16
March, 2026

A News 365Times Venture

16
Monday
March, 2026

A News 365Times Venture

Oscars 2026 : ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నల్లజాతీయుడి అరుదైన రికార్డు

Date:

లాస్ ఏంజిల్స్: ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారాలైన 98వ అకాడమీ అవార్డుల (Oscars 2026) ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మైఖేల్ బి. జోర్డాన్ ఉత్తమ నటుడి విభాగంలో తన కెరీర్‌లో మొదటి ఆస్కార్‌ను అందుకున్నారు. దర్శకుడు ర్యాన్ కూగ్లర్ తెరకెక్కించిన ‘సినర్స్’ చిత్రంలో జోర్డాన్ పోషించిన ద్విపాత్రాభినయం (స్మోక్ మరియు స్టాక్) విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ విభాగంలో గట్టి పోటీనిచ్చిన లియోనార్డో డికాప్రియో, తిమోతీ చాలమెట్ వంటి హేమాహేమీలను వెనక్కి నెట్టి జోర్డాన్ ఈ ఘనత సాధించడం విశేషం.

 అవార్డు అందుకున్న అనంతరం జోర్డాన్ చాలా భావోద్వేగానికి లోనయ్యారు.ఆస్కార్ వేదికపై జోర్దాన్ మాట్లాడుతూ ” దేవునికి అలాగే నా తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా తన చిరకాల మిత్రుడు, దర్శకుడు ర్యాన్ కూగ్లర్‌ “నన్ను నమ్మి, నాలోని ప్రతిభను ప్రపంచానికి చూపినందుకు థాంక్స్. నా కెరీర్‌లో నాకు మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను గొప్ప విజయాలు సాధించాలని మీరు కోరుకుంటున్నారని నాకు తెలుసు. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నేను ఎప్పుడూ ప్రయత్నిస్తా. అలాగే తనకంటే ముందు ఆస్కార్ అందుకున్న నల్లజాతీయులైన సిడ్నీ పోయిటియర్, డెంజెల్ వాషింగ్టన్ వంటి మహానటులకు హ్యాట్సాఫ్’ అని అన్నారు.

 ఈ విజయంతో ఆస్కార్ చరిత్రలో ‘ఉత్తమ నటుడు’ అవార్డును గెలుచుకున్న ఆరవ నల్లజాతీయుడిగా మైఖేల్ బి. జోర్డాన్ నిలిచారు. గతంలో ‘ఫ్రూట్‌వేల్ స్టేషన్’, ‘క్రీడ్’, మరియు ‘బ్లాక్ పాంథర్’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు, ఈ అవార్డు దక్కడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഹോളിക്കിടെ സംഘര്‍ഷം, ഹിന്ദു യുവാവിന്റെ മരണം; ദല്‍ഹിയില്‍ 70 കടകള്‍ ഇടിച്ചുനിരത്തി

  ന്യൂദല്‍ഹി: ഹോളി ആഘോഷത്തിനിടെയുണ്ടായ സംഘര്‍ഷത്തില്‍ ഹിന്ദു യുവാവ് കൊല്ലപ്പെട്ട സംഭവത്തില്‍...

2026 നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പ് നിര്‍ണായകം; കേരളത്തില്‍ എല്‍.ഡി.എഫ് വീണ്ടും അധികാരത്തില്‍ വരും: ഡി. രാജ

ചെന്നൈ: കേരളത്തില്‍ മൂന്നാം തവണയും എല്‍.ഡി.എഫ് അധികാരത്തില്‍ വരുമെന്ന് സി.പി.ഐ ജനറല്‍...

"உயிருடன் இருந்தால் விடமாட்டோம்" – நெதன்யாகுவுக்கு ஈரான் இராணுவம் நேரடி கொலை மிரட்டல்!

கடந்த பிப்ரவரி 28 அன்று, அமெரிக்கா மற்றும் இஸ்ரேல் இணைந்து ஈரான்...