25
March, 2026

A News 365Times Venture

25
Wednesday
March, 2026

A News 365Times Venture

Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

Date:

Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్యదేశంగా పాకిస్తాన్ నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన IQAir విడుదల చేసిన 2025 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం.. పాకిస్తాన్‌లో ఎక్కువ కాలుష్యం ఉన్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్, తజకిస్తాన్ నిలిచాయి. భారత్ ఈ జాబితాలో ఆరోస్థానంలో ఉంది. ఈ నివేదికను 143 దేశాల్లోని 9446 నగరాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా 40,000కి పైగా మానిటరింగ్ స్టేషన్ల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఫలితాలు వెల్లడించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిర్దేశించిన PM2.5 ప్రమాణాలను కేవలం 13 దేశాలు మాత్రమే పాటించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో ఫ్రెంచ్ పాలినేషియా, ప్యూర్టో రికో, యూఎస్ వర్జిన్ ఐలాండ్స్, బార్బడోస్, న్యూ కాలెడోనియా, ఐస్‌లాండ్, బెర్ముడా, రీయూనియన్, అండోరా, ఆస్ట్రేలియా, గ్రెనడా, పనామా, ఎస్టోనియా దేశాలు ఉన్నాయి. మిగతా 91 శాతం దేశాల్లో ఈ ప్రమాణాలకు మించి కాలుష్యం నమోదైంది.

Read Also: Monalisa: శరీరాన్ని అసభ్యంగా తాకేవాడని అమ్మానాన్నకి చెబితే సర్దుకుపోమన్నారు.. మోనాలిసా సంచలన ఆరోపణలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత కాలుష్య నగరాలు ఎక్కువగా భారత్, పాకిస్తాన్, చైనా దేశాల్లో ఉన్నట్లు చెప్పింది. ముఖ్యంగా భారత్‌లోని లోని అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ఆ తర్వాత చైనాలోని హోటాన్, భారత్‌లోని మేఘాలయాలోని బైర్నిహట్ ఉన్నాయి. ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్ ఉంది.

అత్యంత పరిశుభ్రమైన నగరంగా దక్షిణాఫ్రికాలోని న్యూవౌడ్‌విల్లే నిలిచింది. ఇక ప్రపంచంలోన అత్యంత కలుషితమైన దేశాల జాబితాలో చైనా 20వస్థానంలో, అమెరికా 120వ స్థానంలో, యూకే 110వ స్థానంలో ఉన్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಪಾರಂಪರಿಕ ಕಟ್ಟಡಗಳ ಸಂರಕ್ಷಣೆಗೆ ಹೆಚ್ಚಿನ ಅನುದಾನ ಒದಗಿಸಿ –MLC ಕೆ.ಶಿವಕುಮಾರ್ ಆಗ್ರಹ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,24,2026 (www.justkannada.in):  ಮೈಸೂರು ನಗರ ಸೇರಿದಂತೆ ರಾಜ್ಯದಲ್ಲಿರುವ ಪಾರಂಪರಿಕ ಕಟ್ಟಡಗಳ...

തോല്‍പിച്ചത് കോണ്‍ഗ്രസ്, വോട്ട് ചെയ്യരുതെന്ന് വീടുകള്‍ കയറി പ്രചരണം നടത്തി; തുറന്നുപറഞ്ഞ് മുന്‍മന്ത്രി ജയലക്ഷ്മി

കല്‍പ്പറ്റ: 2021 നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പില്‍ തന്നെ തോല്‍പ്പിക്കാന്‍ കോണ്‍ഗ്രസ് ഗൂഡാലോചന നടത്തിയതായി...

'ராகுலுக்கு விஜய்தான் பிடிக்கும்; காங் நிர்வாகிகள் தவெக ஆபிஸில் நிற்கிறார்கள்!' – ஆதவ் அர்ஜூனா

தவெகவின் சென்னை எழும்பூர் தொகுதி வேட்பாளராக கட்சியின் கொள்கைப் பரப்புச் செயலாளர்...

IPL 2026 : ‘RCB’ ತಂಡಕ್ಕೆ  KMF ಅಧಿಕೃತ ಪಾಲುದಾರ..!

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,24,2026 (www.justkannada.in): ಐಪಿಎಲ್ 2026 ಆವೃತ್ತಿಯಲ್ಲಿ ಆರ್‌ ಸಿಬಿ ತಂಡಕ್ಕೆ...