Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) అఖండ విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్ బంగ్లాకు ప్రధాని కాబోతున్నారు. మొత్తం 300 స్థానాల్లో 200కు పైగా స్థానాలు సాధించింది. అయితే, ప్రధాన పోటీదారుగా ఉన్న జమాతే ఇస్లామీ విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది. ఎన్నికల ముందు ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని అనుకున్నప్పటికీ, బీఎన్‌పీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది.
ఇదిలా ఉంటే, ఈ ఎన్నికల్లో జమాత్ గెలిచిన స్థానాలు భారత్‌కు ప్రమాదంగా మారాయి. ముఖ్యంగా భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న బంగ్లాదేశ్ జిల్లాల్లో జమాత్ ఘన విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం, చికెన్స్ నెక్ కారిడార్‌ను ఆనుకుని ఉన్న బంగ్లా నియోజకవర్గాల్లో ఈ పార్టీ విజయం సాధించడం మనకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
Read Also: Sree Vishnu: శ్రీవిష్ణు Vs శ్రీవిష్ణు.. బాక్సాఫీస్ వద్ద నాతో నాకే పోటీ అంటున్న యువ హీరో!
జమాతే ఇస్లామీ మొత్తం 68 సీట్లు గెలిస్తే ఇందులో 51 భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పరిణామాలు భారత సరిహద్దుల్లో ఇస్లామిక్ రాడికలైజేషన్‌ను పెంచుతాయి. జమాత్ ఈ ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా రహస్యంగా పనిచేస్తోంది. ఉగ్రవాదులు, మతోన్మాదులకు జమాత్ ఆశ్రయం ఇస్తోంది. ఇదే కాకుండా దీనికి మనదేశంలో పనిచేస్తున్న కొన్ని ఇస్లామిస్టు గ్రూపులతో కూడా సంబంధాలు ఉన్నాయి. జమాత్ భారత్‌లోకి బంగ్లా చొరబాట్లను కూడా ప్రేరేపిస్తోంది. ఇప్పటికే చికెన్స్ నెక్(సిలిగురి కారిడార్) ప్రాంతంలో జనాభా స్వరూపం మారిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలోకి బంగ్లా చొరబాట్లు పెరిగాయి.
బంగ్లాలోని సత్ఖిరా, జెనైదా, జెస్సోర్, చపైనావాజ్‌గంజ్, కురిగ్రామ్, గైబంధ, కుష్టీయ, రాజ్షాహీ జిల్లాలు పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఈ జిల్లాలను ఆనుకుని భారత్‌లోని ముర్షిదాబాద్, నార్ 24 పరగణాలు, సిలిగురి, కూబ్ బెహార్ జిల్లాఉ ఉన్నాయి. మరోవైపు చికెన్ నెక్ ప్రాంతంలోనిర రంగ్‌పూర్ జిల్లాలో కూడా జమాత్ చాలా స్థానాలు గెలిచింది.





