26
March, 2026

A News 365Times Venture

26
Thursday
March, 2026

A News 365Times Venture

Mermaid: రేజర్ షార్ప్ పళ్లు, చేప తోకతో మమ్మీ.. జపాన్‌లో సగం చేప సగం మానవుడి మెర్‌మెయిడ్

Date:

జపాన్‌లోని ఫుకుషిమాలోని ఒక పాత ఇంట్లో ఒక విచిత్రమైన మమ్మీ వెలుగుచూసింది. ఇది సగం చేప, సగం మానవుడి లాంటి రూపంలో ఉంది. దీనిని “మెర్‌మెయిడ్ మమ్మీ” అని పిలుస్తున్నారు. దీనికి కత్తి లాంటి పదునైన పళ్లు ఉన్నాయి. పెద్ద చేతులు ఉన్నాయి. శరీరం కింద భాగం చేప తోక లాగా ఉంది. శరీరం మీద పొలుసులు కనిపిస్తాయి. ఇది ఒక ఎముకలు లాగా కనిపించే మమ్మీఫైడ్ రూపంలో ఉంది.

Also Read:Operation Sindoor Movie: ‘ఆపరేషన్ సిందూర్‌’పై సినిమా.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరంటే?

ఈ విచిత్రమైన జీవి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది దీన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇది జపాన్ పురాణాల్లోని కప్పా అనే పాత్రకు సంబంధించిన మోడల్ లేదా ప్రతినిధి అని నమ్ముతున్నారు. కప్పా అనేది జపాన్ యోకై (యోకై = అతీంద్రియ జీవులు)లో ఒకటి. ఇవి నీటి దెయ్యాలు లాగా నదుల్లో నివసిస్తాయి. వీటికి పచ్చటి పొలుసులు, మానవుడి లాంటి రూపం ఉంటుంది. కప్పాలు మనుషులను లేదా జంతువులను నీటిలోకి లాగి ముంచేస్తాయని చెబుతుంటారు.

ఇలాంటి “మెర్‌మెయిడ్” లేదా “నింగ్యో (Ningyo)” మమ్మీలు జపాన్‌లో గతంలో కూడా కనిపించాయి. కొన్ని పురాతన దేవాలయాల్లో ఉన్నాయి. వాటిని ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం పూజించేవారు. కానీ ఆధునిక పరిశోధనల్లో అవి కృత్రిమంగా తయారు చేసినవి (paper, cloth, fish parts, monkey parts మొదలైనవి కలిపి) అని తేలాయి. ఈ మమ్మీని యోనెజావా సిటీ సిటిజన్స్ గ్యాలరీలో ప్రదర్శించనున్నారు. మార్చి 28-29 తేదీల్లో ఓషు రేర్ ట్రెజర్స్ మార్కెట్లో ఆక్షన్లో పెట్టనున్నారు. దీని ధర సుమారు £11,755 (సుమారు రూ.14 లక్షలు) వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు.

Also Read:Nirav Modi Extradition: నీరవ్ మోడీకి భారీ షాక్.. భారత్‌కు అప్పగింతకు గ్రీన్ సిగ్నల్

జపాన్‌లో ఇలాంటి కప్పా లేదా మెర్‌మెయిడ్ మమ్మీలు సుమారు 10 మాత్రమే నిర్ధారణ అయ్యాయని ఈవెంట్ ఆర్గనైజర్ తకేయుకి కిమురా చెప్పారు. ఇప్పటికి ఇది పురాణాల్లోని జీవికి సంబంధించిన మోడల్ అని చెబుతున్నారు. గతంలో ఇలాంటి మమ్మీలు దేవాలయాలకు సందర్శకులను ఆకర్షించడానికి లేదా బౌద్ధ బోధల కోసం తయారు చేసేవారు. పూర్తి శాస్త్రీయ పరిశోధన జరిగితే మరిన్ని వివరాలు తెలుస్తాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಜನರ, ಪಕ್ಷದ ಬೆಂಬಲ ಇಲ್ಲದಿದ್ದರೇ ನಾನು 17 ಬಜೆಟ್ ಮಂಡಿಸಲು ಹೇಗೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತಿತ್ತು-ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,26,2026 (www.justkannada.in):  ನನಗೆ ರಾಜ್ಯದ ಜನರ ಪಕ್ಷದ ಹೈಕಮಂಢ್  ಬೆಂಬಲ...

സാദിഖലി തങ്ങളെ അപകീർത്തിപ്പെടുത്തിയുള്ള ഫേസ്ബുക്ക് പോസ്റ്റ്: കാപ്പ കേസ് പ്രതി ആവശ്യപ്പെട്ടത് 15 കോടി

മലപ്പുറം: സാദിഖലി തങ്ങളെ അപകീർത്തിപ്പെടുത്തിയുള്ള ഫേസ്ബുക് പോസ്റ്റിന് പിറകിലെ ലക്ഷ്യം ബ്ലാക്ക്...

ஸ்டாலின் Vs விஜய்… பெண்கள் வாக்குகளை வளைப்பதில் தீவிரம் | ‘வாவ்’ வியூகம் 10

பெண்கள் வாக்குகளை வளைப்பதில் தீவிரம்‘வாவ்’ வியூகம் 10வாக்காளர்கள் எதிர்பார்த்த ஜனநாயகத் திருவிழா...

ಟಿಪ್ಪರ್- ಖಾಸಗಿ ಬಸ್ ಡಿಕ್ಕಿ: 13 ಮಂದಿ ಸಜೀವ ದಹನ

ಪ್ರಕಾಶಂ, ಮಾರ್ಚ್,26,2026 (www.justkannada.in):  ಟಿಪ್ಪರ್ ಮತ್ತು ಖಾಸಗಿ ಬಸ್ ಗಳ...