28
March, 2026

A News 365Times Venture

28
Saturday
March, 2026

A News 365Times Venture

Aloo Roti Recipe: ఆలూ రోటీ ఇలా ప్రయత్నించండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుంటూ తింటారు..

Date:

Aloo Roti Recipe: ప్రతిరోజూ ఒకే రకమైన బ్రేక్‌ఫాస్ట్‌ అల్పాహారం తింటూ విసిగిపోయారా? అయితే ఈ రోజు మీరు తప్పకుండా ప్రయత్నించాల్సిన ప్రత్యేక వంటకం ఆలూ రోటీ. బంగాళదుంపలతో తయారు చేసే ఈ రోటీ రుచిగా ఉండటమే కాకుండా తేలికగా, త్వరగా తయారవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ వంటకం మీ ఇంట్లో ఫేవరెట్‌గా మారిపోతుంది. అయితే, చాలామంది బంగాళదుంపతో పరాటా, పూరీ వంటి వంటకాలు తిని ఉంటారు. కానీ ఆలూ రోటీ మాత్రం కొంచెం కొత్తగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఉదయం తొందరగా ఉన్నప్పటికీ సులభంగా తయారు చేసుకోవచ్చు. అల్పాహారంగా, లంచ్‌బాక్స్‌కు లేదా సాయంత్రం స్నాక్‌గా కూడా ఇది బాగా సరిపోతుంది. నలుగురు సభ్యులున్న ఓ కుటుంబాన్ని ప్రతిపాదికగా తీసుకుంటే..

కావలసిన పదార్థాలు
* 7 ఉడికించిన బంగాళదుంపలు
* 1 కప్పు మైదా పిండి
* 2 టేబుల్ స్పూన్ల నూనె
* 2 టీస్పూన్ల ధనియాల పొడి
* 1 టీస్పూన్ కారం పొడి
* 1 టీస్పూన్ జీలకర్ర
* 1 టీస్పూన్ గరం మసాలా
* 1 టీస్పూన్ ఆమ్చూర్ పొడి
* రుచికి సరిపడా ఉప్పు
* అవసరమైనంత నెయ్యి

తయారీ విధానం
మొదటగా ఉడికించిన బంగాళదుంపలను బాగా మెత్తగా మాష్ చేయాలి.. ఒక బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర వేయాలి. తరువాత మాష్ చేసిన బంగాళదుంపలు, కారం, ధనియాల పొడి, ఉప్పు, ఆమ్చూర్ పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు వేయించి లేత ఎరుపు రంగు వచ్చే వరకు ఉంచాలి. ఇక పిండిని సిద్ధం చేయడానికి మైదాలో కొద్దిగా ఉప్పు వేసి నీరు జోడించి మృదువుగా కలపాలి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని అందులో బంగాళదుంపల మిశ్రమాన్ని పెట్టి పల్చగా రోటీలుగా ఒత్తాలి. కూర ఎక్కువగా పెట్టకుండా జాగ్రత్త పడాలి. తర్వాత తవ్వపై నెయ్యి రాసి రోటీలను రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే, రుచికరమైన ఆలూ రోటీ సిద్ధం.. వేడివేడిగా పెరుగు, చట్నీ లేదా సాస్‌తో వడ్డిస్తే మరింత రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేస్తే, మీ ఇంట్లో అందరూ మళ్లీ మళ్లీ అడుగుతారు సందేహమే లేదు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಉಪಚುನಾವಣೆ: ಎರಡೂ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ  ನಾವೇ ಗೆಲ್ಲುತ್ತೇವೆ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,27,2026 (www.justkannada.in): ದಾವಣಗೆರೆ ದಕ್ಷಿಣ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಬಂಡಾಯವೆದ್ದಿದ್ದ ಸಾಧಿಕ್ ಪೈಲ್ವಾನ್...

നേപ്പാള്‍ ജെന്‍ സി കലാപം അടിച്ചമര്‍ത്തി; മുന്‍ പ്രധാനമന്ത്രി കെ.പി ശര്‍മ ഒലി അറസ്റ്റില്‍

കാഠ്മണ്ഡു: നേപ്പാളില്‍ ജെന്‍ സി പ്രക്ഷോഭം അടിച്ചമര്‍ത്താന്‍ ശ്രമിച്ചെന്ന പരാതിയില്‍ മുന്‍...

ஈரான் போர்‌ குறித்து மோடி – ட்ரம்ப் போன் கால்; லைனில் 'எலான் மஸ்க்'கும்! – சர்ப்ரைஸ் ட்விஸ்ட்?

ஈரான் போர் தொடங்கி இன்றோடு ஐந்தாவது வாரம் ஆரம்பமாகிறது.ஈரான்‌ போர் குறித்து...

ಉರುಳಿಗೆ ಸಿಲುಕಿ ಹುಲಿ ಬಲಿ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,27,2026 (www.justkannada.in): ನಾಗರಹೊಳೆ ಹುಲಿ ಮೀಸಲು ಅರಣ್ಯದ ಮೆಟ್ಟಿಕುಪ್ಪೆ ಶ್ರೇಣಿಯ...