13
March, 2026

A News 365Times Venture

13
Friday
March, 2026

A News 365Times Venture

Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

Date:

Nethi Bobbatlu Recipe: పండుగ వచ్చిందంటే చాలు.. ఇళ్లలో పిండివంటల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా పండుగ సమయాలలో గుర్తొచ్చేది ‘నేతి బొబ్బట్లు’ ఒకటి. అయితే చాలామంది బొబ్బట్లు చేయాలంటే పప్పు నానబెట్టాలి, పిండి నానబెట్టాలి అని గంటల కొద్దీ సమయం కేటాయిస్తుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో చేస్తే అప్పటికప్పుడు చాలా తక్కువ సమయం, శ్రమతో అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో మెత్తటి బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:
పిండి కోసం:
* గోధుమపిండి (1 గ్లాసు),
* మైదా పిండి (1 గ్లాసు),
* ఉప్పు (రుచికి సరిపడా),
* పసుపు (పావు టీస్పూన్),
* నెయ్యి,
* నూనె.

Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

పూర్ణం కోసం:
* శనగపప్పు (1.5 గ్లాసు),
* బెల్లం తురుము (2 గ్లాసులు),
* సోంపు (అర టీస్పూన్),
* యాలకులు (4-5),
* ఎండు కొబ్బరి ముక్కలు (కొద్దిగా),
* నెయ్యి.

తయారీ విధానం:
* పిండిని కలుపుకోవడం:
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి, మైదా పిండి తీసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని మరీ గట్టిగా కాకుండా, కాస్త స్టిక్కీగా (జిగురుగా) కలుపుకోవాలి. చివరగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పిండిని బాగా మర్దన చేసి మూత పెట్టి పక్కన ఉంచండి.

* ఇన్స్టంట్ పూర్ణం తయారీ:
పప్పు నానబెట్టే పని లేకుండా శనగపప్పును శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో వేయండి. ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసుల చొప్పున (1.5 గ్లాసుల పప్పుకి 3 గ్లాసుల నీళ్లు) నీళ్లు పోయాలి. అందులో కొంచెం ఉప్పు, నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్ మీద 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

* ఫ్లేవర్ కోసం స్పెషల్ పౌడర్:
పప్పు ఉడికేలోపు మిక్సీ జార్‌లో సోంపు, యాలకులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇది బొబ్బట్లకు మంచి రుచిని, సువాసనను ఇస్తుంది.

* పూర్ణం ఉడికించడం:
ఉడికిన పప్పులోని నీటిని పూర్తిగా వడకట్టేయాలి. చల్లారిన తర్వాత పప్పును మెత్తగా గ్రైండ్ చేసి ఒక కడాయిలోకి తీసుకోవాలి. అందులో రెండు గ్లాసుల బెల్లం తురుము వేసి చిన్న మంట మీద ఉడికించాలి. బెల్లం కరిగి మిశ్రమం దగ్గరపడుతున్నప్పుడు, ముందుగా సిద్ధం చేసుకున్న సోంపు పొడి, కొంచెం నెయ్యి వేసి కలపాలి. మిశ్రమం పాన్ నుండి వేరుపడుతున్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.

Sugar Control : ఇలా వేయించిన శనగపప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్, షుగర్ కు చెక్

* బొబ్బట్లు ఒత్తుకోవడం:
చల్లారిన పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమంలోంచి కొద్దిగా పిండి తీసుకుని, అందులో పూర్ణం ఉండను పెట్టి క్లోజ్ చేయాలి. బట్టర్ పేపర్ లేదా కవర్ మీద నెయ్యి రాసి, చేత్తో గానీ లేదా చపాతీ కర్రతో గానీ పల్చగా ఒత్తుకోవాలి.

* నెయ్యితో కాల్చుకోవడం:
పెన్నం వేడి చేసి, మీడియం ఫ్లేమ్ మీద బొబ్బట్టును వేసి రెండు వైపులా నెయ్యి అప్లై చేస్తూ ఎర్రగా కాల్చుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన, మెత్తటి నేతి బొబ్బట్లు సిద్ధం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಅಡಿಕೆ ಕಳ್ಳತನ ಮಾಡಿದ್ದ ಮೂವರು ಕಳ್ಳರು ಅಂದರ್

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,12,2026 (www.justkannada.in): ಸುಮಾರು 15 ಕ್ವಿಂಟಾಲ್ ನಷ್ಟು ಅಡಿಕೆಯನ್ನು ಕಳ್ಳತನ...

ഞെട്ടിപ്പിക്കുന്ന സംഭവം, ഉടന്‍ സമഗ്രമായ അന്വേഷണം നടത്തണം; ഫാറൂഖ് അബ്ദുല്ലക്ക് നേരെയുണ്ടായ വധശ്രമത്തില്‍ എം.എ. ബേബി

ന്യൂദല്‍ഹി: ജമ്മു കശ്മീര്‍ മുന്‍ മുഖ്യമന്ത്രി ഫാറൂഖ് അബ്ദുല്ലക്ക് നേരെയുണ്ടായ വധശ്രമം...

'6 தொகுதிகள் கொடுத்தே ஆகணும்' – கறார் காட்டும் கம்யூனிஸ்டுகள்; கைவிரித்த திமுக!

கம்யூனிஸ்ட் கட்சிகளுடனான தி.மு.க-வின் தொகுதி பங்கீட்டு பேச்சுவார்த்தையில் தொடர் இழுபறி நீடிக்கிறது....

ಡ್ಯಾಂಗಳ ಹಳೇ ಗೇಟು ಬದಲಾವಣೆಗೆ ಸರ್ಕಾರ ಸಿದ್ದ- ಡಿಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,12,2026 (www.justkannada.in): ಡ್ಯಾಂಗಳ ಹಳೇ ಗೇಟು ಬದಲಾವಣೆಗೆ ಸರ್ಕಾರ ಸಿದ್ದವಿದೆ...