18
February, 2026

A News 365Times Venture

18
Wednesday
February, 2026

A News 365Times Venture

Regina Cassandra : బాలీవుడ్ గుట్టు విప్పిన రెజీనా కసాండ్రా!

Date:

తెలుగు ప్రేక్షకులో రెజీనా కసాండ్రా అంటే ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. తన క్యూట్ లుక్స్‌తో, నేచురల్ యాక్టింగ్‌తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. కేవలం సౌత్‌కే పరిమితం కాకుండా బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది. అయితే వెండితెరపై మెరిసే బాలీవుడ్ రంగుల ప్రపంచం వెనుక ఉన్న మరో కోణాన్ని రెజీనా తాజాగా బయటపెట్టింది. హిందీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి.

Also Read : Chiranjeevi : సురేఖే నా సర్వస్వం.. 44 ఏళ్ల బంధంపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!

రెజీనా మాట్లాడుతూ.. ‘ 2019లో ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చా. హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో అక్కడి వారు నను ఒక నటిగా కంటే ‘సౌత్ నుంచి వచ్చిన అమ్మాయి’గానే చూశారు. సాధారణంగా మన సౌత్ హీరోయిన్లకు హిందీ రాదనే ఒక అపోహ వారిలో ఉంటుంది. కానీ నాకు హిందీ చదవడం, రాయడం, మాట్లాడటం అన్నీ వచ్చు. నా సినిమాలకు నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నా సరే.. అక్కడ కొందరు మాత్రం ‘బయటి వ్యక్తి’లాగే ట్రీట్ చేశారు. కేవలం మాటలతోనే కాదు, ప్రవర్తనలో కూడా నను చిన్నచూపు చూసిన సందర్భాలు ఉన్నాయి. సౌత్ నుంచి వచ్చాననే కారణంతో అవమానకరంగా ప్రవర్తించారు, అది నాను ఎంతో బాధించింది. కానీ అందరూ అలాగే ఉండరు, కొంతమంది దర్శకులు, నటులు ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటారు. వారి వల్లే నేను ఆ కష్టమైన దశను దాటగలిగా’ అని తెలిపింది రెజీనా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి చర్చకు దారితీశాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಪಿಸಿಒಡಿ ಸಮಸ್ಯೆ ಬಗ್ಗೆ ಎಚ್ಚರದಿಂದಿರಿ- ಡಾ. ತೇಜಸ್ವಿನಿ ಸಲಹೆ

ಮೈಸೂರು, ಫೆಬ್ರವರಿ, 17, 2026 (www.justkannada.in): ಹೆಣ್ಣುಮಕ್ಕಳಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುವ ಪಿಸಿಒಡಿ...

സ്വകാര്യ സ്ഥലത്ത് നിസ്‌കരിച്ചവരെ കസ്റ്റഡിയിലെടുത്തു: ബറേലി എസ്.പിക്ക് അലഹബാദ് ഹൈക്കോടതിയുടെ കോടതിയലക്ഷ്യ നോട്ടീസ്

ലഖ്‌നൗ: സ്വകാര്യസ്ഥലങ്ങളില്‍ പ്രാര്‍ത്ഥനായോഗങ്ങള്‍ സംഘടിപ്പിക്കുന്നതിന് അനുമതി ആവശ്യമില്ലെന്ന കോടതി ഉത്തരവ് ലംഘിച്ച...

"அந்த போன்கால் வரட்டும்!" – காத்திருக்கும் அறிவாலயம்

நேற்று பிப்.17-ம் தேதி, தமிழ்நாடு காங்கிரஸ் கமிட்டியின் மாவட்டத் தலைவர்கள் கூட்டம்...

ಮಾಧ್ಯಮಗಳಿಗೆ ಕಡಿವಾಣ?  ಸರ್ಕಾರದ ವಿರುದ್ದ ಬಿಜೆಪಿ ನಾಯಕರಿಂದ ಕಿಡಿ

ಬೆಂಗಳೂರು,ಫೆಬ್ರವರಿ,18,2026 (www.justkannada.in): ವಿಧಾನಸೌಧದಲ್ಲಿ ಮಾಧ್ಯಮಗಳಿಗೆ ಬೈಟ್ ತೆಗೆದುಕೊಳ್ಳಲು ಸ್ಥಳ ನಿಗದಿ...