30
March, 2026

A News 365Times Venture

30
Monday
March, 2026

A News 365Times Venture

CM Chandrababu: జగన్ ఇంటి దగ్గర హెలిప్యాడ్ భూమిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Date:

CM Chandrababu: మంత్రులు. సెక్రెటరీల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ఇంటి దగ్గర ఉన్న హెలిప్యాడ్ భూమిపై ఆరా తీశారు. జగన్ ఇంటి పక్కన ఉన్న హెలిప్యాడ్ కోసం భూమిని బలవంతంగా లాక్కున్నారు.. ప్రైవేట్ వ్యక్తికి దగ్గర కొనుక్కున్న భూమిని హెలిప్యాడ్ కోసం ఇవ్వనంటే.. బెదిరించారు.. అయినా ఇవ్వకపోతే.. 22-Aలో పెట్టారు.. ప్రైవేట్ ల్యాండ్ ను దుర్మార్గంగా లాక్కున్నారు.. చట్టాలు చేయాల్సిన ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయాల్సిన వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి భూమిని ఇల్లీగల్ గా 22-A లో పెట్టాడు.. ఇది పరాకాష్ట కాదా? అని ప్రశ్నించారు. ఐదేళ్లు అవుతున్న అతనికి విముక్తి కలగలేదని తెలిపారు. మొన్న కలిసి అన్ని వివరాలు ఇచ్చారు.. భూములపై అప్పటి పాలకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు అనే దానిపై అందరూ ఆలోచించాలని చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: Lok Sabha: స్పీకర్‌ తీరుపై విపక్షాల ఆందోళన.. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఏర్పాట్లు

ఇక, రెవెన్యూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రాష్ట్రవ్యాప్తంగా ఇస్తున్నాం.. భూ వివాదాలు లేకుండా.. పకడ్బందీగా సర్వే ప్రక్రియ చేపడుతున్నాం.. క్యూఆర్ కోడ్ సహా ఇతర భద్రతా ఫీచర్లతో పాస్ పుస్తకాలను అందజేస్తు్న్నాం.. సాగునీటి కోసం ఇప్పటి వరకూ రూ. 24 వేల కోట్లు ఖర్చు చేశాం.. క్వాంటం వ్యాలీకి ఇటీవలే శంకుస్థాపన చేసి అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా మారుస్తు్న్నాం.. విశాఖలో గూగుల్ తో పాటు ఇతర సంస్థలు కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాయి.. మొత్తం 5 గిగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్లు రాబోతున్నాయి.. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా తయారీకి కూడా కార్యాచరణ మొదలైంది అని చంద్రబాబు వెల్లడించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಶಾಸಕರಿಗೆ 3 IPL ಟಿಕೆಟ್ ಕೊಡಲು ಕೆಎಸ್ ಸಿಎ ಒಪ್ಪಿಗೆ- ಡಿಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು ,ಮಾರ್ಚ್,30,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ ಭಾರೀ ಚರ್ಚೆಗೆ ಗ್ರಾಸವಾಗಿರುವ  ಜನರಿಂದ...

ഹോര്‍മുസ് തുറന്നില്ലെങ്കില്‍ ഇറാന്റെ എണ്ണക്കിണറുകളും പവര്‍ പ്ലാന്റും ബോബിട്ട് നശിപ്പിക്കും; അന്ത്യശാസനവുമായി ട്രംപ്

വാഷിങ്ടണ്‍: ഹോര്‍മുസ് കടലിടുക്ക് ഉടനടി തുറന്നുകൊടുത്തില്ലെങ്കില്‍ ഇറാന്റെ എണ്ണക്കിണറുകളും പവര്‍ പ്ലാന്റുകളും...