5
April, 2026

A News 365Times Venture

5
Sunday
April, 2026

A News 365Times Venture

RC17 : దేవిశ్రీ లేకుండా సుకుమార్ సినిమా.. రేసులో ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్

Date:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందంటేనే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న RC17 కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు ముగిశాయి. దర్శకుడు సుకుమార్ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు.

Also Read : Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. క్లోజింగ్ కలెక్షన్స్.. ఓవరాల్ నష్టం ఎంత?

రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా, సుకుమార్ మళ్ళీ ఒక విభిన్నమైన పవర్‌ఫుల్ కథను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా సాంకేతిక నిపుణుల ఎంపిక మరియు లొకేషన్ల వేట వేగంగా జరుగుతున్నట్టుగా సమాచారం. మరి సంగీత దర్శకుడు ఎవరు? అంటే, ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిజానికి ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ లేకుండా ఒక్క సినిమా కూడా చేయలేదు సుకుమార్. కానీ ఈసారి ఎందుకనో ఆర్సీ 17కి దేవి వర్క్ చేయడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. దేవి ప్లేస్‌లో ధురంధర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన శాశ్వత్ సచ్‌దేవ్.. అర్జున్‌రెడ్డి, క‌బీర్‌సింగ్‌, యానిమ‌ల్ వంటి సంచ‌ల‌న చిత్రాల‌ను సంగీతం అందించిన హ‌ర్ష‌వ‌ర్థ‌ర్ రామేశ్వ‌ర్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆ వెంటనే సుకుమార్ మ్యూజిక్ సిట్టింగ్స్‌ని స్టార్ట్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. మరోవైపు.. ప్రస్తుతం పెద్దితో బిజీగా ఉన్న చరణ్.. ఇది రిలీజ్ అయిన వెంటనే ఆర్సీ 17ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

1 ಲಕ್ಷ ಸರ್ಕಾರಿ ಹುದ್ದೆಗಳ ಭರ್ತಿ ಭರವಸೆ ಮರೆತ ಸರ್ಕಾರ-ಮಾಜಿ ಸಚಿವ ಶ್ರೀರಾಮುಲು ವಾಗ್ದಾಳಿ

ಬಾಗಲಕೋಟೆ,ಏಪ್ರಿಲ್,4,2026 (www.justkannada.in):  ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದ ಒಂದು ವರ್ಷದೊಳಗೆ 1 ಲಕ್ಷ...

അധികാരമേറ്റെടുത്ത് മണിക്കൂറുകള്‍ക്കകം മുഖ്യമന്ത്രി; വനിതാ മുഖ്യമന്ത്രിക്കായി കേരളത്തെ തയ്യാറാക്കുകയാണ് ലക്ഷ്യം: കെ.സി വേണുഗോപാല്‍

  കൊച്ചി: സംസ്ഥാനത്ത് യു.ഡി.എഫ് അധികാരത്തിലെത്തിയാല്‍ മണിക്കൂറുകള്‍ക്കകം മുഖ്യമന്ത്രിയെ പ്രഖ്യാപിക്കുമെന്ന് എ.ഐ.സി.സി...

Hyderabad: హైదరాబాద్ లో MIM కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్

పాతబస్తీలో చార్మినార్ సమీపంలో ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో...