21
March, 2026

A News 365Times Venture

21
Saturday
March, 2026

A News 365Times Venture

Danam Nagender : దానం నాగేందర్ ‘క్లీన్ చిట్’పై హైకోర్టులో సవాల్

Date:

తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి న్యాయస్థానం మెట్లెక్కింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

గత సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఖైరతాబాద్ నుంచి గెలుపొందిన దానం నాగేందర్, ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. బీఆర్ఎస్ బీ-ఫామ్ ద్వారా గెలిచి మరో పార్టీలోకి వెళ్లినందున ఆయనపై అనర్హత వేటు వేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి గతంలోనే స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

Fanny Utagushima-Ninde: రికార్డు బ్రేక్.. 15 ఏళ్ల ఫానీ ఉటాగుషిమానిండే డెబ్యూతోనే అజేయ సెంచరీ

ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్, దానం నాగేందర్ అసలు పార్టీ మారలేదని, ఆయనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే, బహిరంగంగానే పార్టీ మారిన వ్యక్తికి స్పీకర్ ఇలాంటి తీర్పు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లో అసెంబ్లీ స్పీకర్‌ను , దానం నాగేందర్‌ను ప్రతివాదులుగా చేర్చారు.

ఈ కీలక పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్) ధర్మాసనం ఎల్లుండి విచారణ జరపనుంది. స్పీకర్ నిర్ణయంపై కోర్టు ఏ రకమైన స్పందన తెలియజేస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ విచారణలో పిటిషనర్ తరపున, స్పీకర్ తరపున , దానం నాగేందర్ తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించనున్నారు.

Aishwarya Lekshmi: పెళ్లి కంటే అదే బెటర్.. హీరోయిన్ షాకింగ్ స్టేట్‌మెంట్!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕರ್ನಾಟಕ ಜಾಹೀರಾತು ನೀತಿ ಪುನರ್‌ ಪರಿಶೀಲನೆಗೆ ಮೈಸೂರು ಜಿಲ್ಲಾ ಪತ್ರಕರ್ತರ ಸಂಘ ಒತ್ತಾಯ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್.26,2026:  ರಾಜ್ಯ ಸರಕಾರವು ಜಾರಿಗೆ ತರಲು ಮುಂದಾಗಿರುವ ʻಕರ್ನಾಟಕ ಜಾಹೀರಾತು...

വര്‍ഗീയ പരാമര്‍ശം; ഗോപാലകൃഷ്ണനെതിരെ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷന് പരാതി നല്‍കി സി.പി.ഐ.എം

  തൃശൂര്‍: ഗുരുവായൂരിലെ എന്‍.ഡി.എ സ്ഥാനാര്‍ത്ഥി അഡ്വ. ബി. ഗോപാലകൃഷ്ണനെതിരെ തെരഞ്ഞെടുപ്പ്...

தேர்தல் விதியை மீறி பரிசுப்பொருள்: வேலூர் மேயருக்கு போலீஸ் சம்மன்; திமுக எம்எல்ஏ-வும் சிக்குகிறாரா?

வேலூர் சத்துவாச்சாரியில், கடந்த 19-ம் தேதி, தேர்தல் நடத்தை விதிகளை மீறி...

ಇಸ್ರೇಲ್ ನಿಂದ ಭಾರತಕ್ಕೆ ಪ್ರಯೋಜವಿಲ್ಲ: ಇರಾನ್ ಜೊತೆ ಸ್ನೇಹ ಮಾಡಬೇಕಿತ್ತು-ಶಾಸಕ ಎ.ಎಸ್ ಪೊನ್ನಣ್ಣ

ಮಡಿಕೇರಿ,ಮಾರ್ಚ್,21,2026 (www.justkannada.in): ಇಸ್ರೇಲ್ ನಿಂದ ಭಾರತಕ್ಕೆ ಯಾವುದೇ ಪ್ರಯೋಜವಿಲ್ಲ. ಯಾವ...