29
March, 2026

A News 365Times Venture

29
Sunday
March, 2026

A News 365Times Venture

MI vs KKR: నేడే ముంబై ‘తొలి మ్యాచ్’.. ఆ చెత్త రికార్డ్‌ను వాంఖడేలో చెరిపేస్తుందా?

Date:

MI vs KKR: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం మరో ఆసక్తికర పోరుకు వేదిక సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరాటం మాత్రమే కాదు.. ముంబై ఇండియన్స్‌ను 13 ఏళ్లుగా వెంటాడుతున్న ఒక ‘అపజయ పరంపర’కు ముగింపు పలకాల్సిన సమయం అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్‌కు ఒక విచిత్రమైన రికార్డు ఉంది. గత 13 సీజన్లుగా ఆ జట్టు తమ ఫస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది.

READ ALSO: Bank Account: మహిళా రైతు ఖాతాలో రూ.10 కోట్లు జమ.. ఆమె చేసిన పనికి అందరూ ఫిదా..

వాంఖడేలో ముంబైదే ఆధిపత్యం..
చివరిసారిగా 2012లో చెన్నై సూపర్ కింగ్స్‌పై తొలి మ్యాచ్ గెలిచిన ముంబై, ఆ తర్వాత ప్రతి ఏటా ఆరంభంలోనే తడబడుతోంది. మొత్తం 18 సీజన్ల ఓపెనింగ్ మ్యాచ్‌లలో ముంబై 14 సార్లు ఓడిపోవడం గమనార్హం. ఈ రికార్డుపై కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ చమత్కరిస్తూ.. “ముంబై ఓటమి పరంపర నేడు కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాను. అయితే వాంఖడే వారి కంచుకోట, అక్కడ వారిని ఓడించడం అంత సులభం కాదు” అని వ్యాఖ్యానించారు. తొలి మ్యాచ్ సెంటిమెంట్ భయపెడుతున్నా, వాంఖడే స్టేడియంలో ముంబైకి తిరుగులేని రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 92 మ్యాచ్‌లలో ముంబై 57 సార్లు విజయం సాధించింది (62% విన్నింగ్ రేట్). ఇక కేకేఆర్‌తో ముఖాముఖి పోరులోనూ ముంబైదే పైచేయి. ఇప్పటివరకు జరిగిన 35 మ్యాచ్‌లలో ముంబై 24 గెలిచి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.

కేకేఆర్‌కు గాయాల సెగ..
ఈ మ్యాచ్‌కు ముందు కేకేఆర్ జట్టుకు గాయాల సెగ గట్టిగానే తగిలింది. మతిషా పతిరానా ఇంకా జట్టులో చేరకపోగా, హర్షిత్ రాణా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ముస్తఫిజుర్ కూడా అందుబాటులో లేడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది.

తుది జట్లు (అంచనా)
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్ (wk), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, దీపక్ చాహర్, అల్లా ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
(ఇంపాక్ట్ సబ్స్: మయాంక్ మార్కండే/శార్దూల్ ఠాకూర్)

కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ (wk), అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, కామెరాన్ గ్రీన్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ, వరుణ్ చక్రవర్తి, ఉమ్రాన్ మాలిక్.
(ఇంపాక్ట్ సబ్స్: రాహుల్ త్రిపాఠి/కార్తీక్ త్యాగి)

READ ALSO: Iran: 168 మంది పిల్లల ప్రాణాలు తీసిన ‘మృగాలు’ వీరే.. అమెరికా అధికారుల పేర్లు బయటపెట్టిన ఇరాన్!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಟಾರ್ಚು – ಮರೆಯಲಾಗದ ಒಂದು ಪ್ರಯಾಣ

  ಬೆಂಗಳೂರು: ಇತ್ತೀಚೆಗೆ, ಆಹ್ವಾನದ ಮೇರೆಗೆ ನಾನು ಪ್ರಯೋಗಾತ್ಮಕ ಕನ್ನಡ ಚಲನಚಿತ್ರ...

എഥനോള്‍ ചേര്‍ത്ത പെട്രോളുള്ളതുകൊണ്ട് നമുക്ക് ഇന്ധന പ്രതിസന്ധിയുണ്ടായില്ല, E20 പെട്രോളിനെ ന്യായീകരിച്ച് മോദി

ലഖ്‌നൗ: കേന്ദ്ര സര്‍ക്കാരിന്റെ എഥനോള്‍ മിശ്രിത പെട്രോളിനെ ന്യായീകരിച്ച് പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര...

"சிறுபான்மையினர் வாக்குகளை அவ்வளவு எளிதாகக் கவர முடியாது" – விஜய்யை விமர்சிக்கும் கருணாஸ்

தமிழக வெற்றிக் கழகத்தின் தலைவர் விஜய், வருகிற சட்டமன்றத் தேர்தலில் போட்டியிடப்...

ಪತಿ ಮರಣದ ನಡುವೆಯೂ ಕರ್ತವ್ಯ ನಿಭಾಯಿಸಿದ ಶಿಕ್ಷಕಿ: ಶಾಸಕರಿಂದ ಶ್ಲಾಘನೆ

  ಮೈಸೂರು, March.29,2026: ವೈಯಕ್ತಿಕ ದುಃಖದ ನಡುವೆಯೂ ಕರ್ತವ್ಯಕ್ಕೆ ಆದ್ಯತೆ ನೀಡಿದ...