18
March, 2026

A News 365Times Venture

18
Wednesday
March, 2026

A News 365Times Venture

Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

Date:

Nora Fatehi Song Controversy: ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాటపై తీవ్ర వివాదమే రేగింది.. ఈ పాటలో నోరా ఫతేహి నృత్య భంగిమలు, పాటలోని అసభ్యకరమైన సాహిత్యం తీవ్ర విమర్శలకు గురయ్యాయి. అసభ్యకరమైన సాహిత్యం, నృత్య భంగిమల కారణంగా తీవ్ర విమర్శలు రావడంతో గీత రచయిత స్పందించారు. ఈ పాటకు గీత రచయిత రఖీబ్‌ ఆలం.. పేరు కనిపించడంతో నెటిజన్లు ఆయనను కూడా టార్గెట్ చేశారు. దీనిపై స్పందించిన రఖీబ్ ఆలం తాను అసలు ఈ పాట సాహిత్యం రాయలేదని స్పష్టం చేశారు.

“అది నా తప్పు కాదు” – గీత రచయిత
ఒక మీడియా ఇంటర్వ్యూలో రఖీబ్ ఆలం మాట్లాడుతూ, ఈ పాటను చిత్ర దర్శకుడు Prem మొదట కన్నడలో రాశారని తెలిపారు. “నన్ను ఈ పాట రాయమని అడిగినప్పుడు నేను నిరాకరించాను. అలాంటి సాహిత్యం ఉన్న పాటలు సెన్సార్ సమస్యలు ఎదుర్కొంటాయని కూడా చెప్పాను. కానీ, చివరకు వారు అసలు కన్నడ వెర్షన్‌ను యథాతథంగా హిందీలోకి అనువదించాలని కోరారు. అందులో ఉన్న కొన్ని పదాలు అప్పటికే ఒరిజినల్ వెర్షన్‌లో ఉన్నాయి,” అని ఆయన చెప్పారు.

పాటలోని కొన్ని లైన్లు ద్వంద్వార్థంతో ఉన్నాయని అంగీకరించిన ఆయన, “చివరికి అది మద్యం సీసా గురించి అని చెప్పినా, మధ్యలోని పదాలు చాలా అసభ్యంగా వినిపిస్తాయి. అందుకే నేను మొదట రాయడానికి ఒప్పుకోలేదు,” అని తెలిపారు.

సోషల్ మీడియాలో క్షమాపణ
ఈ వివాదం పెరగడంతో రఖీబ్ ఆలం సోషల్ మీడియాలో క్షమాపణ చెప్పారు. “నేను మంచి పాటలు రాస్తే ఎవ్వరూ గుర్తించరు. కానీ ఇలాంటి వివాదం మాత్రం పెద్ద చర్చ అవుతుంది,” అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఈ పాటపై తీవ్ర విమర్శలు రావడంతో నిర్మాతలు అధికారిక హిందీ వెర్షన్‌ను యూట్యూబ్ నుంచి తొలగించినట్టు సమాచారం. అయినప్పటికీ ఈ వివాదం సోషల్ మీడియాలో ఇంకా చర్చకు దారితీస్తూనే ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕೈಗಾರಿಕೆಗಳು ಹೊರ ಹೋಗುತ್ತಿರುವುದು ಮೂಲಭೂತ ಸೌಕರ್ಯಗಳ ಕೊರತೆಯಿಂದಲ್ಲ-ಸಚಿವ ಭೈರತಿ ಸುರೇಶ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,17,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದ ಕೈಗಾರಿಕೆಗಳು ಮೂಲಭೂತ ಸೌರ್ಕಯಗಳ ಕೊರತೆಯಿಂದ ಹೊರಹೋಗುತ್ತಿಲ್ಲ....

‘ഇറാന്‍ ഒരു ആസന്ന ഭീഷണിയല്ല, ഈ യുദ്ധം ഇസ്രായേലിന് വേണ്ടി’; രാജിവച്ച് അമേരിക്കന്‍ ഭീകരവിരുദ്ധ സമിതി മേധാവി

വാഷിങ്ടണ്‍: ഇറാനെതിരായ യു.എസ്- ഇസ്രഈല്‍ ആക്രമണത്തെ എതിര്‍ത്ത് യു.എസ് ഭീകരവിരുദ്ധ സമിതിയിലെ...

'ரஜினியை பற்றி பேசினால்…' – ஆதவ் இருந்த மேடையிலேயே கொந்தளித்த ரஜினி ரசிகர்

சென்னை கொளத்தூரில் தவெகவின் கொள்கை விளக்கப் பொதுக்கூட்டம் நடந்திருந்தது. இந்தக் கூட்டத்தில்...

ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯರನ್ನ ಹೊಗಳಿದ ಜೆಡಿಎಸ್ MLC

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,17,2026 (www.justkannada.in):  ಸದನದಲ್ಲಿ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯರನ್ನು ವಿಧಾನಪರಿಷತ್ ಜೆಡಿಎಸ್ ಸದಸ್ಯ ...