള്‍ കേരളത്തിന് അപമാനം; ആവശ്യം കഴിഞ്ഞാല്‍ തള്ളിപ്പറയുന്നത് സ്ഥിരം: കത്തോലിക്ക കോണ്‍ഗ്രസ്

കോട്ടയം: തെരഞ്ഞെടുപ്പിന് പിന്നാലെ കാഞ്ഞിരപ്പള്ളി രൂപത മെത്രാനെതിരെ വിമര്‍ശനമുന്നയിച്ച ബി.ജെ.പി നേതാവ്...

“காசு வாங்கி சீட்டை கொடுத்தார் கார்க்கே” – ஹசீனா சையத் பதவி பறிப்பின் பின்னணி!

``மகிளா காங்கிரஸ் கட்சிக்கு எம்.எல்.ஏ சீட் கொடுக்காமல் போனதற்கு காங்கிரஸ் கட்சியில்...

ಗ್ಯಾಸ್ ಅಭಾವ : ನಮ್ಮ ಮನವಿಗೆ ಕೇಂದ್ರ ಸ್ಪಂದಿಸಬೇಕು- ಗೃಹ ಸಚಿವ ಪರಮೇಶ್ವರ್ ಆಗ್ರಹ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,10,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ ಎಲ್ ಪಿಜಿ ಗ್ಯಾಸ್ ಅಭಾವ ವಿಚಾರಕ್ಕೆ...