25
February, 2026

A News 365Times Venture

25
Wednesday
February, 2026

A News 365Times Venture

Anthropic AI: ఈసారి “హెచ్‌ఆర్‌”లకే ఎసరు.. క్లాడ్ ఏఐ కొత్త ఫీచర్లతో ఉద్యోగాలకు ముప్పు?

Date:

Anthropic AI: ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో ఏఐ ప్రముఖ్యత గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా మరో పెద్ద అడుగు వేసింది. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఏఐ (Anthropic) తన క్లౌడ్ ఏఐ (Claude AI) కోసం కొత్త ఎంటర్‌ప్రైజ్‌ ఫీచర్లను ప్రకటించింది. కంపెనీల్లోని వివిధ విభాగాల కోసం ప్రత్యేకంగా ప్లగిన్లు రూపొందించింది. ఈ కొత్త ప్లగిన్లతో మరోసారి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గుండెల్లో గుబులు పెంచింది. ఏకంగా హెచ్ఆర్‌లకే ఎసరుపెట్టింది. ఇందులో హ్యూమన్ రిసోర్సెస్ (Human Resource Management) నుంచి ఫైనాన్స్ వరకు ప్రతి టీమ్‌కు సరిపోయే విధంగా వీటిని తయారు చేయడం సంచలనంగా మారింది. ఇటీవల క్లాడ్‌కు ప్లగిన్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు కుదేలైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరింత శక్తివంతమైన ఎంటర్‌ప్రైజ్ టూల్స్ రావడంతో ఈ ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

READ MORE: Athadu Re-Release: ట్రెండింగ్‌లో ‘అతడు’ మూవీ.. ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు, 24 గంటల్లోనే..!

కొత్త ఫీచర్లతో కంపెనీలు తమ అవసరాలకు తగ్గట్టు కస్టమ్ ప్లగిన్లను సృష్టించుకోవచ్చట. ఇప్పటికే ఉపయోగిస్తున్న టూల్స్‌తోనూ క్లాడ్‌ను నేరుగా కనెక్ట్ చేయవచ్చట. ఉదాహరణకు Google Drive, Gmail, DocuSign, LegalZoom వంటి సర్వీసులతో ఇది పనిచేస్తుంది. అంటే ఒకే ఏఐ ద్వారా డాక్యుమెంట్లు తయారు చేయడం నుంచి అనలిసిస్ వరకు చాలా పనులు ఆటోమేటిక్‌గా పూర్తవుతాయి. డెస్క్‌టాప్ యాప్‌లో ఉన్న “Claude Cowork” ఫీచర్‌తో ఈ ప్లగిన్లు కంప్యూటర్‌లో ఫైళ్లను సృష్టించడం, మార్చడం కూడా చేస్తాయట. ప్రపంచంలోని పెద్ద కంపెనీలతో కలిసి వీటిని అభివృద్ధి చేయడం వల్ల క్లాడ్ ఒక పూర్తి స్థాయి ఏఐ ఏజెంట్‌లా పనిచేస్తుందట. ఈ ప్లగిన్ల సామర్థ్యాలు విస్తృతంగా ఉన్నాయట. ఫైనాన్షియల్ మోడలింగ్, మార్కెట్ రీసెర్చ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ డాక్యుమెంట్లు తయారు చేయడం, ఈక్విటీ రీసెర్చ్ నోట్స్ తయారు చేయడం, ఆపరేషన్స్ రిపోర్ట్స్ రూపొందించడం, హెచ్‌ఆర్‌కు జాబ్ డిస్క్రిప్షన్స్ నుంచి ఆన్‌బోర్డింగ్ మెటీరియల్ వరకు తయారు చేయడం లాంటి అన్నింటినీ ఒకే ఏఐ టూల్ చేస్తుందట. పోర్ట్‌ఫోలియో అనలిసిస్ చేసి ఆస్తుల రీబ్యాలెన్సింగ్ సూచనలు ఇవ్వడం, డిజైన్ టీమ్‌లకు ఫిగ్మా (Figma)తో కలిసి క్రియేటివ్ బ్రీఫ్స్ తయారు చేయడం, ఇంజినీరింగ్ డాక్యుమెంటేషన్‌ను నేరుగా రిపోజిటరీలకు పంపించడం వంటి పనులు సైతం చేయగలదట. ఒక కంపెనీకి ప్రత్యేకమైన బ్రాండ్ వాయిస్‌లోనే కంటెంట్ తయారు చేసే విధంగా ట్రెయిన్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ కొత్త టూల్‌తో వాల్ స్ట్రీట్‌లో ఆందోళనను పెంచుతున్నాయి. క్లాడ్ Cowork ప్రకటించినప్పటి నుంచి Salesforce షేరు సుమారు 22%, Intuit 33%, Snowflake 20% వరకు పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. భవిష్యత్తులో సంప్రదాయ సాఫ్ట్‌వేర్ కంపెనీల అవసరాన్ని ఏఐ తగ్గిస్తుందనే భయం దీనికి కారణంగా కనిపిస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಖಾಲಿ ಹುದ್ದೆಗಳ ಭರ್ತಿಗೆ ಸಿದ್ದ: ಈಗಲೂ 35ರಿಂದ 40 ಸಾವಿರ ಹುದ್ದೆ ಭರ್ತಿಯಾಗಿದೆ ಎಂದ ಸಚಿವ ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ

ಬೆಂಗಳೂರು,ಫೆಬ್ರವರಿ,25,2026 (www.justkannnada.in):  ರಾಜ್ಯ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದು ಮೂರು...

പാക് പ്രധാനമന്ത്രിയെ മരണത്തിൽനിന്ന് രക്ഷിച്ചത് താൻ; വീണ്ടും അവകാശവാദവുമായി ട്രംപ്

വാഷിംങ്ടൺ: ഇന്ത്യ – പാകിസ്ഥാൻ സംഘർഷങ്ങൾ നിയന്ത്രിച്ചത് താനാണെന്നുള്ള അവകാശവാദം വീണ്ടുമുയർത്തി...

ம.நடராஜனின் சகோதரர் மரணம் – கட்சியின் பெயரை வி.கே.சசிகலா அறிவிக்காததற்கு காரணம் இதுவா?

வி.கே. சசிகலாவின் கணவர் மறைந்த ம.நடராஜனின் மூத்த  சகோதரர் ம. சாமிநாதன்...

ಸರ್ಕಾರಿ ಖಾಲಿ ಹುದ್ದೆಗಳ ಭರ್ತಿಗೆ ಆಗ್ರಹಿಸಿ ತೀವ್ರಗೊಂಡ ಹೋರಾಟ: ಬಿಜೆಪಿ ನಾಯಕರು ಸಾಥ್

ಧಾರವಾಡ,ಫೆಬ್ರವರಿ,24,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದಲ್ಲಿ 2.80 ಲಕ್ಷ ಹುದ್ದೆಗಳು ಖಾಲಿ ಇದ್ದರೂ...