Shoaib Akhtar: వరల్డ్ క్రికెట్‌లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన ప్లేయర్ షోయబ్ అక్తర్. ఫాస్ట్ బౌలర్ల యుగంలోనూ షోయబ్ అక్తర్ క్రియేట్ చేసిన రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అయతే 1997లో అంతర్జాతయ ఆరంగ్రేటం చేసిన షోయబ్ అక్తర్, ఎప్పుడూ పాకిస్థాన్ టీమ్‌కి కెప్టెన్సీ చేయలేదు.. పాకిస్థాన్ తరుపున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచులు ఆడిన షోయబ్ అక్తర్, 2003 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 161.3 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఇప్పటికీ ఈ రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు.. అయితే అప్పట్లో క్రికెట్ పోటీలు ఎంత భీకరంగా ఉండేవో పెద్దగా చెప్పనవసరం లేదు.
READ MORE: NtrNeel : డ్రాగన్ లో షర్ట్‌లెస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ భారీ ఫైట్
ప్రపంచంలోనే వేగవంతమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న షోయబ్ అక్తర్ తాజాగా ఒక షాకింగ్ విషయం బయటపెట్టాడు. 1998-99లో భారత్ పర్యటన సమయంలో మోకాళ్ల నొప్పితో బాధపడుతూ మ్యాచ్ ఆడేందుకు తాను, పాక్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ రహస్యంగా మాత్రలు, ఇంజెక్షన్లు తీసుకున్నామని చెప్పాడు. ఆ సమయంలో ఇద్దరి మోకాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ.. మ్యాచ్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇలా చేశామని వెల్లడించాడు. సీనియర్లు తెలుసుకుంటే జట్టులో నుంచి బయటకు పంపించేవాళ్లని తెలిపాడు. ఈ విషయాన్ని ఓ టీవీ డిబెట్‌లో అక్తర్ బట్టబయలు చేశాడు. అయితే.. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయాన్ని అక్తర్ వివరించాడు. నాడు సచిన్ వికెట్‌పై సక్లైన్, అక్తర్ మధ్య బెట్టింగ్ నడిచేదట. సచిన్‌ను ఎవరు ఔట్ చేస్తారన్నదే అంశంలో వారిలో వారే పోటీ పెట్టుకునే వారట. అప్పటి రైవల్రీ ఎంత తీవ్రంగా ఉండేదో ఈ మాటలు ద్వారా అర్థం అవుతుంది. ఒకవైపు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ వంటి బ్యాటర్లు అక్తర్ బౌలింగ్‌ను ఎదుర్కొని ఆధిపత్యం చెలాయించిన సందర్భాలున్నా.. కొన్ని మ్యాచ్‌ల్లో అక్తర్ పైచేయి సాధించాడు. కాగా.. భారత్-పాక్ మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ 2012-13లో జరిగింది. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇప్పుడు ఈ రెండు జట్లు ఐసీసీ, ఆసియా టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. తాజాగా టీ20 వరల్డ్‌కప్ 2026లోనూ భారత్ పాకిస్థాన్‌పై విజయం సాధించింది.
READ MORE: Puri Jagannadh: మరో తమిళ్ స్టార్ హీరోని పట్టేసిన పూరీ





