13
March, 2026

A News 365Times Venture

13
Friday
March, 2026

A News 365Times Venture

IndiGo: ఇరాన్ వార్ ఎఫెక్ట్.. పెరిగిన ఇండిగో టికెట్ ధరలు..

Date:

IndiGo: మధ్యప్రాచ్యంలోని ఇరాన్ యుద్ధ ప్రభావం దేశ విమానయాన రంగంపై పడింది. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో, టికెట్లపై ‘‘ఫ్యూయల్ సర్‌చార్జ్’’ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు మార్చి 14 అర్థరాత్రి 12 నుంచి అమలులోకి వస్తాయని సంస్థ తెలిపింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీని వల్ల విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తన టికెట్లపై అదనపు ఫ్యూయర్ సర్‌ఛార్జ్ విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ విడుదల చేసిన జెట్ ఫ్యూయల్ మానిటర్ ప్రకారం.. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో విమాన ఇంధన ధరలు 85 శాతం కన్నా ఎక్కువ పెరిగాయి. విమానయాన సంస్థల మొత్తం వ్యయాల్లో ఏటీఎఫ్ భాగమే ఎక్కువ కావడంతో, ఈ పెరుగుదల కంపెనీలపై పెను భారాన్ని చూపుతుంది. ప్రస్తుతం, ఇండిగో టికెట్‌ పై ప్రతీ ప్రయాణికుడు అదనపు ఫ్యూయల్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.

Read Also: Fuel Gases: LPG, CNG, PNG మధ్య తేడాలు ఏంటి.. వీటిని ఏ విధంగా ఉపయోగిస్తారు..?

కొత్త బుకింగ్స్‌పై ప్రతీ ప్రయాణికుడు సెక్టార్ల వారీగా అదనపు ఫ్యూయల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. భారత్‌లో దేశీయ విమానాలకు రూ. 425, ఇండిన్ సబ్ కాంటినెంట్ రూ. 425, మిడిల్ ఈస్ట్ రూ. 900, దక్షిణాసియా మరియు చైనా రూ. 1800, ఆఫ్రికా మరియు వెస్ట్ ఆసియా రూ. 1800, యూరప్ రూ. 2300 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇంధన ధరల పెరుగుదల వల్ల టికెట్ ధరలను భారీగా పెంచాల్సి వస్తుందని, అయితే ప్రయాణికులపై అధిక భారం పడకుండా తక్కువ మొత్తంలోనే ఫ్యూయల్ సర్‌చార్జ్ విధించామని ఇండిగో తెలిపింది. అదనపు ఛార్జీల వల్ల ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతూ.. ప్రస్తుత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకున్నామని, భవిష్యత్తులో పరిస్థితులను బట్టి మార్పులు చేస్తామని సంస్థ ప్రకటించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಭೀಕರ ಅಪಘಾತದಲ್ಲಿ ಮೂವರು ಸಾವು.

ಮಂಗಳೂರು, ಮಾರ್ಚ್,13,2026 (www.justkannada.in): ಕೆಎಸ್ ಆರ್ ಟಿಸಿ ರಾಜಹಂಸ ಬಸ್...

ഗസയിലെ വംശഹത്യ; ഐ.സി.ജെയിലെ കേസില്‍ കക്ഷി ചേര്‍ന്ന് നെതര്‍ലാന്‍ഡ്‌സും ഐസ്‌ലാന്‍ഡും

ഹേഗ്: ഗസയില്‍ ഇസ്രഈല്‍ നടത്തുന്ന വംശഹത്യ സംബന്ധിച്ച് ഹേഗിലെ അന്താരാഷ്ട്ര നീതിന്യായ...

ராஜீவ் காந்தி பதவிக்கு வேட்டு! – `டெண்டர் முதல் இன்ஸ்டா வரை…' – வெடித்துக் கிளம்பிய விவகாரம்!

தி.மு.க வின் மாணவர் அணிச் செயலாளராகச் செயல்பட்டு வந்த ராஜீவ் காந்தியை...

ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆ ಹಿಂಪಡೆಯಿರಿ ಎಂದು ಬಿಜೆಪಿ ನಿರ್ಣಯ ಮಂಡಿಸಲಿ- ಡಿಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ಸವಾಲು

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,13,2026 (www.justkannada.in): ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಗಳನ್ನು ಮರುಪರಿಶೀಲನೆ ಮಾಡಿ ಅಥವಾ ಹಿಂಪಡೆಯಿರಿ...