15
February, 2026

A News 365Times Venture

15
Sunday
February, 2026

A News 365Times Venture

IND vs PAK: పాకిస్తాన్ పై ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్.. యువరాజ్ సింగ్‌ రికార్డ్ బ్రేక్

Date:

భారత్-పాక్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇషాన్ మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు. ఇషాన్ కిషన్ పాకిస్తాన్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. 40 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. దీనితో, ఇషాన్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో భారతదేశం తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు.

Also Read:CM Revanth Reddy : నేనే రాజు, నేనే మంత్రి అన్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ క్లారిటీ

మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియాకు దారుణమైన ఆరంభం లభించింది. సల్మాన్ అఘా మొదటి ఓవర్ వేసి అభిషేక్‌ను తొలి ఓవర్‌లోనే అవుట్ చేశాడు. అభిషేక్ తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. కానీ తర్వాత ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఆరు ఓవర్ల తర్వాత, భారతదేశం స్కోరు 52-1. ఇషాన్ కిషన్ కేవలం 27 బంతుల్లోనే తన అర్ధశతకం చేరుకున్నాడు. ఆ తర్వాత, ఇషాన్ కేవలం సిక్సర్లు, ఫోర్లు మాత్రమే ఆడాడు. కానీ తొమ్మిదో ఓవర్‌లో ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగుల వద్ద ఔటవడంతో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సామ్ అయూబ్ వికెట్ పడగొట్టాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮುಂದಿನ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ 141 ಸ್ಥಾನ ಗೆಲ್ಲುವ ವಿಶ್ವಾಸವಿದೆ- ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು,ಫೆಬ್ರವರಿ,14,2026 (www.justkannada.in):  ನಮಗೆ ವಿಶ್ವಾಸವಿದೆ ಕಾಂಗ್ರೆಸ್ ಮುಂದಿನ ಚುನಾವಣೆಯಲ್ಲಿ 141...

വെസ്റ്റ്ബാങ്കിലെ അധിനിവേശ പ്രദേശങ്ങള്‍ ദേശീയ സ്വത്തായി രജിസ്റ്റര്‍ ചെയ്യും; നീക്കത്തിന് അംഗീകാരം നല്‍കി ഇസ്രഈല്‍ സര്‍ക്കാര്‍

ടെല്‍അവീവ്: അധിനിവേശത്തിലൂടെ കയ്യടക്കിയ വെസ്റ്റ് ബാങ്കിലെ വലിയ പ്രദേശങ്ങള്‍ ദേശീയ സ്വത്തായി...

`அன்று கருணாநிதி ஒழிக; இன்று ஸ்டாலின் வாழ்க’ – கட்சித் தாவிய அதிமுக முன்னாள் அமைச்சர் நிலோஃபர்

இருக்கிற இடம் தெரியாதபடி ஒரு குழந்தை இருந்தால், `சமத்து’ என்பார்கள். அதுபோல,...

ಇಲ್ಲಿಯವರೆಗೆ 2.20 ಲಕ್ಷ ಕುಟುಂಬಗಳಿಗೆ ಹಕ್ಕು ಪತ್ರ ವಿತರಣೆ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಹಾವೇರಿ ಫೆಬ್ರವರಿ, 14,2026 (www.justkannada.in):  ಕಂದಾಯ ಇಲಾಖೆಯಿಂದ ಎರಡನೇ ಬಾರಿ...