27
February, 2026

A News 365Times Venture

27
Friday
February, 2026

A News 365Times Venture

Toxic : రన్ టైం విషయంలో ‘ధురంధర్ 2’ తో పోటీ పడుతున్న ‘టాక్సిక్’..

Date:

కన్నడ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుడు రాకింగ్ స్టార్ యష్ నుంచి వస్తున్న లేటెస్ట్ భారీ ప్రాజెక్ట్ “టాక్సిక్” (Toxic). గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో పక్కా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘ధురంధర్ 2’ వంటి భారీ చిత్రంతో పోటీ పడుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ రన్ టైం ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉండబోతోందని సమాచారం.

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే భారీ చిత్రాలన్నీ సుదీర్ఘమైన రన్ టైంతో ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అదే బాటలో ‘టాక్సిక్’ కూడా నడవబోతోందని టాక్ వినిపిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఏకంగా 3 గంటల 15 నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి రాబోతుందట. గీతూ మోహన్ దాస్ రాసుకున్న కథలోని డెప్త్.. యాక్షన్ సీక్వెన్స్ కారణంగా రన్ టైం ఇంత నిడివి వచ్చినట్లు తెలుస్తోంది.

మొదటి నుంచి ఈ సినిమాను ఒక డార్క్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రమోట్ చేస్తున్నారు. 3 గంటల కంటే ఎక్కువ సమయం యష్‌ను వెండితెరపై చూడటం అంటే ఫ్యాన్స్‌కు పండగే అయినప్పటికీ, అంత నిడివిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ టీజర్ సినిమాపై విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 19న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. రన్ టైం విషయంలో అధికారిక ప్రకటన వస్తే తప్ప క్లారిటీ రాదు, కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮೊದಲ ಬಾರಿಗೆ ಗೆದ್ದವರು ಸಚಿವ ಸ್ಥಾನ ಕೇಳುವುದರಲ್ಲಿ ತಪ್ಪೇನು? ಶಾಸಕ ಹರೀಶ್ ಗೌಡ

ಮೈಸೂರು,ಫೆಬ್ರವರಿ,26,2026 (www.justkannada.in):  ಮೊದಲ ಬಾರಿ ಗೆದ್ದವರು ಸಿಎಂ ಆಗುತ್ತಾರೆ, ಸಚಿವರು...

സിനിമ കേരളത്തെ അപകീര്‍ത്തിപ്പെടുത്തുന്നില്ല; കേരള സ്റ്റോറിയുടെ റിലീസ് തടഞ്ഞ ഉത്തരവിനെതിരെ അപ്പീല്‍

കൊച്ചി: ‘ദി കേരള സ്റ്റോറി’യുടെ റിലീസ് തടഞ്ഞ ഹൈക്കോടതി ഉത്തരവിനെതിരെ നിര്‍മാതാക്കള്‍...

‘ಮೊಬೈಲ್ ಬಿಡಿ, ಪುಸ್ತಕ ಹಿಡಿಯಿರಿ’: ಮಕ್ಕಳಿಗೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣ ನಿಯಂತ್ರಣಕ್ಕೆ ಚಿಂತನೆ- ಸಚಿವ ಮಧು ಬಂಗಾರಪ್ಪ

ಬೆಂಗಳೂರು,ಫೆಬ್ರವರಿ,26,2026 (www.justkannada.in): 16 ವರ್ಷದೊಳಗಿನ ಮಕ್ಕಳಿಗೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳನ್ನು (Social...