31
March, 2026

A News 365Times Venture

31
Tuesday
March, 2026

A News 365Times Venture

Iran-US: భారత్‌కు వస్తున్న ఇరాన్ విమానంపై అమెరికా దాడి

Date:

పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరు పక్షాలు ఒకరిపై మరొకరు భీకర దాడులు చేసుకుంటున్నాయి. దీంతో మధ్యప్రాచ్యం యుద్ధం మరింత భయాందోళనలు కలిగిస్తోంది.

తాజాగా భారత సహాయం కోసం ఢిల్లీకి రావాల్సిన ఇరాన్‌ విమానంపై అమెరికా దాడి చేసింది. దీంతో మహాన్ ఎయిర్ విమానం దెబ్బతింది. ఇరాన్ ప్రజలకు అవసరమైన వైద్య, సహాయ సామగ్రిని తీసుకొచ్చేందుకు భారత్‌కు బయల్దేరాల్సిన విమానం ఇరాన్‌లోని మషద్ విమానాశ్రయంలో నిలిచి ఉంది. అయితే అమెరికా జరిపిన వైమానిక దాడితో విమానం ధ్వంసం అయింది. దీంతో మానవతా సహాయానికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. అయితే ఈ వార్తను అమెరికా అధికారులు ఇంకా ధృవీకరించలేదు.

మషద్ విమానాశ్రయం ఇరాన్‌లోని రజావి ఖొరాసన్ ప్రావిన్స్‌లోని మషద్‌లో ఉన్న ఒక అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం పౌర, సైనిక ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు. దీంతో అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. మషద్ విమానాశ్రయంపై అమెరికా దాడి తర్వాత విమానం దెబ్బతిన్నట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్.. సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

అమెరికా వైమానిక దాడిలో లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ విమానం ఏప్రిల్ 1న ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ద్వారా భారతదేశం మార్చి 18న ఇరాన్‌కు మొదటి విడత వైద్య సామాగ్రిని పంపింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం సహాయానికి భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. అప్పటి నుంచి అనేక నగరాల్లోని ఇరాన్ ప్రజలకు సహాయం చేయడానికి ప్రజలు నిధులు, సహాయక సామగ్రిని విరాళంగా ఇస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 ಕಾಂಗ್ರೆಸ್ ಟಿಕೆಟ್ ಕೊಡಲಿಲ್ಲ ಅಂತ ಮುಸ್ಲೀಮರು ಬಿಜೆಪಿಗೆ ಮತ ಹಾಕಲ್ಲ-ಸಚಿವ ರಾಮಲಿಂಗರೆಡ್ಡಿ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,30,2026 (www.justkannada.in):  ದಾವಣಗೆರೆ ದಕ್ಷಿಣ ವಿಧಾನಸಭಾ ಉಪಚುನಾವಣೆಯಲ್ಲಿ ಮುಸ್ಲೀಮರ ಮತ...

ദുബായ് തീരത്ത് കുവൈത്ത് എണ്ണ കപ്പലിന് നേരെ ഇറാന്റെ ഡ്രോണ്‍ ആക്രമണം; ക്രൂഡ് ഓയില്‍ വില കൂടി

ദുബായ്: ദുബായ് തീരത്ത് വെച്ച് കുവൈത്തിന്റെ എണ്ണ കപ്പല്‍ ആക്രമിക്കപ്പെട്ടു. നങ്കൂരമിടുന്നതിനിടെയാണ്...

`கேரளத்தில் கம்யூனிஸ்ட் ஆட்சி வரவேண்டும் என மோடி விரும்புகிறார்' – பிரசாரத்தில் பாய்ந்த ராகுல்

கேரளத்தில் ஏப்ரல் 9-ம் தேதி தேர்தல் நடைபெற உள்ள நிலையில், நாடாளுமன்ற...

ಬಹುಭಾಷಾ ನಟ ಪ್ರಕಾಶ್‌ ರಾಜ್‌ ಗೆ ಮಾತೃ ವಿಯೋಗ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,30,2026 (www.justkannada.in):  ಬಹುಭಾಷಾ ನಟ ಪ್ರಕಾಶ್ ರಾಜ್ ಅವರ ತಾಯಿ...