7
March, 2026

A News 365Times Venture

7
Saturday
March, 2026

A News 365Times Venture

Nepal Elections: నేపాల్ ఎన్నికల్లో బాలెన్ షా చేతిలో “భారత వ్యతిరేకి” ఘోర ఓటమి..

Date:

Nepal Elections: ‘‘జెన్ Z’’ ఉద్యమం తర్వాత నేపాల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP) ప్రధానమంత్రి అభ్యర్థి బాలెన్ షా ఘన విజయం సాధించారు. నేపాల్ కాబోయే ప్రధానిగా బాలెన్ షా ఉన్నారు. నేపాల్ యువతలో క్రేజ్ కలిగిన ఈ మాజీ రాపర్, సింగర్ ఇప్పుడు నేపాల్ దశాదిశను నిర్ణయించబోతున్నారు. ఝాపా జిల్లాలోని 5వ నియోజకవర్గం నుంచి బాలెన్ షా విజయం సాధించారు. నేపాల్ మాజీ ప్రధాని, జెన్ జీ యువత ఉద్యమం తర్వాత నేపాల్ ప్రధానిగా రాజీనామా చేసిన కేపీ శర్మ ఓలికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయారు. ఏకంగా 50,000 ఓట్ల తేడాతో ఓలిపై బాలెన్ షా గెలిచారు.

Read Also: Amazon: ఫోన్ కావాలా? టీవీ కావాలా?.. అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ లో ఎలక్ట్రానిక్స్ పై 65% తగ్గింపు

తుది ఓట్ల ఫలితాల ప్రకారం, బాలెన్ షా మొత్తం 68,348 ఓట్లు సాధించగా, కె.పి. శర్మ ఓలి ఈ నియోజకవర్గంలో దాదాపు 18,000 ఓట్లు సాధించారు. అందువల్ల, ఇద్దరు అభ్యర్థుల మధ్య దాదాపు 50,000 ఓట్ల తేడా ఉంది. ఓలి భారత్ వ్యతిరేకిగా పేరుంది. తన పాలనలో చైనాకు అనుకూలంగా వ్యవహరించారు. భారత్‌తో సంబంధాలు దెబ్బతినేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు అయోధ్యలో పుట్టలేదని కామెంట్స్ చేశారు. ఇక భారత్‌లో అంతర్భాగంగా ఉన్న లింపియాధురా, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవే అని చెప్పుకున్నారు.

275 మంది సభ్యులున్న పార్లమెంటులో ప్రత్యక్షంగా ఎన్నికైన 165 స్థానాల్లో RSP 117 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో బాలెన్ షా ప్రధాని కావడం ఖాయంగా కనిపిస్తోంది. నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను నేపాల్ ప్రజలు అస్సలు పట్టించుకోలేదు. ఆర్ఎస్పీ తర్వాత రెండో స్థానంలో నేపాల్ కాంగ్రెస్ 15 సీట్లతో ఉంది. ఓలీ పార్టీ 10 లోపు స్థానాలకే పరిమితమై ఘోర ఓటమి దిశగా వెళ్తోంది. నేపాల్ ప్రజాస్వామ్య చరిత్రలో 36 ఏళ్ల లో మొదటిసారిగా ఒక పార్టీకి నేపాల్ ప్రజలు పూర్తిస్థాయి మెజారిటీ కట్టబెట్టారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಇರಾನ್-ಇಸ್ರೇಲ್ ಸಂಘರ್ಷ: ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಅಡುಗೆ ಎಣ್ಣೆ ದರ ಏರಿಕೆ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,7,2026 (www.justkannada.in):  ಇರಾನ್ ಮೇಲೆ ಇಸ್ರೇಲ್,  ಅಮೆರಿಕಾ ಮತ್ತು ದಾಳಿ...

ഇന്ത്യക്കാര്‍ നല്ല അഭിനേതാക്കള്‍; റഷ്യയുടെ എണ്ണ വാങ്ങാന്‍ അനുമതി നല്‍കിയതിനോട് പ്രതികരിച്ച് ട്രംപിന്റെ അനുയായി

വാഷിങ്ടണ്‍:  റഷ്യയുടെ എണ്ണ വാങ്ങാന്‍ ഇന്ത്യയ്ക്ക് താത്കാലിക അനുമതി നല്‍കിയതിന് പിന്നാലെ...

'பச்சைத் தமிழர் பன்னீர்செல்வம், எம்ஜிஆர் வளர்த்த கழகம், அதிமுகவின் அடிமைச் சேவகம்' – ஸ்டாலின் பேச்சு

கடந்த பிப்ரவரி 27-ம் தேதி, முன்னாள் முதல்வர் ஓ. பன்னீர்செல்வம் திமுகவில்...

LPG ಸಿಲಿಂಡರ್ ದರ ಏರಿಕೆ: ನೆಲಕ್ಕೆ ಬಿದ್ದವನಿಗೆ ಒದ್ದಂತಾಗಿದೆ-ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಕಿಡಿ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,7,2026 (www.justkannada.in): ಭಾರತದ ಬಡ ಮತ್ತು ಮಧ್ಯಮ ವರ್ಗದ ಕುಟುಂಬಗಳು...