20
February, 2026

A News 365Times Venture

20
Friday
February, 2026

A News 365Times Venture

TDP vs YSRCP: శాసన మండలిలో గందరగోళం.. వైసీపీ నేతలకు బుద్ధుందా అంటూ మంత్రి ఫైర్..

Date:

TDP vs YSRCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాసన మండలి సమావేశాలు మరోసారి తీవ్ర గందరగోళం చెలరేగుతుంది. నల్ల కండువాలు, దేవుడి పటాలు, ప్లకార్డులతో అసెంబ్లీకి వైసీపీ సభ్యులు రావడంతో.. అసెంబ్లీ గేటు దగ్గర వైసీపీ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో.. జెండాలు, ప్లకార్డులను వదిలేసి లోపలికి వచ్చారు. ఈ సందర్భంగా గోవిందా.. గోవిందా అనే నినాదాలు చేసుకుంటు అసెంబ్లీకి వైసీపీ సభ్యులు వెళ్లారు. అయితే, ప్రారంభమైన కాసేపటికే శాసన మండలి వాయిదా పడింది.

Read Also: Woman Assaulted: పెళ్లి గురించి చర్చ.. యువతిపై లివ్-ఇన్ పార్ట్నర్ దాడి

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ పెట్టిన వాయిదా తీర్మానంపై చర్చించాలని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. దీంతో వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేయాల్సిందేనని వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చెర్మన్ పోడియం దగ్గరకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఫోటోలతో వైసీపీ సభ్యుల నినాదాలు చేశారు.

Read Also: Iran: ఉద్రిక్తతల వేళ ఇరాన్‌లో కూలిన ఫైటర్ జెట్.. పైలట్ మృతి

దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల తీరుపై ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకన్న స్వామి ఫోటోలతో రాజకీయం చేయడం సిగ్గు చేటని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలకు బుద్ధుందా అంటూ మండిపడ్డారు. దేవుడంటే భయం, గౌరవం లేదని విమర్శించారు. వైసీపీ సభ్యుల ఆందోళన మరింత ఉధృతం కావడంతో మంత్రి పయ్యావుల కేశవ్ హెడ్ ఫోన్స్ ని నేలపై విసిరి కొట్టాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕೂಡಲೇ ಅನಧಿಕೃತ ಫ್ಲೆಕ್ಸ್ ಮತ್ತು ಬ್ಯಾನರ್ ಗಳ ತೆರವಿಗೆ ಮೈಸೂರು ಡಿಸಿ ಆದೇಶ

ಮೈಸೂರು,ಫೆಬ್ರವರಿ,19,2026 (www.justkannada.in): ಮೈಸೂರು ನಗರ ಮತ್ತು ಜಿಲ್ಲಾ ವ್ಯಾಪ್ತಿಯ ಸಾರ್ವಜನಿಕ...

വണ്ടാനം മെഡിക്കല്‍ കോളേജ് സംഭവം; ഡോക്ടറുടെ നിലപാട് തൊഴിലിനോടുള്ള അനാദരവ്: വീണാ ജോര്‍ജ്

തിരുവനന്തപുരം: വണ്ടാനം മെഡിക്കല്‍ കോളേജ് ഹോസ്പിറ്റലില്‍ ശസ്ത്രക്രിയയ്ക്ക് ശേഷം കത്രിക മറന്നുവെച്ചെന്ന...

ಸಾರಿಗೆ ನೌಕರರ ಬೇಡಿಕೆ ನ್ಯಾಯಸಮ್ಮತ: ಹೋರಾಟಕ್ಕೆ ಸಹಮತವಿದೆ-ಸಚಿವ ಸಂತೋಷ್ ಲಾಡ್

ಧಾರವಾಡ,ಫೆಬ್ರವರಿ,19,2026 (www.justkannada.in): ವೇತನ ಹಿಂಬಾಕಿ ಮತ್ತು ವೇತನ ಪರಿಷ್ಕರಣೆಗೆ ಆಗ್ರಹಿಸಿ...