26
March, 2026

A News 365Times Venture

26
Thursday
March, 2026

A News 365Times Venture

Karnataka: క్లాస్‌లోనే విద్యార్థినికి ప్రొఫెసర్ ‘‘ఐ లవ్ యూ’’.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Date:

Karnataka: బాధ్యతాయుతమైన ప్రొఫెసర్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి నీచంగా ప్రవర్తించాడు. క్లాస్ రూంలోనే అంతరి ముందు విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరులో ఉన్న శ్రీ సిద్ధార్థ వైద్య కళాశాల (SSMC)లో జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అబ్దుల్ విద్యార్థినికి ప్రపోజ్ చేయడం ఉద్రిక్తతల్ని పెంచింది. దీంతో ఆగ్రహించిన స్టూడెంట్స్ ప్రొఫెసర్‌పై దాడి చేశారు. ఈ కాలేజీ కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వరకు చెందినది. ఈ ఘటన వైరల్ కావడంతో ప్రొఫెసర్‌ను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.

Read Also: Telangana Assembly: జీఎస్టీ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ అమోదం.. ఆ పోస్టుల పేర్లు మార్పు..

వైరల్ అవుతున్న వీడియోలో.. ‘‘మీ బ్యాచ్ చూపిస్తున్న అపారమైన ప్రేమను నేను తట్టుకోలేకపోయాను, మరియు మీ బ్యాచ్‌లోని అత్యంత ముఖ్యమైన అమ్మాయిలలో ఒకరికి నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను… మరియు నేను మొత్తం బ్యాచ్‌కు చాక్లెట్లు పంచుతాను.’’ అంటూ, సదరు అమ్మాయికి ‘‘ఐ లవ్ యూ’’ అని చెప్పాడు. ఈ ఘటన తర్వాత షాక్‌కు గురైన విద్యార్థిని ప్రొఫెసర్‌ను నిలదీసింది. స్టూడెంట్ తనను ప్రేమిస్తోందని, దానికి రుజువులు ఉన్నాయని ప్రొఫెసర్ చెప్పడం కొసమెరుపు. ‘‘నువ్వు నాకు ఐలవ్ యూ చెప్పావు. దీనికి సీసీటీవీ ఫుటేజ్ రుజువులు ఉన్నాయి’’ అని ప్రొఫెసర్ విద్యార్థినితో అన్నాడు. దీని తర్వాత విద్యార్థిని తన చెప్పుతో ప్రొఫెసర్‌ను కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. క్యాంపస్‌లో వెంబడించి మరీ విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనలో అబ్దుల్‌ను సస్పెండ్ చేయగా, దీనిపై విచారణ జరుగుతోంది.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಪಾಲಿಕೆಯ 2026-27ನೇ ಆಯವ್ಯಯವು ‘ಸತ್ವ ಇಲ್ಲದ ಬಜೆಟ್’- ಮಾಜಿ ಮೇಯರ್ ಶಿವಕುಮಾರ್  ಟೀಕೆ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,26,2026 (www.justkannada.in): ಜನಸ್ನೇಹಿ ಪಾದಚಾರಿ ಮಾರ್ಗಗಳ ಅಭಿವೃದ್ಧಿಗೆ 10 ಕೋಟಿ...

ഇറാന്റെ തിരിച്ചടിയില്‍ സൈനിക താവളങ്ങള്‍ തകര്‍ന്നു; ഹോട്ടലുകളില്‍ അഭയം തേടി അമേരിക്കന്‍ സൈന്യം; റിപ്പോര്‍ട്ട്

വാഷിങ്ടണ്‍: ഇറാന്റെ പ്രത്യാക്രമണത്തില്‍ സൈനിക താവളങ്ങള്‍ തകര്‍ന്നതോടെ, പശ്ചിമേഷ്യയിലെ യു.എസ് സേന...

"நாங்கள் சிரித்துக்கொண்டே அழுகிறோம்.!"- திமுக-வின் தொகுதிப் பங்கீடு குறித்து மதிமுக அர்ஜுனராஜ்

திமுக தங்களுக்கு கொடுத்த எண்ணிக்கை, சின்னம் தொடர்பாக தங்களுக்கு வருத்தம் உள்ளதாக...

ಜನರ, ಪಕ್ಷದ ಬೆಂಬಲ ಇಲ್ಲದಿದ್ದರೇ ನಾನು 17 ಬಜೆಟ್ ಮಂಡಿಸಲು ಹೇಗೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತಿತ್ತು-ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,26,2026 (www.justkannada.in):  ನನಗೆ ರಾಜ್ಯದ ಜನರ ಪಕ್ಷದ ಹೈಕಮಂಢ್  ಬೆಂಬಲ...