3
March, 2026

A News 365Times Venture

3
Tuesday
March, 2026

A News 365Times Venture

Power Demand: తెలంగాణ విద్యుత్ చరిత్రలో నయా రికార్డ్.. 18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్..!

Date:

తెలంగాణ రాష్ట్రం విద్యుత్ వినియోగంలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. 2026, మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 11:01 గంటలకు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 18,139 మెగావాట్ల (MW) గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. వేసవి కాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న తరుణంలో, ఇంతటి భారీ స్థాయిలో విద్యుత్ అవసరం ఏర్పడినప్పటికీ, ఎక్కడా చిన్నపాటి అంతరాయం కూడా లేకుండా సరఫరాను కొనసాగించి రాష్ట్ర విద్యుత్ సంస్థలు (TSTRANSCO & DISCOMs) తమ కార్యదక్షతను చాటుకున్నాయి. గతేడాది మార్చిలో నమోదైన 15,623 మెగావాట్ల రికార్డును, అలాగే గత నెలలో నమోదైన గణాంకాలను ఈ కొత్త రికార్డు వెనక్కి నెట్టేసింది.

HDFC: కస్టమర్లకు బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుండి న్యూ రూల్స్.. లాకర్లు, ATM, UPI రూల్స్ లో మార్పులు..

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగ విస్తరణతో పాటు ఎత్తిపోతల పథకాలు (Lift Irrigation) , వ్యవసాయానికి అందిస్తున్న నిరంతర విద్యుత్ సరఫరా ఈ భారీ డిమాండ్‌కు ప్రధాన కారణాలని అధికారులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా సాగు నీటి అవసరాల కోసం రైతాంగం మోటార్లను పెద్ద ఎత్తున వినియోగిస్తుండటం, పట్టణ ప్రాంతాల్లో ఏసీల వాడకం పెరగడం వంటి అంశాలు విద్యుత్ వినియోగాన్ని గరిష్ట స్థాయికి చేర్చాయి. భౌగోళికంగా చిన్న రాష్ట్రమైనప్పటికీ, విద్యుత్ డిమాండ్ విషయంలో తెలంగాణ ఇప్పుడు రాజస్థాన్ (20,600 MW), మధ్యప్రదేశ్ (19,900 MW) వంటి పెద్ద రాష్ట్రాలతో పోటీ పడుతోంది. పంజాబ్, హర్యానా వంటి పారిశ్రామిక రాష్ట్రాల కంటే తెలంగాణలో డిమాండ్ ఎక్కువగా ఉండటం ఇక్కడి ఆర్థిక పురోగతికి నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ చారిత్రాత్మక ఘనతపై ఉప ముఖ్యమంత్రి , ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయి డిమాండ్‌ను సమర్థవంతంగా హ్యాండిల్ చేసిన ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులను , సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రం ఎంతటి భారీ డిమాండ్‌నైనా తట్టుకునేలా సబ్-స్టేషన్ల పటిష్ఠత, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వంటి ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ డిమాండ్ 19,000 మెగావాట్లను దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, దానికి తగినట్లుగా ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’తో ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.

India Oil Supply: చమురు కొరతను ఖండించిన ప్రభుత్వ వర్గాలు.. బిగ్ రిలీఫ్..!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನಾನು ಕಟ್ಟಿ ಬೆಳೆಸಿದ ಪಕ್ಷ, ಬ್ಲ್ಯಾಕ್ ಮೇಲ್ ಮಾಡಲು ಇಷ್ಟವಿಲ್ಲ- ಡಿಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,3,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ ಅಧಿಕಾರ ಹಂಚಿಕೆ ವಿಚಾರ ಚರ್ಚಿತವಾಗಿದ್ದು,  ಈ...

പെട്രോള്‍, ഡീസല്‍ വില വര്‍ധനവുടനെയുണ്ടാകില്ല; ഇന്ത്യയില്‍ 25 ദിവസത്തേക്കുള്ള കരുതല്‍ എണ്ണ ശേഖരമുണ്ടെന്ന് കേന്ദ്രം

ന്യൂദല്‍ഹി: പശ്ചിമേഷ്യയിലെ സംഘര്‍ഷത്തിന്റെ സാഹചര്യത്തില്‍ എണ്ണ വിലയില്‍ വര്‍ധനവുണ്ടാകില്ലെന്ന് അറിയിച്ച് കേന്ദ്ര...

விவகாரம் புரியாமல் வாழ்த்திய ப.சி; சித்தரஞ்சன் சாலையைச் சுற்றவிட்ட நால்வர்; கதர் சட்டையினரின் ரகளை

திமுக - காங்கிரஸ் கூட்டணியை இழுத்துப் பிடித்து சேர்த்து வைக்க கடைசிக்கட்ட...

ಮನುಷ್ಯನ ಶ್ರೇಷ್ಠತೆಯ ವ್ಯಸನಕ್ಕೆ ತಮ್ಮ ಅನುಭಾವದ ಮೂಲಕ ಮದ್ದು ಅರೆದವರು ಕೈವಾರ ತಾತಯ್ಯ- ಕೆ.ವಿ.ಪ್ರಭಾಕರ್

ಕೋಲಾರ ಮಾರ್ಚ್, 3,2026 (www.justkannada.in):   ಮನುಷ್ಯನ ಶ್ರೇಷ್ಠತೆಯ ವ್ಯಸನಕ್ಕೆ ತಮ್ಮ...