India MEA: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాలు ఇరాన్‌లో అల్లకల్లోలం సృష్టించాయి. ఈ దాడుల నేపథ్యంలో అన్ని దేశాలు వరుసగా స్పందించాయి. తాజాగా భారత్ సైతం తమ వైఖరిని వెల్లడించింది. Ministry of External Affairs (MEA) శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని పక్షాలు సహనం పాటించాలని పిలుపునిచ్చింది. “ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలను నివారించాలి. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి” అని ఎమ్‌ఈఏ పేర్కొంది. సమస్యల పరిష్కారానికి సంభాషణ, దౌత్య మార్గాలనే అనుసరించాలని, ప్రతి దేశం సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను గౌరవించాలని స్పష్టం చేసింది.
READ MORE: Stocks India 2026: అదృష్టం అంటే ఇదే.. రూ.8 షేరు.. రూ.2,887 కు జంప్!
ఇదిలా ఉండగా.. మధ్యప్రాచ్యంలో సుమారు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తు్న్నారు. వీరలో అత్యధికంగా యూఏఈలో ఉండగా.. 10 మంది ఇండియన్స్ ఇరాన్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ దాడుల నేపథ్యంలో భారతీయుల రక్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్రిక్తతలు నెలకొన్న దేశాల్లో గల ఇండియన్స్‌పై ఎమ్‌ఈఏ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే అనేక మందికి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, స్థానిక భద్రతా మార్గదర్శకాలను పాటించాలని, ఎప్పటికప్పుడు మిషన్‌లతో సంప్రదింపులో ఉండాలని సూచించినట్లు ఎమ్‌ఈఏ వెల్లడించింది. ప్రస్తుతం గగనతలం మూసివేయబడిన నేపథ్యంలో తక్షణం ఎలాంటి ఎవాక్యువేషన్ ప్రణాళికపై ప్రకటన లేదు.





