4
April, 2026

A News 365Times Venture

4
Saturday
April, 2026

A News 365Times Venture

Amit shah: 15 రోజులు బెంగాల్లోనే ఉంటా.. మమత సర్కార్‌ను గద్దె దించుతామని సవాల్

Date:

15 రోజుల పాటు బెంగాల్‌లోనే ఉంటానని.. మమత సర్కార్‌ను గద్దె దించుతామని అమిత్ షా సవాల్ విసిరారు. సువేందు అధికారి నామినేషన్ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. తాను రాబోయే 15 రోజుల పాటు బెంగాల్‌లోనే ఉంటానని కీలక ప్రకటన చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని రాష్ట్ర ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు.

సువేందు అధికారి నామినేషన్ కోసమే ప్రత్యేకంగా బెంగాల్‌కు వచ్చానని.. సువేందు విజయం బెంగాల్‌లో మార్పునకు పునాది వేస్తుందన్నారు. గతసారి నందిగ్రామ్‌లో ఓడిపోయిన మమతా బెనర్జీ.. ఈసారి భవానీపూర్‌తో పాటు యావత్ బెంగాల్‌లోనూ ఓడిపోతారని జోస్యం చెప్పారు. సువేందు అధికారి నామినేషన్ బెంగాల్‌లో టీఎంసీ పతనానికి నాంది అని అన్నారు. ఈసారి నందిగ్రామ్ ప్రజలు చరిత్రను పునరావృతం చేసి మమతా బెనర్జీని అధికారం నుంచి గద్దె దించుతారని ధీమా వ్యక్తం చేశారు.

తాను బెంగాల్ రాష్ట్రమంతా పర్యటించానని, తాను వెళ్లిన ప్రతిచోటా ఒకే స్వరం విన్నానని పేర్కొన్నారు. మమతా బెనర్జీకి వీడ్కోలు పలకండి. ప్రభుత్వానికి వీడ్కోలు పలకండి. మమతా బెనర్జీకి గుడ్ బై చెప్పండి అనే ఒకే స్వరం మాత్రమే తనకు వినిపించిందని పేర్కొన్నారు. దోపిడీ, గూండాయిజంతో బెంగాల్ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఆరోపించారు. తరచుగా జరుగుతున్న బాంబు పేలుళ్లు, నిరుద్యోగంతో యువత ఇబ్బందులు పడుతోందన్నారు. టీఎంసీ ప్రభుత్వం చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తోందని.. దీంతో రాష్ట్ర జనాభా స్వరూపాన్ని మారుస్తోందని ఆరోపించారు.  బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగాన్ని నిర్మూలించి.. నూతన అభివృద్ధిని తీసుకువస్తామని..తద్వారా బెంగాల్ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందగలదని అమిత్ షా యువతకు హామీ ఇచ్చారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಪಾಲಿಕೆಯಿಂದ ನೀರಿನ ಸಂಪರ್ಕ ಶುಲ್ಕ ಏರಿಕೆ: ಸಾರ್ವಜನಿಕರಿಂದ ತೀವ್ರ ಆಕ್ರೋಶ- ಮಾಜಿ ಮೇಯರ್ ಶಿವಕುಮಾರ್

ಮೈಸೂರು, ಏಪ್ರಿಲ್,4,2026 (www.justkannada.in): ಮೈಸೂರು ಮಹಾನಗರ ಪಾಲಿಕೆ ಇತ್ತೀಚೆಗೆ ನೀರಿನ...

‘പൈലറ്റിനെ ആരെങ്കിലും കണ്ടെത്തി തരുമോ? പ്ലീസ്!’, ഭരണമാറ്റം ലക്ഷ്യമിട്ടിറങ്ങിയവരുടെ അവസ്ഥ; ട്രംപിനെ പരിഹസിച്ച് ഇറാന്‍

ടെഹ്റാന്‍: ഇറാന്‍ മണ്ണില്‍ വെടിവച്ചിട്ട അമേരിക്കന്‍ യുദ്ധവിമാനത്തിലെ പൈലറ്റിനായുള്ള തിരച്ചില്‍ തുടരുന്നതിനിടെ,...

"நீண்ட நாள்களுக்கு முன்பே கட்சித் தலைமைக்குச் சொல்லிவிட்டேன்" – ஊகங்களுக்கு விளக்கமளித்த அண்ணாமலை

தமிழக சட்டமன்றத் தேர்தலுக்கான பா.ஜ.க வேட்பாளரின் பட்டியல் நேற்று வெளியானது. அதில்...

Sunny Leone: సన్నీ లియోన్ హాలీవుడ్ ఎంట్రీ.. అమెరికన్ ఓటీటీ సిరీస్ ‘ది జెయింట్’లో కీలక పాత్ర!

గ్లోబల్ స్టార్‌గా ఎదిగే క్రమంలో నటి సన్నీ లియోన్ ఒక అరుదైన...