2
March, 2026

A News 365Times Venture

2
Monday
March, 2026

A News 365Times Venture

Hyderabad: కాలేజీలో దారుణం.. బీటెక్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అఘాయిత్యం

Date:

మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు చర్యాలు తీసుకుంటున్నప్పటికీ దారుణాలకు అడ్డుకట్టపడడం లేదు. అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని షీ టీమ్స్, పోలీస్ డిపార్ట్ మెంట్ అవగాహన కల్పిస్తున్నప్పటికీ మాయమాటలకు మోసపోతున్నారు కొందరు యువతులు. తాజాగా బాచుపల్లిలోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. తోటి విద్యార్థినీ పై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

Also Read:Tollywood: బిగ్ డైరెక్టర్స్ బిగ్గెస్ట్ ప్లాన్స్‌

బాధితురాలితో చనువుగా ఉన్న ఆసీస్ అనే విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బాధితురాలు తెలిపింది. ఏడాది నుంచి ఆసీస్ అఘాయిత్యం చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆసీస్ తో పాటు ప్రవీణ్ అనే వ్యక్తి తనపై మిస్ బిహేవ్ చేసినట్లు ఫిర్యాదుల పేర్కొన్నది బాధితురాలు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాచుపల్లి పోలీసులు తెలిపారు. బాధితురాలు బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా ఇరువురు యువకులు సహా-విద్యార్థులుగా సమాచారం.

NTV తో విఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బాధిత విద్యార్ధిని & పేరెంట్స్ మాట్లాడుతూ.. “బాచుపల్లి లో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో 2024 బ్యాచ్ మాది.. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను.. నా పై ఇద్దరు నా క్లాస్ మేట్స్ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆసీస్ అనే స్టూడెంట్ నన్ను ప్రేమ పేరుతో వేధించాడు.. నన్ను భయపెట్టాడు నాతో చనువుగా ఉన్నప్పుడు ఆసీస్ వీడియోస్ ఫొటోస్ తీసి బెదిరించాడు.. నన్ను క్లాస్ రూమ్ లోనే అత్యాచారం చేశాడు.. ఏడాది నుంచి ఆసీస్ అనే స్టూడెంట్ నాపై అత్యాచారం చేశాడు.. ఆసీస్ తో పాటు ప్రవీణ్ అనే స్టూడెంట్ తనపై మిస్ బిహేవ్ చేశారు.. నాకు మత్తు పదార్థం ఇచి ఓయో రూమ్స్ తీసుకువెళ్లి ఆసీస్ అత్యాచారానికి పాల్పడ్డాడు..

నేను స్పృహలో లేనప్పుడు వీడియోస్ ఫొటోస్ తీసి నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు.. నాకు జరిగిన అన్యాయాన్ని పేరెంట్స్ దృష్టికి తెచ్చాను.. మా పేరెంట్స్ కాలేజ్ మేనేజ్మెంట్ ను ప్రశ్నించారు.. కాలేజ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు.. దీంతో బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము.. మేము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నరు బాచుపల్లి పోలీసులు.. ఫిబ్రవరి 28న ఎఫ్ఐఆర్ నమోదయింది.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు.. మాకు న్యాయం జరగాలి” అని బాధితురాలు తన గోడు వెల్లబోసుకుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಇ-ಸ್ವತ್ತು 2.0 ತಂತ್ರಾಂಶದಡಿ ಈವರೆಗೆ 1,14,907 ಅರ್ಜಿಗಳ ಅನುಮೋದನೆ, ವಿಲೇವಾರಿ- ಸಚಿವ ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ

ಬೆಂಗಳೂರು,ಫೆಬ್ರವರಿ,2,2026 (www.justkannada.in): ಇ-ಸ್ವತ್ತು 2.0 ತಂತ್ರಾಂಶದಡಿ ಈವರೆಗೆ ರಾಜ್ಯದಲ್ಲಿ 1,14,907...

നെതന്യാഹുവിന്റെ ഓഫീസില്‍ മിസൈല്‍ ആക്രമണം നടത്തിയെന്ന് ഐ.ആര്‍.ജി.സി

ടെഹ്‌റാന്‍: ഇറാനെതിരായ യു.എസ്-ഇസ്രഈല്‍ ആക്രമണത്തിന് മറുപടിയായി ഇസ്രഈല്‍ പ്രധാനമന്ത്രി ബെഞ്ചമിന്‍ നെതന്യാഹുവിന്റെ...

காங்கிரஸ் கட்சிக்கு `கவுண்டவுன் ஸ்டார்ட்' – கழற்றிவிடும் மூடில் தி.மு.க!

“காங்கிரஸ் கட்சிக்காக காத்திருந்தது போதும். நம் வலிமை வைத்து தேர்தலை சந்திக்கலாம்”...

ಬೇಸಿಗೆ: ಕುಡಿಯುವ ನೀರಿಗೆ ತೊಂದರೆಯಾಗದಂತೆ ಎಚ್ಚರಿಕೆ ವಹಿಸಿ-ಸಚಿವ ಡಾ: ಹೆಚ್.ಸಿ.ಮಹದೇವಪ್ಪ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,2,2026 (www.justkannada.in): ಬೇಸಿಗೆ ಪ್ರಾರಂಭವಾಗುತ್ತಿದ್ದು, ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಕುಡಿಯುವ ನೀರಿಗೆ ತೊಂದರೆಯಾಗದಂತೆ...