28
March, 2026

A News 365Times Venture

28
Saturday
March, 2026

A News 365Times Venture

Heart Touching Story : చనిపోయినా విడిపోలేదు.. విగ్రహాలు కట్టి ప్రతి ఏడాది పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు.!

Date:

ప్రేమకు చావు లేదని చాటిచెప్పే ఉదంతాలు అప్పుడప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. సుమారు 22 ఏళ్ల క్రితం విడిపోయిన ఇద్దరు ప్రేమికులను, వారి తల్లిదండ్రులు దైవస్వరూపులుగా భావిస్తూ ఏటా శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా వారికి ఘనంగా వివాహం జరిపిస్తున్నారు.

ఈ కథకు మూలం 22 ఏళ్ల క్రితం మొదలైంది. తండాకు చెందిన రామకోటి అనే యువకుడు ఒక యువతిని ప్రాణంగా ప్రేమించాడు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ, యువతి తల్లిదండ్రులు ఈ వివాహానికి అంగీకరించలేదు. పెద్దలు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామకోటి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియుడు ఇక లేడన్న నిజాన్ని తట్టుకోలేక, ఆ యువతి కూడా సరిగ్గా 20 రోజుల తర్వాత తనువు చాలించింది. ఒకే ప్రేమకథలో ఇద్దరూ విగతజీవులవ్వడం ఆ తండాలో తీవ్ర విషాదాన్ని నింపింది.

 Iran War: గల్ఫ్ దేశాలకు రక్షణ.. ఇరాన్ యుద్ధంలోకి ఉక్రెయిన్ ఎంట్రీ..

తమ కుమారుడు రామకోటి , అతను ప్రేమించిన యువతి పట్ల ఆ తల్లిదండ్రులు చూపిన మమకారం అనిర్వచనీయమైనది. చనిపోయినప్పటికీ వారి ప్రేమను సజీవంగా ఉంచాలని భావించిన రామకోటి తల్లిదండ్రులు, తమ ఇంట్లోనే ఆ ఇద్దరి ప్రేమికుల విగ్రహాలను ప్రతిష్టించారు. వారిని కేవలం ప్రేమికులుగా కాకుండా, ఆదర్శ దంపతులుగా భావిస్తూ భక్తిశ్రద్ధలతో పూజించడం ప్రారంభించారు.

FBI Chief Email Breached: అమెరికాకు బిగ్ షాక్.. FBI చీఫ్ ఈమెయిల్ హ్యాక్ చేసిన ఇరాన్..

ప్రతి ఏటా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ విగ్రహాలకు అత్యంత సాంప్రదాయబద్ధంగా వివాహం జరిపిస్తారు. ఈ వేడుకను కేవలం కుటుంబానికే పరిమితం చేయకుండా, బంధుమిత్రులను, గ్రామస్థులను ఆహ్వానించి ఒక అసలైన పెళ్లి వేడుకలా నిర్వహిస్తారు. రామకోటిని రాముడిగా, అతను ప్రేమించిన యువతిని సీతమ్మగా భావించి, వేద మంత్రాల సాక్షిగా తలంబ్రాల కార్యక్రమాన్ని జరిపిస్తారు. తమ బిడ్డ కోరికను బతికున్నప్పుడు తీర్చలేకపోయినా, విగ్రహాల రూపంలోనైనా వారిని ఒకటి చేస్తూ ఆ తల్లిదండ్రులు చేస్తున్న ఈ ప్రయత్నం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. కాలం మారుతున్నా, మనుషులు దూరమైనా.. స్వచ్ఛమైన ప్రేమకు గుర్తుగా సాగుతున్న ఈ వేడుక అమరప్రేమకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನಾಳೆಯಿಂದ IPL:  ಅಧಿಕಾರಿಗಳ ಜೊತೆ ಸಿಎಸ್ ಸುದೀರ್ಘ ಸಭೆ, ಸಲಹೆ ಸೂಚನೆ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,27,2026 (www.justkannada.in): ನಾಳೆಯಿಂದ IPL ಪಂದ್ಯಾವಳಿಗಳು ಆರಂಭವಾಗಲಿರುವ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ರಾಜ್ಯ...

‘ടീം ഇന്ത്യയായി ഒത്തൊരുമിച്ച് പ്രവര്‍ത്തിക്കണം’; പശ്ചിമേഷ്യന്‍ സംഘര്‍ഷത്തില്‍ മുഖ്യമന്ത്രിമാരുടെ യോഗം വിളിച്ച് പ്രധാനമന്ത്രി

ന്യൂദല്‍ഹി: പശ്ചിമേഷ്യന്‍ സംഘര്‍ഷത്തിന്റ സാഹചര്യത്തില്‍ രാജ്യത്തെ എല്ലാ സംസ്ഥാനങ്ങളിലെയും കേന്ദ്ര ഭരണപ്രദേശങ്ങളിലെയും...

'கூட்டம் கூடுவதற்கு ஏற்ற இடமல்ல' – விஜய்யின் பிரசாரத்துக்கு தேர்தல் அலுவலர் அனுமதி மறுத்தது ஏன்?

தவெக தலைவர் விஜய் நாளை பெரம்பூரிலிருந்து தனது பிரசாரத்தை தொடங்குவதாக திட்டமிட்டிருந்தார்....

ಯುಪಿಎಸ್ ಪರೀಕ್ಷೆಗೆ ಕಠಿಣ ಪರಿಶ್ರಮ, ಸ್ಥಿರತೆ ಮತ್ತು ಸ್ಮಾರ್ಟ್ ಓದು ಅಗತ್ಯ- ಕಿರಣ್ ಕಾಮ್ಟೆ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,27,2026 (www.justkannada.in):  ಯುಪಿಎಸ್ ಪರೀಕ್ಷೆ ಭೇದಿಸುವುದು ಸುಲಭವಲ್ಲ. ಅದಕ್ಕೆ ಕಠಿಣ...