12
March, 2026

A News 365Times Venture

12
Thursday
March, 2026

A News 365Times Venture

Interest Rates Hike: ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి బిగ్‌షాక్..పెరగనున్న వడ్డీ రేట్లు..

Date:

సొంత ఇల్లు కట్టుకోవాలన్నా లేదా వ్యాపారాన్ని విస్తరించాలన్నా చాలామంది బ్యాంక్ రుణాలపైనే ఆధారపడతారు. అయితే… రంగ సంస్థ అయిన కెనరా బ్యాంక్ తాజాగా తన రుణగ్రహీతలకు ఒక ముఖ్యమైన వార్తను అందించింది. ఎంపిక చేసిన కొన్ని రుణాల కాలపరిమితిపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. దీనివల్ల రాబోయే రోజుల్లో లోన్ తీసుకునే వారికి లేదా ఇప్పటికే లోన్ తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐ (EMI) భారం పెరిగే అవకాశం ఉంది.

Also Read:Richest People: కుబేరుల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్.. మొదటి స్థానంలో ఎలాన్ మస్క్.. ఇండియా నుంచి ఎవరంటే..

వడ్డీ రేట్ల పెంపు వివరాలు…
కెనరా బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (MCLR) ను 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త రేట్లు ఈ గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారం ప్రకారం మార్పులు ఇలా ఉన్నాయి. గతంలో 8.85 శాతంగా ఉన్న వడ్డీ రేటు ఇప్పుడు 8.95 శాతానికి పెరిగింది. మూడేళ్ల కాలానికి సంబంధించి ఎంసీఎల్ఆర్‌ 8.90 శాతం నుంచి ఇప్పుడు 9 శాతానికి చేరింది. బ్యాంక్ మొత్తం లోన్లలో దాదాపు సగం వాటా ఈ MCLR రేట్లతోనే ముడిపడి ఉంది. గత ఏడాది డిసెంబర్ నాటికి ఈ బ్యాంక్ మొత్తం లోన్ల విలువ రూ. 11.92 లక్షల కోట్లుగా ఉంది.

Also Read:ACB Raids: అవినీతి వలలో చిక్కిన తహసీల్దార్.. సోదాల్లో కళ్లు చెదిరే డబ్బులు..

ఒకవైపు కెనరా బ్యాంక్ రేట్లను పెంచుతుంటే.. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా, యూకో బ్యాంక్ (UCO Bank)  తమ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని ప్రకటించాయి. అయితే.. యూకో బ్యాంక్ ట్రెజరీ బిల్లులతో ముడిపడి ఉన్న బెంచ్‌మార్క్ రేట్లను మూడు , ఆరు నెలల కాలపరిమితికి 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఏడాది కాలపరిమితి రేట్లలో మాత్రం మార్పు చేయలేదు. సాధారణంగా బ్యాంకులు తమ నిధుల సమీకరణ ఖర్చు పెరిగినప్పుడు ఇలా వడ్డీ రేట్లను పెంచుతుంటాయి. దీని ప్రభావం కొత్తగా లోన్ తీసుకునే వారిపై నేరుగా పడుతుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಒಳಮೀಸಲಾತಿ ಜಾರಿಗೆ ಬದ್ದ: ಒತ್ತಡ ಹಾಕುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ-ಗೃಹ ಸಚಿವ ಪರಮೇಶ್ವರ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,11,2026 (www.justkannada.in): ಒಳ ಮೀಸಲಾತಿ ಗೊಂದಲದಿಂದಾಗಿ ನೇಮಕಾತಿಗಳಿಗೆ ತಡೆ ಬಿದ್ದಿದ್ದು...

ബത്തേരിയിലെ ശുചീകരണ തൊഴിലാളികളെ പിരിച്ചുവിടാന്‍ യു.ഡി.എഫ് ഭരണസമിതി; പ്രതിഷേധം

ബത്തേരി: സുല്‍ത്താന്‍ ബത്തേരിയിലെ ശുചീകരണ തൊഴിലാളികളെ പിരിച്ചുവിടാന്‍ യു.ഡി.എഫ് ഭരണസമിതിയുടെ നീക്കം....

`மக்கள் திமுக அரசை தூக்கி எறிய விரும்புகிறார்கள்; NDA மட்டுமே…' – திருச்சியில் பிரதமர் மோடி உரை

தமிழ்நாடு சட்டமன்றத் தேர்தலுக்கான களம் பரபரக்கிறது. தொடர்ந்து முக்கிய அரசியல் கட்சித்...

ರಾಹುಲ್ ಗಾಂಧಿಗೆ ದೇಶದ ಅಭಿವೃದ್ದಿ ಬಗ್ಗೆ ಅರಿವಿಲ್ಲ- ಪ್ರಧಾನಿ ಮೋದಿ ಟೀಕೆ

ಕೊಚ್ಚಿ,ಮಾರ್ಚ್,11,2026 (www.justkannada.in): ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರಿಗೆ ‘ದೇಶದಲ್ಲಿ...