5
April, 2026

A News 365Times Venture

5
Sunday
April, 2026

A News 365Times Venture

Raghav chadha: ‘‘నేను గాయపడ్డాను..’’.. ఆప్‌కు ధురంధర్ స్టైల్‌లో రాఘవ్ చద్దా రిప్లై..

Date:

Raghav chadha: రాఘవ్ చద్దా వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో అంతర్గత పోరును బయటపెట్టింది. ఇటీవల రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించింది. దీని తర్వాత ఆప్ నాయకుడు చద్దాపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ నేత ఆతిశీ మాట్లాడుతూ.. ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమైయ్యారని ఆరోపించింది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని ఆప్ మరో నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు.

అయితే, ఆప్ చేస్తున్న విమర్శలకు రాఘవ్ చద్దా ‘‘ధురంధర్’’ స్టైల్‌లో స్పందించారు. తనపై ఆప్ చేస్తున్న విమర్శలకు ‘‘ నేను గాయపడ్డాను, అందుకే ప్రాణాంతకం’’ అని అన్నారు. ఈ సినిమా డైలాగ్‌తో చద్దా ఆప్‌కు రిఫ్లై ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా చద్దా మాట్లాడుతూ.. తనపై వచ్చిన అన్ని ఆరోపణలు అసత్యమని, తనపై కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ముందుగా నేను వీటిపై స్పందించకూడదని అనుకున్నానని, అయితే ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే కొంత మంది దాన్ని నిజమని నమ్మే అవకాశం ఉందనే స్పందించినట్లు చెప్పారు.

Read Also: Rahul Gandhi: మోడీ ఇప్పుడు ట్రంప్ నియంత్రణలో ఉన్నారు.. కేరళ ప్రచారంలో రాహుల్ గాంధీ విసుర్లు

ప్రతిపక్షాలు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసిన సమయంలో తాను అక్కడే కూర్చున్నానని, వాకౌట్ చేయలేదనే తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఇదంతా అబద్ధమని చద్దా అన్నారు. తాను ప్రతీ సందర్భంతో ప్రతిపక్షాలతో కలిసే ఉన్నానని చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ అభిశంసన తీర్మానంపై సంతకం చేయడానికి తాను నిరాకరించానన్న ఆరోపణలు అవాస్తవమని ఆయన ఇంకా పేర్కొన్నారు. ఏ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కూడా తనను ఆ తీర్మానంపై సంతకం చేయమని అడగలేదని చెప్పారు. ఆప్‌కు 10 మంది ఎంపీలు ఉంటే 6 లేదా 7 మంది సంతకం చేయలేదనే విషయాన్ని చద్దా గుర్తు చేశారు. తాను పనికిమాలిన విషయాలను లేవనెత్తుతున్నానని ఆరోపిస్తున్నారని, తాను గొడవ చేయడానికి పార్లమెంట్‌కు వెళ్లలేదని చద్దా స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు లేవనెత్తడానికి సభకు వెళ్తున్నారని అన్నారు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಬಿಜೆಪಿಯವರಿಗೆ ಸೋಲಿನ ಭಯ: ಗ್ಯಾರಂಟಿಗಳು ಸಾಮಾಜಿಕ ಬದ್ಧತೆ ಒದಗಿಸುವ ಹೂಡಿಕೆ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬಾಗಲಕೋಟೆ, ಏಪ್ರಿಲ್, 4,2026 (www.justkannada.in):  ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧ ಅಪಪ್ರಚಾರ...

യഥാര്‍ത്ഥ പേര് ശശിധരന്‍ പി.കെ; ജനനതീയതിയിലും കൃത്രിമം കാട്ടി; പി.കെ. ശശിക്കെതിരെ എല്‍.ഡി.എഫ്

പാലക്കാട്: ഒറ്റപ്പാലത്തെ യു.ഡി.എഫ് സ്ഥാനാര്‍ത്ഥിയും മുന്‍ എം.എല്‍.എയുമായ പി.കെ. ശശിക്കെതിരെ ആരോപണങ്ങളുമായി...

''என்னுடைய நிலைப்பாட்டைத் தள்ளி வைக்கிறேன்; காட்டுமன்னார்கோவில் தொகுதியில் ஜோதிமணி போட்டி!': திருமா!

சட்டமன்ற தேர்தலில் போட்டியிடப் போகும், விடுதலை சிறுத்தைகள் கட்சியின் வேட்பாளர்களை கடந்த...

Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

Off The Record: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో...