* నేడు ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరుకానున్న సీఎం రేవంత్..
* నేడు కామారెడ్డి జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన.. మాచారెడ్డి మండలం పాల్వంచలో ఆయిల్ ఫాం పంటను పరిశీలించనున్న మంత్రి.. అనంతరం రైతులతో సమావేశం కానున్న మంత్రి తుమ్మల..
* నేడు జిల్లాలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన.. నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు..
* నేడు సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న హరీష్ రావు..
* నేటి నుంచి మూడు రోజుల పాటు కామారెడ్డిలో అశోక్ నగర్ రైల్వే గేటు మూసివేత.. జిల్లా కేంద్రంలోని రైల్వే గేటు దగ్గర తారు రోడ్డు మరమ్మతు పనులు, ఇతర అత్యవసర గేటు పనులు చేస్తుండటంతో గేటు మూసివేత.. ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని రైల్వే శాఖ ప్రకటన..
* నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు..
* నేడు ఉదయం 9 గంటలకు ప్రారంభంగానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్ తో ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్..
* నేడు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న శాసనమండలి సమావేశాలు..
* నేడు మధ్యాహ్నం 12 గంటలకి లక్కీ డీప్ లో మే నెల అర్జిత సేవా టిక్కెట్లు కేటాయింపు.. ఉదయం 10 గంటల వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం..
* నేటి నుంచి మార్చి 5వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణిలోకి భక్తుల అనుమతి నిలిపివేత.. 26వ తేది నుంచి మార్చి 2వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవం కారణంగా టీటీడీ నిర్ణయం..
* నేడు టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో తలపడబోతున్న ఒమన్.. రాత్రి 7 గంటలకు పల్లెకెలె వేదికగా మ్యాచ్..





