17
March, 2026

A News 365Times Venture

17
Tuesday
March, 2026

A News 365Times Venture

Iran-Israel: ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బలు.. అత్యున్నత భద్రతా అధికారి లారిజానీ హతం

Date:

ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందించిన ఇజ్రాయెల్.. తాజాగా జరిపిన దాడిలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులను కూడా హతమార్చింది. గత రాత్రి జరిపిన దాడిలో ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి అలీ లారిజానీ కూడా హతమైనట్లుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వెల్లడించారు. ఇప్పటికే ఇరాన్ సైన్యాధిపతి సోలేమానీని చంపినట్లుగా ఐడీఎఫ్ వెల్లడించింది. ఇదే ఘటనలో అలీ లారిజాని కూడా చనిపోయినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇతర ఉన్నతాధికారులను కూడా అంతమొందించినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఇరాన్ స్పందించలేదు.

అలీ లారిజానీ..
అలీ లారిజానీ.. అయతుల్లా అలీ ఖమేనీకి కుడిభుజం లాంటివాడు. దేశ భద్రత, ఇరాన్ అణు కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. సుప్రీం కౌన్సిల్‌ ఆఫ్‌ ది కల్చరల్‌ రివల్యూషన్‌లోనూ సభ్యుడిగా ఉన్నారు. అలీ ఖమేనీ మరణానంతరం లారిజానీని ఇరాన్‌లో శక్తిమంతమైన నేతగా అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: Petrol-Diesel: వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన

శుక్రవారం టెహ్రాన్‌లో జరిగిన ఖుద్స్ డే ర్యాలీల సందర్భంగా అలీ లారిజాని చివరిసారిగా బహిరంగంగా కనిపించారు. అనంతరం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో సంబంధం ఉన్న 10 మంది వ్యక్తుల జాబితాలో భాగంగా లారిజానీతో సహా సీనియర్ ఇరాన్ సైనిక, గూఢచార అధికారుల గురించిన సమాచారం కోసం అమెరికా 10 మిలియన్ డాలర్ల వరకు బహుమతిని ప్రకటించింది. అలా అమెరికా రివార్డ్ ప్రకటించిన కొద్దిరోజులకే ఇజ్రాయెల్ హతమార్చేసింది.

 

 


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕನ್ನಡ ಕಡೆಗಣನೆ, ರೈಲ್ವೆ ಇಲಾಖೆ ಪರೀಕ್ಷೆ ದಿಢೀರ್ ರದ್ದು: ಅನ್ಯಾಯ ಸರಿಪಡಿಸಲು ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಆಗ್ರಹ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,17,2026 (www.justkannada.in):  ರೈಲ್ವೆ ಇಲಾಖೆಯ ಮುಂಬಡ್ತಿ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ಕನ್ನಡ ಭಾಷೆಗೆ...

സൈന്യത്തെ വിന്യസിക്കുകയാണെങ്കിൽ മറ്റൊരു വിയറ്റ്നാമിനെ നേരിടാൻ ഒരുങ്ങിക്കോളൂ; യു.എസിന് മുന്നറിയിപ്പുമായി ഇറാൻ

ടെഹ്‌റാൻ: യുദ്ധത്തിൽ കരസേനയെ വിന്യസിക്കുകയാണെങ്കിൽ അമേരിക്ക മറ്റൊരു വിയറ്റ്നാം യുദ്ധത്തിന് തയ്യാറായിക്കോളു...

'தனி ரூட்டில் ஆதவ்; அப்செட் ஆன விஜய்; ரஜினி வழி 'செக்' ! – குஷியில் ஆனந்த்!

மேடை இலக்கணம் தெரியாமல் ரஜினியை எக்குத்தப்பாக சீண்டி பேசி ரஜினி ரசிகர்களை...

ಸರ್ಕಾರಿ ಆಸ್ಪತ್ರೆಗಳಲ್ಲಿ ಔಷಧಿಗಳ ಕೊರತೆ ಆಗದಂತೆ ಕ್ರಮ- ಸಚಿವ ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,17,2026 (www.justkannada.in): ಸರ್ಕಾರಿ ಆಸ್ಪತ್ರೆಗಳಲ್ಲಿ ಔಷಧಿಗಳ ಕೊರತೆ ಆಗದಂತೆ ಕ್ರಮ...