15
March, 2026

A News 365Times Venture

15
Sunday
March, 2026

A News 365Times Venture

Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..

Date:

అద్దె కారు తీసుకున్నారు.. లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు.. మధ్యలో ఓ కన్నింగ్ ఐడియా వచ్చింది. అక్కడే కారు రూపు రేఖలు మార్చేశారు. తక్కువ ధరకు కారు విక్రయించేసి డబ్బులు తీసుకుని చెక్కేశారు. ఇక కారు యజమాని అడిగితే.. ట్రిప్‌లోనే ఉన్నామని బురిడీ కొట్టించిన బే’కార్’గాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అద్దెకు తీసుకున్న కారునే అమ్మేసుకున్నారు..
హైదరాబాద్‌లో కొంత మంది కేటుగాళ్లు.. జల్సాలకు అలవాటు పడి.. అద్దెకు తీసుకున్న కారునే అమ్మేసుకున్నారు. అలాంటి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో నల్లకుంట నివాసి రామలింగేశ్వర కారును ఫిబ్రవరి 25న కొంత మంది దుండగులు లాంగ్ డ్రైవ్ పేరుతో అద్దెకు తీసుకున్నారు. తర్వాత మిత్రులంతా కలిసి లాంగ్ డ్రైవ్ కోసం రాజస్థాన్ వెళ్లారు. అలా తీసుకు వెళ్లిన కారు.. చాలా రోజులైనా తిరిగి రాకపోవడంతో కారు యజమానికి డౌట్ కొట్టింది. దీంతో తీసుకు వెళ్లిన వ్యక్తులపై నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగు చూసింది.

Also Read:Sangareddy: బతుకుదెరువు కోసం వలస వచ్చిన భార్యాభర్తలు.. తెల్లవారుజామున దారుణం..

కారును రాజస్థాన్‌కు తీసుకు వెళ్లిన దుండగులు.. అక్కడే ఓ స్క్రాప్ దుకాణంలో ఉన్న మరో పాత కారు నెంబర్ ప్లేటు‌తో పాటు ఫాస్టాగ్ తీసి లాంగ్ డ్రైవ్‌కి తీసుకు వెళ్లిన కారుకు అమర్చారు. అంతే కాదు.. అంతా కరెక్ట్‌గా ఉందనుకున్న తర్వాత రాజస్థాన్‌లోనే కారును అమ్మేశారు. రూ. 2.5 లక్షలకే కారు అమ్ముకున్నారు. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బాబానగర్, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మహీంద్రా XUV కారుతోపాటు 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಗೂಡ್ಸ್ ರೈಲು ಡಿಕ್ಕಿ : ಮೂವರು ಯುವಕರು ಸಾವು.

ಮುಂಬೈ,ಮಾರ್ಚ್,14,2026 (www.justkannada.in):  ಗೂಡ್ಸ್ ರೈಲು ರೈಲು ಡಿಕ್ಕಿಯಾಗಿ ಮೂವರು ಯುವಕರು...

ഏത് വിധേനെയും ഹോര്‍മുസ് തുറക്കും; ചൈനയും യു.കെയും ഉള്‍പ്പടെയുള്ള രാജ്യങ്ങള്‍ യുദ്ധക്കപ്പലുകള്‍ അയക്കുമെന്ന് ട്രംപ്

വാഷിങ്ടണ്‍: ഇറാന്റെ നിയന്ത്രണത്തിലുള്ള ഹോര്‍മുസ് കടലിടുക്ക് തുറക്കാന്‍ ഏത് മാര്‍ഗവും സ്വീകരിക്കുമെന്ന്...

இறுதியான என்.ஆர் – பாஜக கூட்டணி; தவெக-வுக்கு வலை வீசும் ரங்கசாமி! – புதுவையில் விசிலடிப்பாரா விஜய்?

புதுச்சேரி, தமிழகம் உட்பட ஐந்து மாநில சட்டப்பேரவை தேர்தலுக்கான அறிவிப்பு இன்றே...