14
March, 2026

A News 365Times Venture

14
Saturday
March, 2026

A News 365Times Venture

Milk Purity: మీరు తాగే పాలు అసలైనవేనా? కల్తీ పాలను గుర్తించే 5 సింపుల్ పద్ధతులు ఇవే!

Date:

Milk Purity: చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అవసరమైన విటమిన్ డి, బి12 వంటి కీలక పోషకాలు పాలలో పుష్కలంగా ఉంటాయి. అయితే, ఇటీవల కాలంలో పాలు, పాల ఉత్పత్తుల కల్తీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం నీటినే కాకుండా.. డిటర్జెంట్లు, యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను పాలల్లో కలుపుతున్నారు. ఇవి మీ కుటుంబ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే మీరు కొనుగోలు చేసిన పాలు స్వచ్ఛమైనవో కాదో ఇంట్లోనే ఈ 5 సింపుల్ పద్ధతుల్లో తెలుసుకోండి.

READ ALSO: Hyderabad: పాతబస్తీలో అదృశ్యమైన యువకుడు.. బావిలో కుళ్లిపోయి ఇలా.. ఏం జరిగిందంటే..

1. ఫ్లో టెస్ట్
పాలల్లో నీటి కల్తీని గుర్తించడానికి ఇది అత్యంత సులభమైన మార్గం అని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్ధతిలో పాలను ఎలా టెస్ట్ చేయాలంటే.. ఒక మెరుగుపెట్టిన ప్లేట్ లేదా ఏటవాలుగా ఉన్న ఉపరితలంపై ఒక చుక్క పాలను వేయండి. ఆ ప్లేట్‌పై పాలు నెమ్మదిగా ప్రవహిస్తూ, వెనుక తెల్లటి గీతలాంటి జాడను వదిలివేస్తే అవి స్వచ్ఛమైనవి. ఒకవేళ ఆ చుక్క వేగంగా కిందకు ప్రవహించి, ఎలాంటి గుర్తులు వదలకుంటే అందులో నీరు కలిపినట్లు అర్థం.

2. అయోడిన్ పరీక్ష
పాలలో పిండి పదార్థాలు కలిపారో లేదో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పద్ధతిలో ఎలా పరీక్ష చేయాలంటే.. పాలను వేడి చేసి, అది గోరువెచ్చగా ఉన్నప్పుడు కొన్ని చుక్కల అయోడిన్ టింక్చర్ వేయండి. అప్పుడు పాలు నీలం లేదా నలుపు రంగులోకి మారితే అది కల్తీ జరిగినట్లు సంకేతం. స్వచ్ఛమైన పాలు రంగు మారవు.

3. బాటిల్ షేక్ టెస్ట్
పాలు తెల్లగా, చిక్కగా కనిపించడానికి డిటర్జెంట్లు వాడుతుంటారు. బాటిల్ షేక్ టెస్ట్ ఎలా చేయాలంటే.. ఒక గాజు సీసాలో కొంచెం పాలు పోసి గట్టిగా షేక్ చేయండి. అప్పుడు పాలలో అధిక మొత్తంలో నురుగు వచ్చి, అది ఎక్కువ సేపు అలాగే ఉంటే అందులో డిటర్జెంట్ కలిపారని అర్థం.

4. పప్పు పొడితో పరీక్ష
కొంచెం పాలలో సోయాబీన్ లేదా కంది పప్పు పొడిని కలిపి, అందులో ఎర్రటి లిట్మస్ కాగితాన్ని ముంచండి. అప్పుడు ఎర్ర లిట్మస్ కాగితం నీలం రంగులోకి మారితే ఆ పాలలో యూరియా లేదా ఇతర రసాయనాలు ఉన్నాయని అర్థం.

ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ప్యాకెట్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్యాకేజింగ్‌ను జాగ్రత్తగా గమనించాలి. వీలైనంత వరకు నమ్మకమైన వాళ్ల నుంచి పాలను కొనుగోలు చేయడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. కల్తీ పాలు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, కాబట్టి పైన పేర్కొన్న పరీక్షల ద్వారా మీరు కొనుగోలు చేసిన పాలు స్వచ్ఛమైనవా లేదా జాగ్రత్త పరీక్షించండి.

READ ALSO: viral video: ఏం పని ఆంటీ ఇది? వైరల్ వీడియో చూశారా!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕೆಂಪೇಗೌಡ ವೃತ್ತ (ಮಣಿಪಾಲ್ ಜಂಕ್ಷನ್) ಕಾಮಗಾರಿಗಳ ಪರಿಶೀಲಿಸಿದ ಸಂಸದ ಯದುವೀರ್

 ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,14,2026 (www.justkannada.in): ಮೈಸೂರು–ಕೊಡಗು ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಸಂಸದ  ಯದುವೀರ್ ಕೃಷ್ಣದತ್ತ...

നെതര്‍ലാന്‍ഡ്‌സിലെ സിനഗോഗ് തീവെപ്പിന് പിന്നാലെ ജൂത സ്‌കൂളില്‍ സ്‌ഫോടനം; ഭീരുത്വമെന്ന് ആംസ്റ്റര്‍ഡാം മേയര്‍

ആംസ്റ്റര്‍ഡാം: ആംസ്റ്റര്‍ഡാമിലെ ജൂത സ്‌കൂളില്‍ സ്‌ഫോടനം. ശനിയാഴ്ച രാവിലെയാണ് സ്‌ഫോടനമുണ്ടായതെന്ന് റോയിട്ടേഴ്‌സ്...

“கூட்டணிக்காக நாங்கள் யாரையும் எதிர்பார்த்து இல்லை" – அண்ணாமலை அதிரடி

கோவையில் பாஜக முன்னாள் மாநில தலைவர் அண்ணாமலை செய்தியாளர்களைச் சந்தித்தார். அப்போது அவர்...

4,824 ಕೋಟಿ ರೂ. ಮೊತ್ತದ ಬಂಡವಾಳ ಹೂಡಿಕೆಗೆ ಸಮ್ಮತಿ: ಸಚಿವ ಎಂ. ಬಿ. ಪಾಟೀಲ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,14,2026 (www.justkannada.in): ವಿಜಯಪುರ, ಬಾಗಲಕೋಟೆ, ಚಿತ್ರದುರ್ಗ, ಕೋಲಾರ, ರಾಮನಗರ ಸೇರಿದಂತೆ ...