26
March, 2026

A News 365Times Venture

26
Thursday
March, 2026

A News 365Times Venture

Delhi Metro: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో పేలుడు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు

Date:

దేశ రాజధాని ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జాఫ్రాబాద్ స్టేషన్‌లో ఈ పేలుడు సంభవించింది. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులంతా కంగారు పడిపోయారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: UK-Russia: పశ్చిమాసియాలో మరో ఘర్షణ.. రష్యా నౌకలను స్వాధీనం చేసుకోవాలని యూకే ఆదేశం

గురువారం సాయంత్రం 6:05 గంటలకు జాఫ్రాబాద్ స్టేషన్‌లో పేలుడు సంభవించింది. అయితే తెగిపోయిన గాలిపటం దారం హై-వోల్టేజ్ తీగల్లో చిక్కుకోవడంతో ఒక్కసారిగా రెండు పెద్ద పేలుళ్లు సంభవించాయి. అయితే ఏం జరిగిందో తెలియక తీవ్ర గందరగోళం నెలకొంది. పేలుడు శబ్దం వల్ల ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ముందు జాగ్రత్తగా మెట్రో స్టేషన్ ఖాళీ చేయించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని.. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: PM Modi: మోడీ కాన్ఫరెన్స్‌కు పలువురు సీఎంలు దూరం.. కారణమిదే!

ఇక ఘటనపై సీఐఎస్ఎఫ్ దర్యాప్తు చేయడంతో అసలు కారణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కుట్ర కాదని, తెగిపోయిన గాలిపటం కారణంగా ఈ పేలుడు సంభవించినట్లుగా పేర్కొంది. కొంతమంది పిల్లలు స్టేషన్ సమీపంలో గాలిపటాలు ఎగురవేస్తుండగా వాటి దారం నేరుగా మెట్రో హై-వోల్టేజ్ విద్యుత్ తీగలకు తగలగానే భారీ షార్ట్ సర్క్యూట్ జరిగి పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని వెల్లడించింది. చిన్న అగ్నిప్రమాదం జరిగిందని పేర్కొంది. ప్రయాణికులందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని డీసీపీ మెట్రో స్పష్టం చేసింది. పేలుడు జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే మార్గంలో మెట్రో సేవలకు కొద్దిసేపు అంతరాయం కలగడంతో ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగించింది.

జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ కీలకం..
జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ ఈశాన్య ఢిల్లీలోని ఒక సమస్యాత్మక ప్రాంతం . ఇది సీలంపూర్, మౌజ్‌పూర్, భజన్‌పురా, యమునా విహార విహార్ వంటి జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రధాన రవాణా కేంద్రంగా పనిచేస్తుంది. పింక్ లైన్‌లో ఉన్నందున ఇది పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులను ఆకర్షిస్తుంది. అదృష్టవశాత్తూ పరిస్థితిని సకాలంలో అదుపులోకి తీసుకురావడంతో విషాదం తప్పింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

திடீரென டிஜிபி அலுவலகத்தில் விஜய்; யார் மீது புகார் கொடுத்தார்? – விவரம் என்ன?

தவெக தலைவர் விஜய் திடீரென சென்னை டிஜிபி அலுவலகத்திற்கு நேரில் சென்று...

ಪಾಲಿಕೆಯ 2026-27ನೇ ಆಯವ್ಯಯವು ‘ಸತ್ವ ಇಲ್ಲದ ಬಜೆಟ್’- ಮಾಜಿ ಮೇಯರ್ ಶಿವಕುಮಾರ್  ಟೀಕೆ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,26,2026 (www.justkannada.in): ಜನಸ್ನೇಹಿ ಪಾದಚಾರಿ ಮಾರ್ಗಗಳ ಅಭಿವೃದ್ಧಿಗೆ 10 ಕೋಟಿ...

ഇറാന്റെ തിരിച്ചടിയില്‍ സൈനിക താവളങ്ങള്‍ തകര്‍ന്നു; ഹോട്ടലുകളില്‍ അഭയം തേടി അമേരിക്കന്‍ സൈന്യം; റിപ്പോര്‍ട്ട്

വാഷിങ്ടണ്‍: ഇറാന്റെ പ്രത്യാക്രമണത്തില്‍ സൈനിക താവളങ്ങള്‍ തകര്‍ന്നതോടെ, പശ്ചിമേഷ്യയിലെ യു.എസ് സേന...