23
February, 2026

A News 365Times Venture

23
Monday
February, 2026

A News 365Times Venture

Jasprit Bumrah: బుమ్రా నయా హిస్టరీ.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో టాప్ వికెట్ టేకర్‌గా యార్కర్ కింగ్..

Date:

Jasprit Bumrah: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా vs సౌతాఫ్రికా పోరు కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్ 8 మ్యాచ్‌లో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరో చరిత్ర సృష్టించాడు. బుమ్రా బౌలింగ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేశాడు. మూడు వికెట్లు పడగొట్టి (3/15) అద్భుత గణాంకాలతో మెరిశాడు. టీ20 వరల్డ్‌కప్‌ల చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఇప్పటివరకు 22 ఇన్నింగ్స్‌లలో 33 వికెట్లు సాధించి రవిచంద్రన్ అశ్విన్ (32) రికార్డును అధిగమించాడు. అర్ష్‌దీప్ సింగ్ సైతం 18 ఇన్నింగ్స్‌లలో 32 వికెట్లు తీసి అశ్విన్‌తో సమానంగా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా 29, రవీంద్ర జడేజా 22 వికెట్లతో తరువాతి స్థానాల్లో ఉన్నారు.

READ MORE: IPL 2026: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్? తలా ఫ్యాన్స్‌కు సీఎస్‌కే సీఈఓ ఇచ్చిన షాకింగ్ అప్‌డేట్ ఇదే!

ఈ మ్యాచ్‌లో బుమ్రా క్వింటన్ డికాక్, రియన్ రికెల్టన్, కార్బిన్ బోష్ వికెట్లు తీసి దక్షిణాఫ్రికా దూకుడుకు బ్రేక్ వేశాడు. అయినప్పటికీ.. సుపారీ జట్టు 7 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నరేంద్ర మోడీ లాంటి పెద్ద స్టేడియంలో ఇంత పెద్ద స్కోర్ సాధించడం టీమిండియాకు కష్టంగా మారుతోంది. అయితే.. సౌతాఫ్రికా ఆరంభంలోనే 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలోనే అయితే డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవాల్డ్ బ్రెవిస్ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరు 51 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఈజీగా 200 క్రాస్ అవుతుందని అందరూ భావించారు. కానీ చివరి ఓవర్లలో బుమ్రా (3/15), అర్ష్‌దీప్ సింగ్ (2/28) అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించింది. చివరి నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా స్కోరు కొంత తగ్గింది. అయినప్పటికీ ట్రిస్టన్ స్టబ్స్ (24 బంతుల్లో 44 నాటౌట్) చివరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వరుస సిక్సర్లు బాది జట్టుకు బలమైన ముగింపు ఇచ్చాడు.

READ MORE: India vs South Africa: మిల్లర్ దూకుడు.. బుమ్రా పంజా! సూపర్ 8లో టీమిండియాకు తప్పని అగ్ని పరీక్ష!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇന്ത്യ-യു.എസ് വ്യാപാര കരാര്‍: ചര്‍ച്ച നീട്ടിവെച്ചു; സംഭവവവികാസങ്ങള്‍ വിലയിരുത്തിയ ശേഷം തീയതി പ്രഖ്യാപിക്കുമെന്ന് കേന്ദ്രം

ന്യൂദല്‍ഹി: ഇന്ത്യ-യു.എസ് വ്യാപാര കരാറില്‍ മുഖ്യ നെഗോഷ്യേറ്റര്‍മാരുടെ ചര്‍ച്ച മാറ്റിവെച്ചതായി കേന്ദ്ര...

ഇന്ത്യാ ബ്ലോക്കിന്റെ ചുമതല മമതക്ക് നല്‍കണം: രാഹുല്‍ ഗാന്ധിയോട് മണിശങ്കര്‍ അയ്യര്‍; രാജ്യസഭാ സീറ്റ് മോഹിച്ചാണോയെന്ന് കോണ്‍ഗ്രസ്

ന്യൂദല്‍ഹി: ഇന്ത്യാ ബ്ലോക്കിന്റെ തലപ്പത്ത് വരേണ്ടത് പ്രാദേശിക പാര്‍ട്ടി നേതാക്കളാണെന്ന് കോണ്‍ഗ്രസ്...