6
March, 2026

A News 365Times Venture

6
Friday
March, 2026

A News 365Times Venture

CM Chandrababu: సూపర్ సిక్స్ అమలు చేశాం.. కేంద్ర పథకాలను పునరుద్ధరించాం.!

Date:

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు పలు అంశాలపై కీలక ప్రసంగించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఆ రోజు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పాం. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నాం అని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఇంకా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రం గతంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నదని.. సుమారు రూ.9.72 లక్షల కోట్ల అప్పు భారం కారణంగా ప్రభుత్వ వ్యవస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని చెప్పారు. కేంద్ర సహకారంతో ప్రస్తుతం పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. గతంలో నిలిచిపోయిన కేంద్ర పథకాలను తిరిగి ప్రారంభించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు.

అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!

జల్ జీవన్ మిషన్ (JJM) అమలుపై కూడా సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రానికి ఈ పథకం కింద రూ.85 వేల కోట్ల అవసరం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం కేవలం రూ.27 వేల కోట్లకే ప్రణాళిక రూపొందించిందని విమర్శించారు. అంతేకాకుండా అసలు లక్ష్యమైన ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా తాగునీరు అందించే విధానం బదులుగా స్టాండ్‌ అలోన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రాన్ని ఒప్పించి ఈ పథకానికి గడువు పొడిగింపు తెచ్చామని వెల్లడించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో జల్ జీవన్ మిషన్ అమలులో కొత్త విధానాన్ని అనుసరిస్తున్నామని సీఎం తెలిపారు. అన్ని గ్రామాలకు వెంటనే నిరంతర నీటి సరఫరా సాధ్యం కాకపోవడంతో హైబ్రిడ్ మోడల్ ద్వారా ముందుగా ఇంటింటికీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. భవిష్యత్తులో అవకాశమొస్తే వాటిని పూర్తి స్థాయి అష్యూర్డ్ వాటర్ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తామని వివరించారు.

Shiva Rajkumar: పబ్లిక్ ఈవెంట్లలో ‘అసభ్యకర జూమ్’ కల్చర్.. సప్తమి గౌడ పోరాటానికి శివన్న మద్దతు!

ఇంకా.. కేంద్ర పథకాల అమలులో గతంలో ఏర్పడిన సమస్యలను కూడా సీఎం ప్రస్తావించారు. మొత్తం 93 కేంద్ర పథకాలలో 85 పథకాలు నిలిచిపోయిన పరిస్థితి ఉండగా, వాటిని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. గత ఏడాది వాటిని ట్రాక్‌లో పెట్టామని, ఈ సంవత్సరం పూర్తిగా అమలు చేసి అదనపు నిధులు పొందేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకుందని సీఎం విమర్శించారు. ఎంఆర్ఓ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సర్క్యూట్ హౌస్ వంటి ఆస్తులను తాకట్టు పెట్టి 12 – 13 శాతం వడ్డీతో రుణాలు తీసుకున్నారని చెప్పారు. అయితే ప్రస్తుతం కేంద్ర సహకారంతో రుణాలను పునర్వ్యవస్థీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.43,298 కోట్ల రుణాలను రీషెడ్యూల్ చేయించామని, దీని వల్ల సంవత్సరానికి రూ.327 కోట్ల వరకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని సీఎం చెప్పారు. అలాగే మరో రూ.1.20 లక్షల కోట్ల రుణాలను కూడా పునర్వ్యవస్థీకరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇది సాధ్యమైతే రాష్ట్రానికి సంవత్సరానికి రూ.1,658 కోట్ల వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.

AP Assembly: ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్ట్ విషయానికొస్తే.. ఇది ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమైందని సీఎం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయడం వల్లే పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ముందుకు సాగిందని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సమన్వయంగా ముందుకు సాగుతున్నామని సీఎం స్పష్టం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇറാന്‍ പരമാധികാരം മുറുകെ പിടിക്കും; സംഘര്‍ഷത്തിന് തിരികൊളുത്തിയവരോടാണ് സംസാരിക്കേണ്ടത്: മധ്യസ്ഥരോട് പെസസ്‌കിയാന്‍

ടെഹ്‌റാന്‍: ഇറാന്‍-യു.എസ്, ഇസ്രഈല്‍ സംഘര്‍ഷത്തില്‍ മധ്യസ്ഥ ശ്രമങ്ങള്‍ക്കാനായി നിരവധി രാഷ്ട്രങ്ങള്‍ മുന്നോട്ട്...

போர் எதிரொலி: இந்தியாவில் சமையல் எரிவாயு தட்டுப்பாட்டைத் தவிர்க்க மத்திய அரசு நடவடிக்கை!

ஈரான், இஸ்ரேல், அமெரிக்கா இடையேயான போர் சூழல் காரணமாக ஹார்முஸ் ஜலசந்தி...

Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!

మన వంటగదిలో బియ్యం, గోధుమ పిండి ఎప్పుడూ ఉంటాయి కదా.. చపాతీలు,...