12
February, 2026

A News 365Times Venture

12
Thursday
February, 2026

A News 365Times Venture

T20 World Cup: ఆఫ్ఘన్ ఆల్‌రౌండ్‌కి ఐసీసీ బిగ్‌షాక్.. ఏం జరిగిందంటే..?

Date:

ICC fines Afghanistan all-rounder Mohammad Nabi: నిన్న (బుధవారం) జరిగిన ఆఫ్ఘనిస్థాన్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌ ప్రపంచం వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగిందో చెప్పనవసరం లేదు. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఆఫ్ఘనిస్థాన్‌ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీకి ఐసీసీ షాక్ ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత టీ20 మ్యాచ్‌లో అంపైర్లతో వాగ్వాదానికి దిగిన కారణంగా చర్యలు తీసుకుంది. నబీ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.4ను ఉల్లంఘించినట్టు తేలింది. ఈ నిబంధన ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ సూచనలను పాటించకపోవడం తప్పుగా భావిస్తారు. ఆఫ్ఘనిస్థాన్‌ ఇన్నింగ్స్ 14వ ఓవర్ ఆరంభంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా పేసర్ లుంగీ ఎంగిడీ చేతికి ధరించిన రిస్ట్‌బ్యాండ్ విషయంలో నబీ అంపైర్లను ప్రశ్నిస్తూ వాదనకు దిగారు. అదే ఈ ప్లేయర్‌కు చెడ్డ పేరు తెచ్చింది.

READ MORE: Ghooskhor Pandat : మనోజ్ బాజ్‌పేయీ ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’ మూవీ టైటిల్‌పై సుప్రీంకోర్టు సీరియస్..

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇది ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌లోనే అత్యంత ఉత్కంఠభరిత పోరుగా నిలిచింది. ఫలితం తేలడానికి రెండు సూపర్ ఓవర్లు అవసరమయ్యాయి. చివరకు దక్షిణాఫ్రికా విజయం సాధించింది. నబీకి ఈ మ్యాచ్ కలిసి రాలేదు. రెండు ఓవర్లు వేసిన నబీ 20 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్‌లో ఆరు బంతుల్లో ఐదు పరుగులకే పరిమితమయ్యాడు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌ తరఫున వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ అద్భుతంగా ఆడాడు. 42 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు. చివర్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు వేగంగా పరుగులు చేసి స్కోరు సమం చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. మొదటి సూపర్ ఓవర్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ ఎంగిడీపై రెండు బౌండరీలు, ఒక సిక్స్ కొట్టి 17 పరుగులు సాధించాడు. కానీ దక్షిణాఫ్రికా తరఫున ట్రిస్టన్ స్టబ్స్ రెండు భారీ సిక్సులు బాదడంతో మ్యాచ్ రెండో సూపర్ ఓవర్‌కు చేరింది. రెండో సూపర్ ఓవర్‌లో డేవిడ్ మిల్లర్, స్టబ్స్ కలిసి మూడు సిక్సులు బాదుతూ 23 పరుగులు చేశారు. ఇది పెద్ద లక్ష్యంలా కనిపించినా, గుర్బాజ్ మళ్లీ పోరాడాడు. కేశవ్ మహారాజ్‌పై వరుసగా మూడు సిక్సులు కొట్టి మ్యాచ్‌ను మళ్లీ ఉత్కంఠకు గురి చేశాడు. చివరికి ఔటవడంతో ఆఫ్ఘనిస్థాన్‌ విజయం అందుకోలేకపోయింది. ఇలా ఉత్కంఠభరిత పోరులో ఓడినా, మ్యాచ్ మాత్రం అభిమానులకు అసలు టీ20 మజా చూపించింది.

READ MORE: Jasprit Bumrah-Ishan Kishan: జస్ప్రీత్ బుమ్రా యార్కర్.. ఇషాన్ కిషన్‌కు భారీ గాయం, డౌటే ఇగ (వీడియో)!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಆಳಂದದ ದರ್ಗಾದಲ್ಲಿ ಶಿವರಾತ್ರಿ ಪೂಜೆಗೆ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಗ್ರೀನ್ ಸಿಗ್ನಲ್

ಕಲಬುರಗಿ, ಫೆಬ್ರವರಿ,12,2026 (www.justkannada.in):  ಆಳಂದದ ವಿವಾದಿತ ಲಾಡ್ಲೇ ಮಶಾಕ್ ದರ್ಗಾದಲ್ಲಿ...

വലതുപക്ഷത്തിനെതിരായ വിമര്‍ശനങ്ങള്‍ അല്‍പ്പബുദ്ധികള്‍ കാണുന്നില്ല, ജല്‍പ്പനങ്ങളില്‍ പ്രതികരിച്ച് സമയം കളയാനുമില്ല: സച്ചിദാനന്ദന്‍

കോഴിക്കോട്: കേരളത്തില്‍ ഭരണമാറ്റം ഉണ്ടാകണമെന്ന പ്രസ്താവനയ്ക്ക് പിന്നാലെ നേരിടുന്ന സൈബര്‍ ആക്രമണത്തില്‍...

நாடாளுமன்றம்: `இடைநீக்கங்கள், பதில் இல்லா கேள்விகள்' – முடங்குகிறதா ஜனநாயகத்தின் இதயம்?

நாடாளுமன்றம்இந்தியா, உலகின் மிகப்பெரிய ஜனநாயக நாடு மட்டுமல்ல, உலகிலேயே மிக நீண்ட...

ಶಾಸಕ ಭೈರತಿ ಬಸವರಾಜ್ ಗೆ ಶಾಕ್: ಸುಪ್ರೀಂನಲ್ಲೂ ಜಾಮೀನು ಅರ್ಜಿ ವಜಾ

ನವದೆಹಲಿ,ಫೆಬ್ರವರಿ,12,2026 (www.justkannada.in):  ರೌಡಿಶೀಟರ್ ಬಿಕ್ಲುಶಿವ ಕೊಲೆ ಪ್ರಕರಣಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಬಿಜೆಪಿ...